న్యూఢిల్లీ: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రజల సొమ్ముతో చదివే డాక్టర్లు నిర్దిష్ట సమయం వరకు (మినిమమ్ కంపల్సరీ పీరియడ్) దేశంలోనే పనిచేసేలా నిబంధన తీసుకురావాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది. చాలా మంది డాక్టర్లు ప్రభుత్వ సొమ్ముతో చదువుకుని విదేశాలకు వెళ్తుండటాన్ని కమిటీ తప్పుబట్టింది. వైద్య కళాశాలల్లో చదివిన వారందరూ ఓ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంశాన్నీ పరిశీలించాలంది. డెంటల్, నర్సింగ్, ఇతర కౌన్సిల్స్‌ను సమర్థంగా నియంత్రించేందుకు వీలుగా వాటిని పునర్వ్యవస్థీకరించాలని ఆరోగ్య శాఖకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment