clerical posts
-
IBPS Exam: 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంక్ క్లర్క్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్ రిక్రూట్మెంట్లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్ రిక్రూట్మెంట్లలో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. క్లరికల్ కేడర్ కోసం పరీక్షలు ప్రాంతీయ భాషలలో నిర్వహించే విషయాన్ని పరిశీలించేందుకు ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కమిటీ సిఫార్సులు అందుబాటులోకి వచ్చే వరకు ఐబీపీఎస్ ప్రారంభించిన పరీక్ష ప్రక్రియను నిలివేయాలని నిర్ణయించారు. -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?
► గ్రేడ్-2 అభ్యర్థుల్లో ఆందోళన ► నియూమక ఉత్తర్వులు ► ఇచ్చేది ఎప్పుడో.. కొత్తగూడెం(ఆదిలాబాద్) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం భారీగా రిక్రూట్మెంట్లు చేపడుతున్నట్లు ప్రకటించిన సింగరేణి సంస్థ.. పోస్టుల భర్తీలో విఫలం కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్-2 పోస్టుల నియామక ప్రక్రియపై ఎప్పటికప్పుడు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులకు మాత్రమే కాల్ లెటర్లు పంపిస్తామని అధికారులు ప్రకటించారు. అరుుతే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కాల్ లెటర్ పంపించాలని అభ్యర్థులు, యూనియన్ నాయకులు డిమాండ్ చేయడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. తిరిగి 2015 మార్చిలో క్లరికల్ పోస్టుల భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 234 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని, ఏదైనా డిగ్రీ ఉన్నవారు అర్హులని పేర్కొంది. దీంతో సుమారు 1.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం యాజమాన్యం మరో 237 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ పాత నోటిఫికేషన్‌లోని పోస్టులకు వాటిని జతచేసి 471 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. ఈ పోస్టు ల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకోవడంతో జేఎన్టీయూహెచ్ సౌజన్యంతో గత ఏడాది అక్టోబర్ 11న రాత పరీక్ష నిర్వహించిం ది. కాగా పరీక్ష పత్రం, ఓఎంఆర్ షీట్లో సైతం కొన్ని సెట్లలో తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు ఆరోపించగా, యాజమాన్యం మాత్రం వాటికేమీ కాదంటూ సముదాయించే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు 83,225 మందికి హాల్‌టికెట్లు పంపించగా 70,561 మంది పరీక్షకు హాజరయ్యారు. వారం రోజుల అనంతరం పరీక్షా ఫలితాలను ప్రకటించింది. అపాయింట్మెంట్ కోసం తప్పని ఎదురుచూపులు.. క్లరికల్ పోస్టుల పరీక్ష ఫలితాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తాయి. ఒకే ఇంటిపేరు కలిగిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సింగరేణి కాలనీల్లోని అధికారుల పిల్లలకే ఎక్కువ మార్కులు వేశారని, ఇలా పలు ఆరోపణలు వచ్చాయి. అటువంటిదేమీ లేదని యూజమాన్యం తొలుత చెప్పినప్పటికీ ఒత్తిడి పెరగడంతో విజిలెన్స్ విచారణను ప్రారంభించింది. దీంతో క్లరికల్ పోస్టుల నియామక ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎలాగైనా ఉద్యోగం సాధించాలని ఎంతోమంది కష్టపడి చదివి, పరీక్ష రాసి, ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించినప్పటికీ నియామక ప్రక్రియ నిలిచిపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇతర పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్లను అభ్యర్థులు అందుకున్నప్పటికీ క్లరికల్ అభ్యర్థులు మాత్రం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. సింగరేణి యాజమాన్యం మాత్రం విజిలెన్స్ విచారణ పూర్తై తరువాతే ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అసలు క్లరికల్ పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారా లేక మరోసారి నోటిఫికేషన్ ఇస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. -
క్లరికల్ పోస్టుల భర్తీలో జాప్యం
లక్షకుపైగా నిరుద్యోగుల్లో నైరాశ్యం మంచిర్యాల సిటీ : తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలో విస్తరించిన బొగ్గు గనుల్లో ఖాళీగా ఉన్న 78 క్లరికల్ పోస్టులు భర్తీ చేయడానికి సింగరేణి యాజమాన్యం జూన్, 2013న నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసి ఏడాదైంది. అయినా యాజ మాన్యం నుంచి స్పందన లేదు. ఉద్యోగంపై ఆశతో లక్షకుపైగా నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. ఒకే రోజు పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటించిన సందర్భాలు సింగరేణి చరిత్రలో ఉన్నాయి. పక్కా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సింగరేణి సంస్థ క్లరికల్ నియామకం విషయంలో జాప్యం చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కారణం.. అధికారులు ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన యాజమాన్యానికి భారమైంది. సంస్థ పరంగా ఉద్యోగులను భర్తీ చేసుకోవడంలో సింగరేణి సంస్థ దరఖాస్తులు స్వీకరించడం నుంచి మొదలుకుని ఎంపిక ప్రక్రియ పూర్యయ్యే వరకు అన్నీతానై పనులను పూర్తిచేసుకుంటుంది. లక్షకు పైగా దర ఖాస్తులు రావడంతో దరఖాస్తుల పరిశీలనతోపాటు ప్రశ్నపత్రాల తయారు, పరీక్ష నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాల తయారీ, హాల్ టికె ట్ల పంపిణీ వంటి సమస్యలు సంస్థకు భారమైంది. సింగరేణి సంస్థ సంస్కరణల పేరిట ఖర్చు తగ్గించుకోడానికి ఆశపడుతుంది. 78 ఉద్యోగాల నియామకంలో ఖర్చు భారం కావడంతోపాటు, దరఖాస్తుల పరిశీలనతోపాటు ఎంపిక ప్రకియ వరకు సిబ్బంది తగినంత లేకపోవడం కూడా ప్రధాన కారణం కనబడుతోంది. నోటిఫికేషన్ జూన్, 2013న 78 క్లరికల్ పోస్టులకు సింగరేణి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదేని డిగ్రీతోపాటు కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన డిప్లొమా సర్టిఫికెట్‌ను అర్హతగా ప్రకటించారు. 01-03-2013 నాటికి 30 ఏళ్లు నిండిన వారు మాత్రమే అర్హులు. ఇందులో 63 స్థానికులకు, 15 స్థానికేతరులక కేటాయించారు. 26 జూలై, 2013 నుంచి 9 ఆగస్టు, 2013 వరకు ఆన్లైన్ ద్వార దరఖాస్తులు తీసుకున్నారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు ప్రింట్ తీసుకోడానికి ఆగస్టు 19వ తేదీని చివరి తేదీగా ప్రకటించారు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నామని యాజమాన్యం తెలిపింది. లక్షకు పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రింట్ తీసుకున్న నిరుద్యోగులు పరీక్ష తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా? హాల్‌టికెట్టు ఎప్పుడు వస్తుందా? అని అనాటి నుంచి ఈనాటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు. చిగురిస్తున్న ఆశలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతుందని యాజమాన్యం నియామకంలో ఆలస్యం చేసిందనే వాదన కూడా ఉంది. స్థానికేతరులకు 15 పోస్టులు ఉన్నవి. వీటి కోసం ఆంధ్ర ప్రాంత నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కూడ హాల్ టికెట్టు పంపి, పరీక్ష నిర్వహిస్తే అనవసరంగా గొడవలు వస్తాయని యాజమాన్యం భావించి పరీక్ష నిర్వహణలో ఆలస్యం చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో నోటిఫికేషన్ విడుదల చేస్తే ఖాళీల సంఖ్య మరో 30 పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఖాళీల సంఖ్య పెరిగితే నిరుద్యోగుల్లో ఆశలు పెరుగుతాయి. స్థానికేతరుల కోటా కూడా పెరుగుతుంది. స్థానికేతరుల కోటాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం సింగరేణి విస్తరించని తెలంగాణలోని ఆరు జిల్లాల నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోడానికి అవకాశాలు ఉంటాయి. తద్వార మొత్తం పోస్టులు కూడా తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు దక్కే అవకాశాలు ఉంటాయి. ఈ పరిస్థితులను కొత్త ప్రభుత్వానికి వివరిస్తే కొత్త నోటిఫికేషన్ ప్రకటించడానికి కూడా ఒప్పుకుంటారు.