parliamentary library committee
-
డాక్టర్లకు ‘కొంతకాలం’ నిబంధన తీసుకురండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రజల సొమ్ముతో చదివే డాక్టర్లు నిర్దిష్ట సమయం వరకు (మినిమమ్ కంపల్సరీ పీరియడ్) దేశంలోనే పనిచేసేలా నిబంధన తీసుకురావాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది. చాలా మంది డాక్టర్లు ప్రభుత్వ సొమ్ముతో చదువుకుని విదేశాలకు వెళ్తుండటాన్ని కమిటీ తప్పుబట్టింది. వైద్య కళాశాలల్లో చదివిన వారందరూ ఓ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అంశాన్నీ పరిశీలించాలంది. డెంటల్, నర్సింగ్, ఇతర కౌన్సిల్స్‌ను సమర్థంగా నియంత్రించేందుకు వీలుగా వాటిని పునర్వ్యవస్థీకరించాలని ఆరోగ్య శాఖకు సూచించింది. -
పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డిని పార్లమెంట్ ల్రైబరీ కమిటీ చైర్మన్‌గా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నియమించారు. లోక్‌సభ నుంచి ఆరుగురు, రాజ్యసభ నుంచి ముగ్గురు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. లోక్‌సభ నుంచి డాక్టర్ భగీరథ్ ప్రసాద్, వినోద్ చావ్డా, ఆర్.గోపాలకృష్ణన్, అభిజిత్ ముఖర్జీ సభ్యులుగా ఉండగా.. మరొక స్థానం ఖాళీగాఉంది. రాజ్యసభ నుంచి ప్రభాత్ ఝా, డాక్టర్ టి.ఎన్.సీమ, డి.పి.త్రిపాఠి సభ్యులుగా ఉన్నారు. ఇంతకుముందు డిప్యూటీ స్పీకర్ ఈ కమిటీకి ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా ఉండేవారు. అయితే ఈ నిబంధనను సవరించారు.