ఎన్నాళ్లీ ఎదురుచూపులు..? | Grade -2 candidates worry | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?

Published Tue, Apr 5 2016 1:38 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM

Grade -2 candidates worry

గ్రేడ్-2 అభ్యర్థుల్లో ఆందోళన
నియూమక ఉత్తర్వులు
ఇచ్చేది ఎప్పుడో..

 
 
 కొత్తగూడెం(ఆదిలాబాద్) : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం భారీగా రిక్రూట్‌మెంట్లు చేపడుతున్నట్లు ప్రకటించిన సింగరేణి సంస్థ.. పోస్టుల భర్తీలో విఫలం కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్-2 పోస్టుల నియామక ప్రక్రియపై ఎప్పటికప్పుడు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులకు మాత్రమే కాల్ లెటర్లు పంపిస్తామని అధికారులు ప్రకటించారు. అరుుతే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ కాల్ లెటర్ పంపించాలని అభ్యర్థులు, యూనియన్ నాయకులు డిమాండ్ చేయడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది.

తిరిగి 2015 మార్చిలో క్లరికల్ పోస్టుల భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 234 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని, ఏదైనా డిగ్రీ ఉన్నవారు అర్హులని పేర్కొంది. దీంతో సుమారు 1.20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన అనంతరం యాజమాన్యం మరో 237 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ పాత నోటిఫికేషన్‌లోని పోస్టులకు వాటిని జతచేసి 471 ఖాళీలు  ఉన్నట్లు ప్రకటించింది. ఈ పోస్టు ల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకోవడంతో జేఎన్‌టీయూహెచ్ సౌజన్యంతో గత ఏడాది అక్టోబర్ 11న రాత పరీక్ష నిర్వహించిం ది. కాగా పరీక్ష పత్రం, ఓఎంఆర్ షీట్‌లో సైతం కొన్ని సెట్లలో తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు ఆరోపించగా, యాజమాన్యం మాత్రం వాటికేమీ కాదంటూ సముదాయించే ప్రయత్నం చేసింది. ఎట్టకేలకు  83,225 మందికి హాల్‌టికెట్లు పంపించగా 70,561 మంది పరీక్షకు హాజరయ్యారు. వారం రోజుల అనంతరం పరీక్షా ఫలితాలను ప్రకటించింది.

 అపాయింట్‌మెంట్ కోసం తప్పని  ఎదురుచూపులు..
క్లరికల్ పోస్టుల పరీక్ష ఫలితాలలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తాయి. ఒకే ఇంటిపేరు కలిగిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సింగరేణి కాలనీల్లోని అధికారుల పిల్లలకే ఎక్కువ మార్కులు వేశారని, ఇలా పలు ఆరోపణలు వచ్చాయి.  అటువంటిదేమీ లేదని యూజమాన్యం తొలుత చెప్పినప్పటికీ ఒత్తిడి పెరగడంతో విజిలెన్స్ విచారణను ప్రారంభించింది. దీంతో క్లరికల్ పోస్టుల నియామక ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.

నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఎలాగైనా ఉద్యోగం సాధించాలని ఎంతోమంది కష్టపడి చదివి, పరీక్ష రాసి, ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించినప్పటికీ నియామక ప్రక్రియ నిలిచిపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఇతర పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్, అపాయింట్‌మెంట్ ఆర్డర్లను అభ్యర్థులు అందుకున్నప్పటికీ క్లరికల్ అభ్యర్థులు మాత్రం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. సింగరేణి యాజమాన్యం మాత్రం విజిలెన్స్ విచారణ పూర్తై తరువాతే ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు అసలు క్లరికల్ పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారా లేక మరోసారి నోటిఫికేషన్ ఇస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement