Closed Industries
-
పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు..
సాక్షి, అమరావతి: పరిశ్రమల నిర్వాహకులకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఊరట కలిగించింది. రాష్ట్రంలో నిర్వహణ భారమై మూతపడ్డ పరిశ్రమలకు విద్యుత్ సర్వీసును తిరిగి ఇచ్చేందుకు కనిష్ట చార్జీలను వసూలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను ఏపీఈఆర్సీ ఆదేశించింది. ఈ నిబంధన వచ్చే మార్చి 31 వరకు అమలులో ఉంటుందంది. ఖాయిలా పడ్డ పరిశ్రమలకు విద్యుత్ పునరుద్ధరణ విధానం అమలుపై మూడు నెలలకోసారి సమాచారం ఇవ్వాలని నిర్దేశించింది. చదవండి: AP: ‘అంగన్వాడీ’ల ఆధునికీకరణ ఓ పరిశ్రమ విద్యుత్ బిల్లులు చెల్లించకుండా కొంతకాలం నడిచి, మూతపడితే మూడు నెలల పాటు కనీస చార్జీల రూపంలో బిల్లు జారీ అవుతుంది. తరువాత ఆ బిల్లూ నిలిపేస్తారు. కొన్నేళ్ల తరువాత పరిస్థితులు చక్కబడి పరిశ్రమను తిరిగి తెరవాలనుకున్నప్పుడు విద్యుత్ సర్వీసును పునరుద్ధరించాల్సి ఉంటుంది. అప్పుడు మూతపడ్డ రోజులన్నిటికీ కనీస చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా అలా చేయరు. తొలి మూడునెలలకు మాత్రమే కట్టించుకుని మళ్లీ సర్వీసును ఇచ్చేస్తారు. అయితే పరిశ్రమ మూతపడే సమయానికి ఉన్న విద్యుత్ బిల్లు బకాయిలను మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. కోవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పరిశ్రమలు వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. అటువంటి పరిశ్రమలకు ఏపీఈఆర్సీ ద్వారా డిస్కంలు అందిస్తున్న ఈ వెసులుబాటు ప్రయోజనం కలిగించనుంది. -
రోడ్డున పడ్డ 2500 మంది కార్మికులు
సాక్షి, గుంటూరు : గుంటూరు నగరం పట్టాభిపురంలోని భజరంగ్ జూట్ మిల్లును లాకౌట్ చేయడం వల్ల 2500 మంది కార్మికులు రోడ్డు పడ్డారని, మిల్లు తిరిగి ప్రారంభించి వారికి జీవనోపాధి కల్పించాలని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను వైఎస్సార్ సీపీ నాయకుడు, జూట్ మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. కార్మిక శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మిలతో నాయకులు గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూట్ మిల్లు లాకౌట్ చేసి వేలాది మంది కార్మికుల పొట్టకొట్టిన యాజమాన్యానికి గత ప్రభుత్వం కొమ్ముకాసిందని చెప్పారు. 1994లో బీఐఎఫ్ఆర్ పద్ధతిలో 40 శాతం కార్మికుల వాటా, 60 శాతం యాజమాన్యం వాటా కింద మిల్లును నిర్వహించేలా అప్పటి ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతులు ఇచ్చిందన్నారు. 40 శాతం కార్మికుల వాటను ప్రభుత్వమే సమకూర్చేలా ఒప్పందం జరిగిందన్నారు. 2014 వరకూ మిల్లు సజావుగా సాగిందని, ఉత్తమ మేనేజ్మెంట్ అవార్డును సైతం ప్రభుత్వం నుంచి మిల్లు యాజమాన్యం తీసుకుందన్నారు. 2014 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని గుంటూరు జిల్లాలో ఏర్పడటంతో భూముల విలువ అమాంతం పెరగడంతో మిల్లు భూములను రియల్టర్లకు విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించుకుందన్నారు. ఇందులో భాగంగా 2015 మే 12న మిల్లు భూములను యాజమన్యం విక్రయించగా, అదే సంవత్సరం జూలై 4న యాజమాన్యం మిల్లు లాకౌట్ చేసిందని వివరించారు. బీఐఎఫ్ఆర్ పద్ధతిలో మిల్లు నిర్వహించడానికి యాజమాన్యానికి ప్రభుత్వం అనేక రాయితీలిచ్చిందని వెల్లడించారు. కానీ స్వప్రయోజనాల కోసం యాజమాన్యం మిల్లును లాకౌట్ చేసిందన్నారు. సమగ్ర విచారణ చేయిస్తాం.. మిల్లు లాకౌట్ చేసి యాజమాన్యం కార్మికుల పొట్టకొట్టిన విధానాన్ని నాయకులు వివరించిన అనంతరం మంత్రి గుమ్మనూరు జయరామ్ స్పందిస్తూ నెల రోజుల్లో అధికారులతో సమగ్ర విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. విచారణ చేయించి నివేదికలు తెప్పించుకుని నాయకులతో మళ్లీ సమావేశం నిర్వíßహించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలుస్తుందని, జూట్ మిల్లు మూత పడటంతో రోడ్డున పడ్డ కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. మంత్రిని కలిసిన వారిలో కార్మిక నాయకులు పాండు, సాంబ, మోసే, వైఎస్సార్సీపీ నాయకులు షౌకత్, తోట ఆంజనేయులు, పానుగంటి చైతన్య తదితరులు ఉన్నారు. -
'మూతపడిన పరిశ్రమలను తెరిపించాలి'
సంగారెడ్డి మున్సిపాలిటీ : రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ గార్డెన్లో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్లో ఆమోదించిన తీర్మానాలను శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కార్మిక చట్టంలోని 65వ షెడ్యూల్డ్‌లో పేర్కొన్న విధంగా పరిశ్రమల్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ చేయాలని నిబంధనలు ఉన్నా ఎక్కడా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సదానందగౌడ్ చెర్మన్‌గా ఉన్న కమిటీలో అన్ని కార్మిక సంఘాల బాధ్యులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. కార్మికుల కనీస వేతనం రూ.18వేలు ఉండాలని తమ కమిటీ తరఫున తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. ప్రతి ఆరు నెలలకు పెరిగే డీఏ పాయింట్‌ను రూ.600 పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నూతన వేతన ఒప్పందం చేయడం వల్ల పెరిగే వేతనంతో ప్రభుత్వంపై పైసా భారం పడదని, అయినా ఎందుకు జాప్యం చేస్తున్నారని సాయిబాబ ప్రశ్నించారు. కార్మిక సంఘం నాయకుడిగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని గెలిపిస్తే పరిశ్రమను ఆర్థికంగా అభివృద్ధి చేస్తారనే ఆలోచనతో సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులు ఆయనను 500 ఓట్ల మెజారిటీతో గెలిపించారన్నారు. కానీ, పరిశ్రమను మూసివేసినా మంత్రి స్పందించలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వ విధానాలతో పరిశ్రమలు మూత పడుతున్నాయని తెలిపారు. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. అందుకు గాను మూత పడిన పరిశ్రమలను తెరిపించడంతో పాటు కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70వేల అంగన్వాడీ కేంద్రాలను రద్దు చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదన్నారు. గతంలో ఐసీడీఎస్‌కు ఇస్తున్న నిధులను 90 నుంచి 60 శాతానికి తగ్గించడమే ఇందుకు నిదర్శనమన్నారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు మాణిక్యం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.