Click
-
గణేశ్ నిమజ్జనం: ఈ ఫొటో చూసి వావ్ అనాల్సిందే!
అకేషన్ ఏదైనా ఫొటో ఉండాల్సిందే. ఫోన్ చేతిలో ఉంటే ‘బొమ్మ’పడాల్సిందే. స్మార్ట్ఫోన్లు విరివిరిగా అందుబాటులోకి వచ్చాక ఫొటోలు తీయడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. కళ్ల ముందు కనిపించే ప్రతి దృశ్యాన్ని ఫోన్ కెమెరాలో బంధించేందుకు ఆరాటపడుతున్నారు జనం. ఇలాంటి దృశ్యమే హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా ఆవిష్కృతమైంది. భక్తుల ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్రగా నిమజ్జనానికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని భాగ్యనగర వాసులు పులకితులయ్యారు. అంతేకాదు శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిని తమ ఫోన్ కెమెరాలతో ఫొటోలు తీసుకుని మురిసిపోయారు. ఆ సందర్భంగా తీసిన ఈ ఫోటోను హాయ్ హైదరాబాద్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేశారు. Photo Courtesy: Hi Hyderabad Twitter Page గణేశ్ నిమజ్జన వేడుకల్లో భాగంగా చార్మినార్ సమీపంలో తీసిన మరో ఫొటో కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. శివుడి బాహువుపై ఆశీసుడైన గణనాథుడి ప్రతిమ వెనుక భాగంలో చార్మినార్ కనిపించే విధంగా తీసిన ఈ ఫోటో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. Photo Courtesy: Hi Hyderabad Twitter Page -
ఒక్క క్లిక్..
కర్నూలు (అర్బన్): ఒకే ఒక్క క్లిక్‌తో జిల్లాలోని బెస్ట్ అవేలబుల్ స్కూల్స్‌లో 550 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. జిల్లాలోని బెస్ట్ అవేలబుల్ స్కూల్స్‌లో ప్రతి ఏడాది ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్న నేపథ్యంలోనే ఈ విద్యా సంవత్సరంలో కూడా 5వ తరగతికి (రెసిడెన్షియల్) 350, 1వ తరగతికి (నాన్ రెసిడెన్షియల్)కు 200 సీట్లు కేటాయించారు. ప్రతి ఏడాది ఈ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించి అర్హులైన విద్యార్థులు మ్యాన్యువల్‌గా దరఖాస్తు చేసుకుంటే, స్థానిక అంబేద్కర్ భవన్లో విద్యార్థులు, తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా డిప్పు తీసి డిప్పు తగిలిన వారికి వారు కోరుకున్న పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తూ వచ్చారు. అయితే 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆయా పాఠశాలల్లో ప్రవేశం పొందాలంటే, ప్రతి విద్యార్థి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టారు. ఈ నేపథ్యంలోనే 1వ తరగతికి 360 మంది బాలురు, 290 మంది బాలికలు, 5వ తరగతికి 801 మంది బాలురు, 518 మంది బాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిని సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులే ఎలక్ట్రానిక్ డిప్పు ద్వారా ఎంపిక చేసి ఆన్లైన్లో జాబితాను ఉంచారు. అంతా రెండు నిమిషాల్లోనే.. బీఏఎస్ ప్రవేశాలకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర రాజధాని అమరావతిలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారి కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా ఎంపికైన విద్యార్థుల జాబితాను డిస్ప్లే చేసేందుకు ఆన్‌లైన్‌ను ఓపెన్ చేశారు. ఆన్లైన్ ఓపెన్ అయిన వెంటనే జిల్లా జాయింట్ కలెక్టర్ –2 ఎస్ రామస్వామి కీ బోర్డు నుంచి సిస్టమ్‌లో కనిపిస్తున్న 1 నుంచి 10 అంకెల్లో ఒక అంకెను క్లిక్ చేశారు. అనంతరం తిరిగి మరో అంకెను క్లిక్ చేశారు. రెండు సార్లు రెండు అంకెలను క్లిక్ చేసిన 10 నిమిషాలకు 1, 5వ తరగతికి ఎంపికైన విద్యార్థుల జాబితా అదే వెబ్సైట్లో డిస్ప్లే అవుతుందని ఉన్నతాధికారి కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. చెప్పిన విధంగానే ఎంపికైన విద్యార్థుల జాబితా వెబ్సైట్లో ఉంచారు. రెండు నిమిషాల్లోనే 550 మంది విద్యార్థుల ఎంపికను పూర్తి చేశారు. నిబంధనలపై తల్లిదండ్రుల ఆందోళన జీఓ నెంబర్ 101 ప్రకారం అనాథ పిల్లలకు 20 శాతం, జోగిని పిల్లలకు 15 శాతం, బాండెడ్ లేబర్స్ పిల్లలకు 15 శాతం సీట్లను, మిగిలిన 50 శాతం సీట్లను వ్యవసాయ కార్మిక కుటుంబాలకు చెందిన పిల్లలకు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కేటాయించిన వర్గాలకు చెందిన పిల్లలు లేని పక్షంలో ఆయా సీట్లను ఇతర కేటగిరీలకు కేటాయించడం జరుగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీఓలో పేర్కొన్న నిబంధనలను పాటించారా? లేదా? అనే విషయాలపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ డిప్పు గురించి తనకు పెద్దగా ఐడియా లేదని, ఎలా విద్యార్థులను ఎంపిక చేశారనే విషయంలో తనకు స్పష్టత లేదని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు ప్రసాదరావు చెబుతున్నారు. కార్యక్రమంలో డీడీతో పాటు జిల్లా సాంఘిసంక్షేమ అధికారి ప్రకాష్‌రాజు, కార్యాలయ పర్యవేక్షకులు మల్లికార్జున, షాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక కంటి చూపుతో ఫోటోలు తీయవచ్చు
-
పిక్చర్.. పొట్లం
-
సెల్పీతో బిల్లులు
న్యూయార్క్: అమెరికన్ ఫైనాన్షియల్ కంపెనీ మాస్టర్ కార్డు ఓ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తమ వినియోగదారులకు మరింత భద్రత కలిగించేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేనుంది. అదే సెల్ఫీ టెక్నాలజీ. గతంలో అకౌంట్ వివరాలు తెలియజేయాలంటే అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ ఉండేవి, వాటి స్ధానంలో కొత్తగా సెల్ఫీని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ట్రయల్స్ లో ఉన్న ఈ సెల్పీ క్లిక్ ద్వారా బిల్లులు చెల్లించేవాళ్ల ముఖాన్ని గుర్తించే పద్ధతిని అమెరికా సహా 14 దేశాలలో ప్రవేశపెడుతోంది. ప్రస్తుతం ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్లలోమునిగితేలుతున్నారని, ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం మంది బ్యాంకింగ్ లావాదేవీలను మొబైల్ ద్వారానే నిర్వహిస్తున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది. ఈ సెల్ఫీ టెక్నాలజీ ద్వారా మొబైల్ ద్వారా అన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు పాస్వర్డ్ కాకుండా ఫేషియల్ రికగ్నిషన్‌ను అడుగుతుంది. అపుడు వినియోగదారుడు సెల్ఫీతో పాటు, నిర్ధారించిన ఏరియాలో కళ్లను బ్లింక్ చేయాలి. అపుడు సరైన వినియోగదారుడిగా గుర్తించి, చెల్లింపులు లేదా కొనుగోళ్లకు అనుమతి లభిస్తుందని తెలిపింది. ఇందుకోసం ముందుగా వినియోగదారుడు మాస్టర్ కార్డు ఫోన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. లావాదేవీల్లో జరుగుతున్న మోసాలను నివారించేందుకు ఈ కొత్తటెక్నాలజీని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. పాస్వర్డ్ మర్చిపోయినా వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ కార్డు పోగొట్టుకున్నా.. యజమాని తప్ప వేరెవ్వరూ దాన్ని ఉపయోగించే వీలు ఉండదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇటీవల మరో ప్రముఖ బ్యాంక్ హెచ్ఎస్బిసి సంప్రదాయ పాస్వర్డ్ స్థానంలో వాయిస్, టచ్ గుర్తింపు లాంటి బయోమెట్రిక్ బ్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మరోవైపు బార్కెలేస్ 2013లో వాయిస్ గుర్తింపు విధానాన్ని పరిచయం చేసింది. ఆపిల్ పే ఇప్పటికే వినియోగదారులు వేలిముద్ర ద్వారా క్రెడిట్ కార్డు కొనుగోళ్లకు అనుమతిస్తోంది.