clasical dance
-
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు (ఫోటోలు)
-
USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి అక్టోబర్ 1 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపైకి చేర్చే ఈ ఉత్సవాలను గతంలో 3 సార్లు వివిధ దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించింది. 4వ విడత ఉత్సవాలను ఈ ఏడాది వాషింగ్టన్ డిసిలోని నేషనల్ మాల్ ప్రాంగణంలో మరింత ఘనంగా, చిరస్మరణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసిలోని క్యాపిటల్ భవనం ముందున్న విశాల ప్రాంగణంలో ఫుట్ బాల్ మైదానమంత విస్తీర్ణంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి 17,000 మంది కళాకారులు, అనేక దేశాల నేతలు, ప్రముఖులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారని అంచనా వేస్తున్న ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా 50కి పైగా ప్రదర్శనలు జరుగబోతున్నాయి. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అమరుడయిన మార్టిన్ లూధర్ కింగ్ ప్రఖ్యాత ఉపన్యాసం “ఐ హావ్ ఎ డ్రీమ్” ను నేషనల్ మాల్ వేదికపై నుండే ఇచ్చారు.1963వ సంవత్సరంలో జరగిన ఈ ఉపన్యాసం ద్వారా ప్రపంచ సమైక్యత, సమానతా సందేశాన్ని అందరికీ చాటిచెప్పాడు. దానికి ఒక శతాబ్ది క్రితం షికాగోలోని ప్రపంచ పార్లమెంటు సదస్సులో స్వామి వివేకానందుని ఉపన్యాసం అక్కడి ప్రజలను సన్మోహితులను చేసి, ఆయన జ్ఞానానికి పాదాక్రాంతులను చేసింది. ప్రపంచంలోని వివిధ మత నాయకులను తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు గా పేర్కొంటూ మతవిశ్వాసాల పేరుతో ప్రజలను విభజించడం, ఇతర ధర్మాల పట్ల అసహనం విడనాడ వలసిందిగా అతడు హితవు పలికాడు. ఈ సెప్టెంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్న ఈ చారిత్రాత్మక ఉత్సంలో శ్రీ శ్రీ రవిశంకర్, ప్రపంచంలో దేశాలు, ధర్మాలు, జాతుల మధ్య భేదాభిప్రాయాలను, అంతరాలను చెరిపివేసి, 180 దేశాలకు చెందిన ప్రజలను “ఒకే ప్రపంచ కుటుంబం” గా ఒకే వేదికపై ఆవిష్కరిస్తారు.మానవాళిని సమైక్యంగా ఉంచేవాటిలో ప్రధాన పాత్రగా ఉండే ఆహారం అనేది ఇక్కడ కూడా తన పాత్రను పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధదేశాలకు చెందిన వంటకాలు ఇక్కడి కార్యక్రమాలకు హాజరయ్యే ప్రేక్షకులకు విందుచేయనున్నాయి. ఈ సారి అనేకమంది ఔత్సాహిక కళాకారులు సైతం తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా హాజరౌతున్నవారిలో ఐక్యరాజ్య సమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్, భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్, అమెరికాలోని ప్రముఖ వైద్యుడు వివేక్ మూర్తి, అమెరికా సెనేటర్ రిక్ స్కాట్, నాన్సి పెలోసి, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సురినామ్ దేశ రక్షణ మంత్రి కృష్ణకుమారి మాథెరా ఉన్నారు. -
క్లాసికల్ డాన్సర్, పద్మభూషణ్ అవార్డు గ్రహిత హఠాన్మరణం
లెజెండరి క్లాసికల్ డాన్సర్, పద్మభూషన్ అవార్డు గ్రహిత కనక్ రెలే(85) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె మృతికి నటి హేమ మాలిని,సుధచంద్రన్లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కనక్ రెలే మోహీని అట్టం డాన్స్‌లో ప్రావీణ్యురాలు. చదవండి: కేరళ హైకోర్టులో మోహన్ లాల్‌కు చుక్కెదురు! అంతేకాదు ఆమె నలంద నృత్య కళా మహావిద్యాలయ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్ కూడా. శాస్త్రీయ నృత్యానికి ఆమె అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. జూన్ 11, 1937లో గుజరాత్లో జన్మించిన కనక్ రెలే భారతదేశపు అత్యంత సృజనాత్మక శాస్త్రీయ నృత్యకారులలో ఒకరిగా పేరు పొందారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఆమె మేనమామ కళలను నెరవేర్చాలని భావించి నాట్యాన్ని నేర్చుకున్నారు. చదవండి: గుడ్ మార్నింగ్ అమెరికా షోలో చరణ్, చిరంజీవి ఏమన్నారంటే! Shocked to hear that Padmabhushan Kanak Rele ji has passed away. A dutiful family person, she was a true visionary, academician & a Mohini Attam performer par excellence. It is a day of great grief to the Rele and Nalanda Parivaar and the classical dance fraternity. Om Shanti 🙏 pic.twitter.com/HDhRFGO7j0 — Hema Malini (@dreamgirlhema) February 22, 2023 -
వైరల్ అవుతోన్న జూ. ఎన్టీఆర్ అరుదైన వీడియో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్... టాలీవుడ్లో ఈపేరు చాలా ప్రత్యేకమైనది. ఆయన ఎంతటి టాలెంటెడ్ నటుడో.. అంతే మంచి డ్యాన్స్‌ర్ కూడా. హీరోగా, డ్యాన్స్‌ర్‌గా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తారక్. వెస్టర్న్తో పాటు ఆయన క్లాసీకల్ డ్యాన్స్ కూడా నేర్చుకున్న సంగతి తెలిసిందే. బాలరామయణం సినిమాతో పరిశ్రమలో అడుగు పెట్టిన తారక్.. అంతకు ముందు క్లాసికల్ డ్యాన్సర్‌గా పలు స్టేజ్ షోలు ఇచ్చాడు. అయితే ఆ వీడియోలను చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా తారక్ భరత నాట్యంకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. టీనేజ్‌లో ఉండగా ఎన్టీఆర్ స్టేజ్‌పై నాట్యం చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చూసి ఆయన అభిమానులు తెగ మురిసిపోతూ పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేస్తున్నారు. కాగా ఎన్టీఆర్‌కు చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే అమితమైన ఆసక్తి ఉండేదట. అది తెలిసి ఆయన తల్లి శాలిని నృత్యకళలో శిక్షణ ఇప్పించారట. డ్యాన్స్ నేర్చుకుంటున్న సమయంలోనే ఎన్టీఆర్ స్టేజ్‌పై నృత్యకళ ప్రదర్శనలు ఇస్తూ ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ కోమరం భీంగా కనిపించనున్న సంగతి తెలిసిందే. చదవండి: కొడుకుతో జూనియర్ ఎన్టీఆర్ షికారు చావు కబురు చల్లగా: అక్కడ డిజాస్టర్.. ఇక్కడ బ్లాక్‌బస్టర్ -
క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన సాయేషా
కరోనా లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖుల్లో చాలా మంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రముఖ తమిళ హీరో ఆర్య సతీమణి, హీరోయిన్ సాయేషా సైగల్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఓ సాంగ్‌కు క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు సాయేషా డ్యాన్స్ అద్భుతంగా ఉందంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయేషా గతంలో కూడా తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : యువ దర్శకుడు మృతి.. విషాదంలో శంకర్) కాగా, బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్ మనవరాలైన సాయేషా.. తెలుగు చిత్రం అఖిల్‌తో వెండితెరకు పరిచమయ్యారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో.. తెలుగులో ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు. అఖిల్ అనంతరం బాలీవుడ్లో అజయ్ దేవగణ్.. శివాయ్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆమె తమిళంలో పలు చిత్రాల్లో నటించారు. గతేడాది హీరో ఆర్యను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఒకటి తమిళ చిత్రం కాగా, మరోకటి కన్నడ చిత్రం. -
ఆకట్టుకున్న నవ జనార్దన పారిజాతం
-
సరయు : డాన్స్, ఫైట్స్, ఆర్ట్స్
ఆ బాలిక కుంచె పట్టుకుంటే ‘చిత్రమై’న అనుభూతినిచ్చే సూర్యోదయం ఆవిష్కృతమవుతుంది. గజ్జె కట్టుకుంటే సంప్రదాయం ఘల్లు మంటుంది. యాహూ అని కేక పెట్టిందంటే ఈవ్ టీజర్లకు వణుకుపుడుతుంది. జన్మతః అమెరికా వాసి అయినా సనాతన భారతీయ కళలపై తరగని ఇష్టంతో పాటు నవతరం అభిరుచులకు తగ్గట్టుగా చిత్రకళ, మార్షల్ ఆర్ట్స్... ఇలా సకల కళల్లోనూ రాణిస్తోంది సరయు. అంతేకాదు... ఎంతగా కళలపై ఆసక్తి పెంచుకుంటే అంతగా ఇటు చదువులోనూ మంచి ఫలితాలు వస్తాయంటోంది. ‘‘ఆధ్యాత్మిక భావాలు, చారిత్రక మూలాలు తెలిపే నాట్యం ఓ వైపు మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చింది. మరోవైపు చదువులోనూ రాణించేందుకు ఉపకరించింది’’అని చెప్పింది సరయు (15). సాఫ్ట్వేర్ ఉద్యోగులైన తల్లిదండ్రులు విజయ్, గీతల ఇద్దరు సంతానంలో ఒకరైన సరయు... అమెరికాలో ఉంటున్న భారతీయ చిన్నారుల సంప్రదాయ అభిరుచులకు నిదర్శనం కరాటే కిక్ కొట్టినా.. కాళ్లకు గజ్జకట్టినా... ‘‘ఎంత నాట్యం నేర్చుకోవాలనుకున్నా కాలిఫోర్నియాలో శిక్షకుకులు దొరకడం కష్టంగా మారింది. అయినా పట్టు వదలకుండా ఉన్న నన్ను చూసి అమ్మా నాన్నలు ఎలాగోలా నాట్య గురువును పట్టుకున్నారు’’ అంటూ చెప్పింది సరయు. పద్యాలకు అర్ధమే తెలియని ఐదేళ్ల వయసులో ప్రారంభమైన ఆమె నాట్యాభ్యాసం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఎన్నో బృంద ప్రదర్శనల్లో పాల్గొన్న ఆమె... ఈనెల 20న బెంగుళూర్లో సోలో ప్రదర్శన ద్వారా ఆరంగేట్రం చేయాలనుకుంటోంది. మరోవైపు కరాటేలో కూడా సరయు ప్రతిభ చాటుతోంది. సెకండ్ డిగ్రీ బ్లాక్ బెల్ట్‌ను స్వంతం చేసుకుంది. నాట్యం సెల్ఫ్ ఎక్స్ప్రెషన్కైతే.. మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్‌కి అంటుందీ బాలిక. తెలుగు, ఇంగ్లీషు భాషలతో పాటు స్పానిష్ భాష కూడా ప్రావీణ్యం సంపాదించింది. చిత్రకళలోనూ రాణిస్తూ అనేక బహుమతులు అందుకుంటోంది. తాను గీసిన చిత్రాలను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడం విశేషం. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టెన్నిస్ క్రీడల్లోనూ ప్రవేశమున్న సరయు... ఇదంతా కూడా చదువే అంటుంది. డెర్మటాలజిస్ట్ కావాలని..! ఒత్తిడితో కూడిన సంక్లిష్టమైన ఇంటర్నేషనల్ బ్యాక్కల్యూరేట్ (ఐబి) కరిక్యులమ్కీ, తన సకల కళాభ్యాసానికి మధ్య ఆమె విజయవంతంగా బ్యాలెన్స్ చేసుకుంది. గత మే నెలలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి తన గ్రేడ్ టెన్ ఐబి పూర్తి చేసుకుంది. డెర్మటాలజిస్ట్ కావాలనేది ఆమె లక్ష్యం. తనను తాను మాత్రమే కాకుండా తన సంస్కృతీ సంప్రదాయాలను కూడా ఇతరులకు తెలియజెప్పడంలో నాట్యం ఒక ప్రధాన మార్గం అంటుంది. – ఎస్.సత్యబాబు -
నృత్యార్చన