appకీ కహానీ...
క్లియర్ ట్యాక్స్ ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ రిఫండ్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు రూపొందించిన యాప్ ‘క్లియర్ ట్యాక్స్’. ఒక్క నిమిషంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ స్టేటస్‌ను పొందొచ్చు. అలాగే ఎంత మొత్తంలో పన్ను మినహాయింపు పొందవచ్చో తెలుసుకోవచ్చు. ‘క్లియర్ ట్యాక్స్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
యాప్‌పై క్లిక్ చేయగానే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్, ట్యాక్స్ కాలిక్యులేటర్ అనే ఆప్షన్లు వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్లోకి వెళ్లి పాన్, పుట్టిన తేదీ సహా తదితర వివరాలను నమోదు చేసి ఆదాయపు పన్ను రిఫండ్ స్టేటస్‌ను కనుక్కోవచ్చు.ట్యాక్స్ కాలిక్యులేటర్ ఆప్షన్ లోకి వెళ్లి సంబంధిత సమాచారాన్ని ఎంటర్ చేసి ఎంత మొత్తంలో పన్ను చెల్లించాలో ఒక అంచనాకు రావచ్చు.ఐదేళ్ల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వివరాలను తెలుసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ అవసరం లేదు.యూజర్ల సమాచారానికి పూర్తి రక్షణ. బ్యాంక్ గ్రేడ్ హెచ్‌టీటీపీఎస్ భద్రత.