clauses
-
డాక్టర్లకు ‘కొంతకాలం’ నిబంధన తీసుకురండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రజల సొమ్ముతో చదివే డాక్టర్లు నిర్దిష్ట సమయం వరకు (మినిమమ్ కంపల్సరీ పీరియడ్) దేశంలోనే పనిచేసేలా నిబంధన తీసుకురావాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది. చాలా మంది డాక్టర్లు ప్రభుత్వ సొమ్ముతో చదువుకుని విదేశాలకు వెళ్తుండటాన్ని కమిటీ తప్పుబట్టింది. వైద్య కళాశాలల్లో చదివిన వారందరూ ఓ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంశాన్నీ పరిశీలించాలంది. డెంటల్, నర్సింగ్, ఇతర కౌన్సిల్స్‌ను సమర్థంగా నియంత్రించేందుకు వీలుగా వాటిని పునర్వ్యవస్థీకరించాలని ఆరోగ్య శాఖకు సూచించింది. -
చీవాట్లు పెట్టినా... చులకన చేసినా..
కర్నూలు(ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిబంధనలకు అర్థం తెలియదా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేందుకు నిదర్శనాలు కోకొల్లలు. ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొన్నా మా తీరింతే అన్నట్టుగా ఉంది. కోర్టులు చీవాట్లు పెట్టినా... కొందరు విద్యార్థులు చులకనగా మాట్లాడినా వెనక్కి తగ్గరనేందుకు రెండు సంవత్సరాల కాలపరిమితితో నియమించబడిన ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి ఇంక్రిమెంట్ ఇవ్వడానికి పూనుకోవడం మరో సాక్ష్యంగా నిలిచింది. ఈ విషయాన్ని గుర్తించిన నాన్ టీచింగ్ సిబ్బంది గురువారం మూకుమ్మడిగా ఫైల్ సిద్ధం చేసిన అధికారిని నిలదీయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశానని చెప్పడంతో గుట్టు బట్టబయలైంది. అంతా మా ఇష్టం... ఆర్యూ ఉన్నతాధికారులు అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తునారనేందుకు ఇంక్రిమెంట్ ఇవ్వదలచిన కాంట్రాక్టు ఉద్యోగికి నెలకు రూ. 40 వేలకు పైగా జీతం ఇవ్వడంతోపాటు హెచ్ఆర్ఎ ఇవ్వడం నిదర్శనం. సర్వీస్ రిజిస్టర్ లేకుండానే ఇంక్రిమెంట్లు ఎలా ఇస్తారనేది అర్థమవ్వని విషయం. అంతర్గత ఒప్పందం మేరకు నియమించుకుని దొడ్డిదారిన పర్మనెంట్ చేయడానికే ఈ ఎత్తుగడని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. వాస్తవానికి ఈ ఉద్యోగానికి సూపరింటెండెంట్ స్థాయి ప్రభుత్వ ఉద్యోగి అర్హుడు. అయితే ప్రైవేట్ ఐటీ సంస్థలో పని చేస్తున్న ఈ వ్యక్తిని నియమించడమే నిబంధనలకు విరుద్ధం. అప్పట్లో విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు కూడా. వైస్ చాన్స్‌లర్ నరసింహులు పదవీ కాలం ఏప్రియల్ 9వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా ఇంక్రిమెంట్లు ఇచ్చేస్తే భవిష్యత్తులో ఈ ఇంక్రిమెంట్ల ఆధారంగా పర్మినెంట్ ఉద్యోగిగా స్థిరపడేందుకు ఎత్తుగడ అనే అనుమానం వ్యక్తం అవుతున్నాయి. నాన్‌టీచింగ్ సిబ్బంది పాపమేంటి ? వర్సిటీలో టైం స్కేల్ పొందుతున్న నాన్ టీచింగ్ సిబ్బంది 12 మంది ఉన్నారు. ఖాళీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వీరిని వదిలేసి మూడేళ్ల నుంచి మాత్రమే పని చేస్తున్న ఆ వ్యక్తిని పర్మనెంట్ చేయడానికి పావులు కదపడంలో మతలబ్ ఏంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా 110 మంది చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న కంట్రాక్టు సిబ్బందికి టైంస్కేలు ఇవ్వని ఉన్నతాధికారులు సదరు ఉద్యోగికి అడ్డదారిన ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు చేస్తున్న తీరును ఉద్యోగులు తప్పుపడుతున్నారు. -
సెబీకి మరిన్ని అధికారాలు
Government notifies Act to empower Sebi with extra powers Read more at: http://economictimes.indiatimes.com/articleshow/41082020.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst న్యూఢిల్లీ: మోసపూరిత నిధుల సమీకరణ స్కీమ్‌లు, ఫ్రాడ్లకు చెక్ చెప్పే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మరిన్ని అధికారాలు కట్టబెట్టే చట్టాన్ని ప్రభుత్వం గురువారం నోటిఫై చేసింది. దీంతో డిఫాల్టర్లను అరెస్ట్ చేసేందుకు, కాల్ డేటా రికార్డులను పరిశీలించేందుకు, అవసరమైతే ఆస్తుల అటాచ్మెంట్ చేసేందుకు సెబీకి అధికారాలు లభిస్తాయి.ప్రత్యేక కోర్టు అనుమతితో సోదాలు నిర్వహించడం కూడా సాధ్యపడుతుంది. పోంజీ స్కీమ్ తరహా స్కీముల మూలంగా లక్షల మంది చిన్న ఇన్వెస్టర్లు మోసపోతున్న ఉదంతాల నేపథ్యంలో ఈ చట్టాన్ని ఆగస్టు 6న లోక్‌సభ, ఆగస్టు 12న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రాసిక్యూషన్ మరింత వేగవంతం చేసేందుకు, మోసపోయిన ఇన్వెస్టర్లకు సొమ్మును సత్వరం రీఫండ్ చేసేందుకు కొత్తగా సంక్రమించిన అధికారాలు ఉపయోగపడతాయని సెబీ చైర్మన్ యూకే సిన్హా పేర్కొన్నారు. తాజా చట్టం కారణంగా.. నేరం చేసిన వారు ఇకపై తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.