class action suit
-
భారతీయులేనా పనిమంతులు.. మేం పనికి రామా? టీసీఎస్‌పై అమెరికన్ల ఆగ్రహం!
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్) చిక్కుల్లో పడింది. ఉద్యోగుల్ని నియమించుకునే విషయంలో వివక్ష చూపుతుందంటూ ఆ సంస్థ మాజీ ఉద్యోగి కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. గతవారం (డిసెంబర్7)న టీసీఎస్ మాజీ ఉద్యోగి కాట్జ్ అమెరికా న్యూజెర్సీ జిల్లా కోర్టును ఆశ్రయించారు. అమెరికాలో ఉద్యోగుల నియామకంలో స్థానికులపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ దాఖలు చేసిన క్లాస్ యాక్షన్ దావాలో పేర్కొన్నారు. స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు సౌత్ ఏషియన్, భారతీయుల్ని మాత్రమే ఎంపిక చేసుకుంటుందని, స్థానికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీసీఎస్ కావాలనే ఉద్దేశపూర్వకంగా యునైటెడ్ స్టేట్స్లో దాదాపు 70శాతం దక్షిణాసియా ఉద్యోగులను (ప్రధానంగా భారత్ నుండి) నియమించారనేది ప్రధాన ఆరోపణ భారతీయులేనా పనిమంతులు ఆఫీస్ వర్క్ విషయంలో టీసీఎస్ భారతీయులు, అమెరికన్లు మధ్య వ్యత్యాసం చూస్తుందని కోర్టులో వాదించారు. యూఎస్‌కి చెందిన ఐటీ పరిశ్రమలో కేవలం 12శాతం నుండి 13 శాతం మంది మాత్రమే దక్షిణాసియాకు చెందినవారు ఉంటే.. అమెరికాకు చెందిన టీసీఎస్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 70శాతం దక్షిణాసియాకు చెందిన వారు ఉన్నారని అన్నారు. వర్క్ వీసాల (హెచ్1 బీ) ద్వారా యూఎస్‌కు వచ్చిన వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారని కోర్టులో దావా వేసిన టీసీఎస్ మాజీ ఉద్యోగి కాట్జ్ వెల్లడించారు. 9 ఏళ్ల పాటు ఉద్యోగం 9 సంవత్సరాలకు పైగా టీసీఎస్‌లో పనిచేసిన కాట్జ్, వివిధ ప్రాజెక్టులకు ఉద్యోగులను కేటాయించే హెచ్ఆర్ విభాగం నుంచి సరైన సహాయం లేకపోవడం,సంస్థలో సరైన అవకాశాలు లభించకపోవడంతో తనను తొలగించారని పేర్కొన్నారు. కాబట్టి టీసీఎస్ చట్టవిరుద్ధమైన నియామకాలు చేపట్టకుండా నిరోధించాలని, వివక్ష లేని నియామక పద్ధతులను అవలంబించాలని ఫిర్యాదుదారు అభ్యర్థించారు. జాబ్ నుంచి తొలగించినందుకు నష్టపరిహారం కావాలని కోర్టును కోరాడు. టీసీఎస్‌కు అనుకూలంగా గతంలో టీసీఎస్ ఇదే తరహా వివాదంలో చిక్కుకుంది. 2019లో ముగ్గురు మాజీ ఉద్యోగులు దాఖలు చేసిన ఇదే విధమైన వ్యాజ్యంపై కాలిఫోర్నియా జిల్లా కోర్టు టీసీఎస్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. భారతీయ ఐటి సంస్థ యుఎస్ కార్యాలయాల్లో అమెరికన్లకు బదులుగా భారతీయులతో పనిచేయడానికి ఇష్టపడుతుందన్న వాదనలను జ్యూరీ తిరస్కరించింది. టీసీఎస్‌తో పాటు ఇతర టెక్ కంపెనీలు సైతం టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్,హెచ్‌సిఎల్‌టెక్, విప్రో వంటి ఇతర భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు అమెరికాలో వివక్షతతో కూడిన నియామకాలు చేపడుతున్నాయంటూ ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. -
విప్రోపై అమెరికాలో ‘క్లాస్ యాక్షన్’ దావా
వాషింగ్టన్: ఉద్యోగులపై వివక్ష చూపిస్తోందంటూ ఐటీ దిగ్గజం విప్రోపై అమెరికాలో అయిదుగురు ఉద్యోగుల బృందం క్లాస్ యాక్షన్ దావా వేసింది. దక్షిణాసియా, భారతీయ మూలాలున్న వారికే ప్రాధాన్యమిస్తోందని న్యూజెర్సీ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన కేసులో ఆరోపించింది. మొత్తం అమెరికా ఐటీ పరిశ్రమలో దక్షిణాసియా ఉద్యోగుల సంఖ్య 12% కాగా, ఒక్క విప్రో అమెరికా విభాగంలో ఏకంగా 80% మంది ఉన్నారని (ప్రధానంగా భారతీయులు) ఉద్యోగుల బృందం పేర్కొంది. కోర్టులో వ్యాజ్యం ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించబోమని విప్రో తెలిపింది. -
మరోసారి చిక్కుల్లో విప్రో
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో మరోసారి చిక్కుల్లో పడింది. తమపై జాతి వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ అయిదుగురు మాజీ ఉద్యోగులు సంస్థపై దావా వేశారు. 2020 మార్చి 30 న న్యూజెర్సీ జిల్లా కోర్టులో వీరు తాజా క్లాస్ యాక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. దక్షిణ ఆసియన్లు, భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, విప్రో అనుసరిస్తున్న ఈ వివక్ష కారణంగా తాము ఉద్యోగాలు కోల్పోయామని వాదించారు. అమెరికాలో ఉన్న దక్షిణ ఆసియన్లు, భారతీయులు కానివారికి అప్రైజల్ స్కోర్క్ ఇవ్వడంలేదని, అలాగే వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన వీరిలో అధిక సంఖ్యలో ఉద్వాసనకు గురవుతున్నారని ఆరోపించారు. దక్షిణ ఆసియన్లు, భారతీయులం కాదనే నెపంతో సంస్థ తమపై 'జాతి వివక్ష' చూపిస్తోందని అమెరికాలోని ఐదుగురు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగులపై పదోన్నతులు, జీతం పెంపు, తొలగింపు నిర్ణయాలకు సంబంధించి తేడాలు చూపిస్తోందన్నారు. దీని ఫలితంగా తాము ఉద్యోగాల్ని కోల్పోయామని పేర్కొన్నారు. నియామకం, పదోన్నతి ఇతర నిర్ణయాల్లో వివక్షత లేని పద్ధతిని అవలంబించాలనే ఆదేశాలతో పాటు, ఫెడరల్ రూల్స్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారం , చట్టవిరుద్ధమైన విధానాలలో పాల్గొనకుండా శాశ్వత నిషేధానికి అనుగుణంగా దావాను 'క్లాస్ యాక్షన్' గా వర్గీకరించాలని కోర్టును కోరారు. గత పదేళ్లుగా విప్రోలో పని చేసిన ఐదుగురు మాజీ ఉద్యోగులు నలుగురు కాకేసియన్ మూలానికి , మరొకరు హిస్పానిక్ మూలానికి చెందినవారుగా భావిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామంపై వ్యాఖ్యానించేందుకు విప్రో తిరస్కరించింది. కాగా గత సంవత్సరం డిసెంబరులో ఆఫ్రికాకు చెందిన అమెరికా ఉద్యోగి ఇలాంటి దావావేయడంతో, పరిహారం ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. (ప్రతీరోజు 20 లక్షల మందికి ఆహారం : విప్రో) చదవండి : జియో మార్ట్ వాట్సాప్ నంబరు ఇదే! -
కొత్త ఫిర్యాదుల గురించి తెలీదు
న్యూఢిల్లీ: అమెరికాలో కొత్తగా మరో క్లాస్ యాక్షన్ దావా దాఖలైనట్లు వచ్చిన వార్తలపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పందించింది. అక్టోబర్‌లో వచ్చిన ఆరోపణలు తప్ప కొత్త ఫిర్యాదుల గురించి తమకేమీ తెలియదని శుక్రవారం స్టాక్ ఎక్సే్ఛంజీలకు వివరణనిచ్చింది. గతంలో వచ్చిన ఆరోపణల గురించి అప్పుడే ఎక్సే్ఛంజీలకు తెలియజేశామని కూడా పేర్కొంది. అనైతిక విధానాలతో ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేసిందనే ఆరోపణతో ఇన్ఫీపై క్లాస్ యాక్షన్ దావా వేసినట్లు అమెరికన్ న్యాయసేవల సంస్థ షాల్ లా ఫర్మ్ ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇన్ఫోసిస్ ఇచ్చిన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. కంపెనీలపై ఫిర్యాదు చేయగోరేవారు, క్లాస్ యాక్షన్ దావాలో భాగం కావాలనుకునేవారు తమను సంప్రదించాలని న్యాయసేవల సంస్థలు ఇలాంటి ప్రకటనలివ్వడం సర్వసాధారణమేనని ఇన్ఫీ తెలిపింది. షాల్ లా ఫర్మ్ కూడా ఇందుకోసమే ప్రకటన చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. ఇన్ఫీ సీఈవో సలీల్ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ అనైతిక విధానాలకు పాల్పడుతున్నారని అక్టోబర్‌లో ప్రజా వేగుల నుంచి ఫిర్యాదులొచ్చాయి. దీంతో కంపెనీ షేరు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ అంశాలపై స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీతో పాటు అటు అమెరికన్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్ఈసీ కూడా విచారణ జరుపుతోంది. రోజెన్ లా ఫర్మ్ అనే న్యాయసేవల సంస్థ అమెరికన్ ఇన్ఫెస్టర్ల తరఫున ఇన్ఫీపై క్లాస్ యాక్షన్ దావా వేస్తామని అప్పట్లో ప్రకటించింది. మరోవైపు, అకౌంటింగ్ లోపాలపై నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (ఎన్ఎఫ్ఆర్ఏ) దృష్టి సారించింది. -
గూగుల్‌ను కోర్టుకీడ్చిన మాజీ ఉద్యోగినులు
న్యూయార్క్: సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై ముగ్గురు మాజీ మహిళా ఉద్యోగినులు దావా వేశారు. కంపెనీలో మహిళా ఉద్యోగినులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, తక్కువ స్థాయి పొజిషన్లను ఆఫర్ చేస్తున్నారని ఆరోపిస్తూ వారు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఓ వైపు గూగుల్ కార్యాలయంలో ఈ పిర్యాదులపై అమెరికా కార్మిక శాఖ విచారణ జరుపుతుండగానే ఉద్యోగినులు దావా వేయడం గమనార్హం. 2015లో యూఎస్ కార్మిక విభాగం అధికారులు గూగుల్ ప్రధాన కార్యాలయంలో 21,000 మంది ఉద్యోగులను సర్వే చేసి పలు వివరాలు రాబట్టారు. వీరి విచారణలో మహిళా ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని, ప్రతి విభాగంలోనూ మహిళలకు చాలీచాలని చెల్లింపులు చేస్తున్నారని వెల్లడైంది. ఇక న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన ఉద్యోగినుల్లో ఒకరు మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా, ఒకరు మాజీ కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్, మరొకరు గతంలో గూగుల్‌లో మేనేజర్‌గా పనిచేశారు. కంపెనీలో మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ వీరు రాజీనామా చేశారు. మరోవైపు వీరు గూగుల్‌పై కేసు వేయడం పట్ల కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ దీనిపై తాము పూర్తిగా సమీక్షిస్తామని, అయితే వారు చేసిన కీలక ఆరోపణలతో విభేదిస్తున్నామని వ్యాఖ్యానించారు.