యస్ బ్యాంక్‌తో క్లిక్ అండ్ పే ఒప్పందం
హైదరాబాద్: తెలంగాణ హబ్ పోర్ట్‌ఫోలియో కంపెనీ అయిన క్లిక్ అండ్ పే, ప్రైవేట్ రంగలోని యస్ బ్యాంక్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. నగదు రహిత లావాదేవీలకు మొబైల్ ఆధారిత చెల్లింపు సొల్యూషన్లు అందించే తాము యస్‌బ్యాంక్‌తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని క్లిక్ అండ్ పే ఒక ప్రకటనలో తెలిపింది. భద్రమైన, సౌకర్యవంతమైన నగదు రహిత లావాదేవీలను వినియోగదారులకు అందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని క్లిక్ అండ్ పే వ్యవస్థాపకుల్లో ఒకరైన సాయి సందీప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా యస్‌బ్యాంక్ మొబైల్ వాలెట్లను జారీ చేస్తామని వివరించారు. మరోవైపు డిజిటల్ బ్యాంకింగ్, చెల్లింపులు క్రమక్రమంగా పుంజుకుంటున్నాయని యస్ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ రితేశ్ పాయ్ పేర్కొన్నారు.