కార్పెట్ క్లీనింగ్!
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో వాడే కార్పెట్ శుభ్రంగా లేకపోతే అతిథుల దృష్టిలో చులకనవ్వడమే కాకుండా అనారోగ్య సమస్యలూ తలెత్తే ప్రమాదముంది. అందుకే కార్పెట్‌ను క్లీన్‌గా ఉంచుకోవాలి.
ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా ఉండటం కోసం ప్రధాన ద్వారం దగ్గర మ్యాట్‌ను ఉపయోగించాలి. పాదరక్షలు ఇంటి బయటే విడవాలి.
మరకలు పడితే వీలైనంత త్వరగా వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయాలి.
నాణ్యమైన యాసిడ్, డిటర్జెంట్, షాంపూలనే కార్పెంట్ క్లీనింగ్‌కు వాడాలి. లేకపోతే రంగు పోయే ప్రమాదముంది.
స్టీమ్ క్లీనింగ్‌తో కూడా కార్పెట్‌ను క్లీన్ చేసుకోవచ్చు. అయితే ముందుగా కార్పెట్ బాగా తడిగా ఉండకుండా చూసుకోవాలి. స్టీమ్ క్లీన్ చేసే ముందు బ్రెష్ చేయడం కూడా మరవద్దండోయ్.