C.K.BABU
-
వైఎస్సార్సీపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా.. హైదరాబాద్: చిత్తూరు ఎమ్మెల్యే సి.కె.బాబు (జయచంద్రారెడ్డి), తణుకు ఎమ్మెల్యే కారుమూరు వెంకట నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వారిద్దరూ బుధవారం వైస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో విడివిడిగా కలుసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నెల్లూరు జిల్లా సీనియర్ నేత వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, చింతలపూడి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు సన్నిహిత సహచరుడైన గంటా మురళి కూడా జగన్‌ను కలిసి పార్టీ లో చేరారు. తన సతీమణి లావణ్యతో వచ్చిన సి.కె.బాబుకు జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లావణ్యకు గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. కారుమూరు పెద్ద సంఖ్యలో తన అనుచరులతో వచ్చి పార్టీలో చేరిన సందర్భంగా నర్సాపురం, ఏలూరు లోక్‌సభ పార్టీ సమన్వయకర్తలు ఎం.ప్రసాదరాజు, తోట చంద్రశేఖర్ కూడా ఉన్నారు. వేణుగోపాల్‌రెడ్డి చేరిక సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి కూడా ఉన్నారు. వైఎస్ పథకాలు ఆదర్శనీయం: కారుమూరు పదేళ్ల కిందట భయానకమైన కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజానీకానికి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పథకాలు ఎంతో మేలు చేశాయని, ఇవన్నీ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే అమలవుతాయనే విశ్వాసంతోనే పార్టీలో చేరానని నాగేశ్వరరావు చెప్పారు. వైఎస్ పథకాల వల్ల బడుగు, బలహీనవర్గాలకు ఎక్కువగా మేలు జరిగిందన్నారు. తన లేఖతోనే రాష్ట్రం విడిపోయిందని తెలంగాణలో మాట్లాడుతూ... సీమాంధ్రలో మరో విధంగా చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిలకడలేని నాయకుడని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. సీఎం అంటే వైఎస్సే: కోదండరామిరెడ్డి వైఎస్ నిత్యం నవ్వుతూ ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో అలా ఉండేవారని సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కొనియాడారు. ముఖ్యమంత్రిననే భావం లేకుండా అందరినీ పలకరిస్తూ పేద, బడుగు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని చెప్పారు. వైఎస్ అంటే తనకు అపారమైన గౌరవాభిమానాలున్నాయని, ఆయన కడుపున పుట్టిన బిడ్డగా జగన్ ఆంధ్రప్రదేశ్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలరని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అందుకే తాను పార్టీలో చేరానని కోదండరామిరెడ్డి వెల్లడించారు. బాబును, బీజేపీని ప్రజలు నమ్మరు: వంటేరు రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబును, దగ్గరుండి విభజన జరిపించిన బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మరని వంటేరు వేణుగోపాలరెడ్డి చెప్పారు. కొత్త రాష్ట్రం జగన్ నేతృత్వంలో అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంద న్నారు. వేణుగోపాలరెడ్డి 1999లో కావలి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో నెల్లూరు లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. -
సీకే అడుగులెటు?
రేపు అనుచరులతోసమావేశం 21న భవిష్య కార్యాచరణ ప్రకటన చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: చిత్తూరు (కాంగ్రెస్ పార్టీ) ఎమ్మెల్యే సీకే.బాబు రాజకీయంగా ఎలాంటి అడుగులేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదే విషయమై ఆయన తన అనుచరులతో శుక్రవారం సమావేశం కానున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ సీకే.బాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు రాజీనామా పత్రాన్ని మంగళవారం సాయంత్రం ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఓట్లు, సీట్ల కోసం తెలుగుజాతిని రెండుగా చీల్చడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఉద్యమంలో ఇలా.. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరిస్తూ గత ఏడాది జూలై 30న ప్రకటన చేసింది. అదే రోజు రాత్రి సీకే.బాబు రోడ్డుపైకి వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏడు రోజులు నగరంలో ఆమరణ నిరహారదీక్ష చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు నుంచి వందలాది మందితో తిరుమలకు పాదయాత్ర చేశారు. జిల్లాలో ఉద్యోగ సంఘ, ఎన్జీవో నేతలు సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక పేరిట ఫోరం ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా అధ్యక్షుడిగా సీకే.బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి రెండు నెలలు చిత్తూరులో సమై క్య ఉద్యమం సాగింది. రాష్ట్రం విడిపోతే తన ఎమ్మెల్యే పదవిని ఏ మాత్రం లెక్కచేయబోనని సీకే అప్పట్లోనే ప్రకటించారు. రేపు సమాలోచన? ఎమ్మెల్యే పదవికి రాజీనామా వరకే సీకే.బాబు ప్రస్తుతానికి పరిమితమయ్యారు. కాంగ్రెస్ లో కొనసాగుతారా లేదా అన్న దానిపై ప్రకటన చేయలేదు. వ్యక్తిగత పనులపై ఉన్న ఆయన శుక్రవారం తన అనుచరులతో సమాలోచన సమావేశం ఏర్పా టు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. కాంగ్రెస్ లో కొనసాగడమా, వేరే పార్టీ లో చేరడమా? స్వతంత్ర అభ్యర్థిగా సమైక్య నినాదంతో ప్రజ ల్లోకి వెళ్లడమా అనే విషయంపై ఆ రోజు స్పష్టత రానుంది. ఈ నెల 21న సీకే.బాబు తన రాజ కీయ భవిష్య కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయి. -
భగ్గుమన్న జనం
సాక్షి, తిరుపతి: కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలపడంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెల కొంది. పీలేరులో ఇద్దరు యువకులు ఆత్మాహుతియత్నం చేశారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. జేఏసీ నేతలు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. తిరుపతి బంద్‌కు ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసీ జేఏసీ నాయకులు శుక్రవారం బంద్ ప్రకటించారు. గురువారం రాత్రి తిరుచానూరు సమీపంలోని తనపల్లి బైపాస్ రోడ్డును దిగ్బంధం చేశారు. వడమాలపేట రోడ్డును అక్కడి జేఏసీ నాయకులు దిగ్బంధం చేశారు. శుక్రవారం తిరుమలకు వాహనాలను కూడా నిలిపివేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. పీలేరులో పెట్రో లు బంక్‌లు మూసి వేశారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప లమనేరులో 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకే.బాబు నాయకత్వంలో 72 గంటల బంద్ చేపట్టనున్నారు. కుప్పం, శ్రీకాళహస్తి, నగ రి, మదనప ల్లె నియోజకవర్గాల బంద్ కు సన్నాహా లు జరుగుతున్నాయి. జిల్లాలోని వివిధ పార్టీల నాయకులు కేంద్ర కేబినెట్ నిర్ణయంపై మండిపడ్డారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ సోనియా, చంద్రబాబు కుట్రకు నిదర్శంగా టీ నోట్ ఆమోదం పొందిందని తెలిపారు. ఆ పార్టీ నాయకుడు వరప్రసాదరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు విభజన ద్రోహులని తెలిపారు. కాంగ్రెసు నాయకుడు పులుగోరు మురళి మాట్లాడుతూ సోని యాగాంధీ సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీని నాశనం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కేవలం తన కుమారుడిని ప్రధానిని చేయడం కోసం ఈ చర్యకు పాల్పడ్డారని అన్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లును పార్లమెంటులో చింపి వేస్తామని ప్రకటించారు. విభజనను ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించబోమని అన్నారు. తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు నోట్ రెడీ అవుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆఖరి నిముషంలో అయినా రాజీనామాలు చేసి ఉంటే కేంద్రం వెనకడుగు వేసి ఉండేదని అన్నా రు. తెలుగుజాతి మనోభావాలను ఢిల్లీలో బహిరంగంగా తాకట్టు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ టవర్‌కు నిప్పు తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు మొగ్గు చూపుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్‌ను ఆమోదించడంపై మండిపడ్డ సమైక్యవాదులు శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి ఎదురుగా రైల్వే ట్రాక్ వద్దనున్న సెల్ టవర్‌ను గురువారం అర్ధరాత్రి తగులబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే సెల్ టవర్ సగానికి పైగా కాలిపోయింది. -
హోరెత్తిన జనగర్జన
సమైక్య నినాదాలతో చిత్తూరు మార్మోగింది.రాష్ట్ర విభజన ప్రక్రియకు నిరసనగా శనివారం నిర్వహించిన సమైక్య జనగర్జన హోరెత్తింది. అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. నగర వీధులన్నీ సమైక్యవాదులతో కిక్కిరిసి పోయాయి. ఉద్యమాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఎండను సైతం లెక్కచేయక గంటల తరబడి జనం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉద్యమ తీవ్రతను ఢిల్లీ పెద్దలకు తెలియజేస్తామని వక్తలు స్పష్టం చేశారు. చిత్తూరు (కలెక్టరేట్),న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను నిరసిస్తూ చిత్తూరులో శనివారం జరిగిన జనగర్జనకు అశేషంగా జనం తరలివచ్చారు. చిత్తూరు నగరం సమైక్య నినాదాలతో మార్మోగింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎస్‌ఆర్‌పీవీ జిల్లా చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే సీకేబాబు అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ హాజరయ్యారు. జనగర్జనకు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి తమ సమైక్యగళాన్ని ఢిల్లీ పెద్దలకు వినిపించారు. ఉద్యమస్ఫూర్తి ప్రతిబిం బించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఎండను సైతం లెక్కచేయని సమైక్యవాదులు గంటల తరబడి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పీసీఆర్ ఉన్నత పాఠశాల సర్కిల్లోని పూలే విగ్రహం వద్ద జనగర్జన జరిగింది. వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భక్తవత్సలంనాయుడు, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కృష్ణయాదవ్‌తో పాటు జిల్లా అధికారులు, అన్ని వర్గాలకు చెందిన జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా తెలుగుతల్లి, శ్రీపొట్టి శ్రీరాముల చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమైక్యాంధ్ర కోసం ఆశువులు బాసిన వారికి రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. జిల్లా అధికారుల జేఏసీ, సాస్ జేఏసీ, రెవెన్యూ, ఆర్టీసీ, విద్యాశాఖ, ప్రైవేటు పాఠశాలలు, నాల్గొవ తరగతి, కార్మిక, కర్షక, విద్యుత్, న్యాయవాదుల, విద్యార్థి జేఏసీ నాయకులు సభావేదికపై సమైక్య అభివాదం చేశారు. తెలుగువారి సమైక్యతను చాటేందుకు వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు వేదికపై చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లా అధికారులు, రవాణా శాఖ ఉద్యోగులు, అన్ని వర్గాల జేఏసీ కన్వీనర్లు నల్లటోపీలు ధరించారు. ఏపీఎంఐపీ ఉద్యోగులు చేతపట్టిన గొడుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీకేబాబు, గెజిటెడ్ జేఏసీ చైర్మన్ వెంకటసుబ్బారెడ్డి, సాస్ జేఏసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, రవాణా శాఖ ఉప కమిషనర్ బసిరెడ్డి ప్రజల చేత సమైక్య నినాదాలు చేయించారు. కార్యక్రమానికి హాజరైన వారికి తాగునీటిని అందించారు. విద్యార్థులకు మజ్జిగ పాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జనగర్జనకు మహిళలు, వ్యాపారులు స్వచ్ఛందంగా తరలివచ్చారు.