Clothes shop
-
దారుణం: కోడలిపై మామ అత్యాచారం, కేసు నమోదు
నాంపల్లి: కోడలిపై మామ అత్యాచారం చేసిన సంఘటన హబీబ్‌నగర్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. హబీబ్‌నగర్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీకి చెందిన ఓ వస్త్రవ్యాపారి(52) అతడి కుమారుడి భార్య(21) ఇరువురు దుస్తుల కొనుగోలు నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చారు. బజార్‌ఘాట్ రోడ్డులోని సుభాన్ బేకరీ ఎదురుగా ఉండే ఎన్ఆర్ రెసిడెన్సీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. బట్టల కొనుగోలు చేయడానికి వచ్చిన ఇరువురు బుధవారం రాత్రి లాడ్జిలోని అద్దె గదిలోనే బస చేశారు. మరుసటి రోజు కోడలు తన మామపైన హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్లో అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి పంపించారు. భరోసా కేంద్రం నుంచి కేసుకు సంబంధించిన నివేదిక రాగానే తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ పూసపాటి శివచంద్ర తెలియజేశారు. -
నీ ఆఫర్ తగలెయ్య, మీరు మారరా!
చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. విజయ దశమి సమీపించడంతో షాపింగుల పేరుతో దర్జాగా తిరుతున్నారు. ఇక పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునే ఆలోచనలతో కొందరు వ్యాపారస్తులు ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. దీంతో అసలు కోవిడ్ మహమ్మారి ఉందనే సంగతి మరచి జనం విపరీతంగా షాపింగ్ మాల్స్ వద్ద ఎగబడతున్నారు. తాజాగా తమిళనాడులోని సేలంలో వెలుగు చూసిన ఓ దృశ్యం తెగ వైరల్ అవుతోంది. నూతనంగా నిర్మించిన ఓ బట్టల దుకాణం ప్రారంభం సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. 20 నుంచి 25 రూపాయలకే డ్రెస్ అంటూ ప్రచారం చేసింది. దాంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎటువంటి కోవిడ్ జాగ్రత్తలు తీసుకోకుండానే వందలాది ప్రజలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ బట్టల దుకాణాన్ని సీజ్ చేశారు. వైరస్ బారినపడి ఎంతో మంది చనిపోతున్నా జనం మారడం లేదని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. -
వస్త్ర దుకాణంలో చోరీ..
సాక్షి, ఏటూరునాగారం: వస్త్ర దుకాణంలో దొంగలు చొరబడి రూ. 50 వేల విలువైన దుస్తులు, రూ. 63 వేల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన ఏటూరునాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మండల కేంద్రంలో ఆర్ఆర్ రెడీమేడ్ షాపును మాచర్ల సారంగపాణి నడిపించుకుంటున్నారు. రోజువారిలాగానే షాపుకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం షాపు తెరిచి లోనికి వెళ్లి చూడగా వెనుక ఉన్న బాత్ రూమ్ వెంటిలేటర్, షాపు వెనుకభాగంలో ఉన్న తలుపును గడ్డపారతో పలుగగొట్టి లోనికి చొరబడినట్లు గుర్తించానని షాపు యజమాని తెలిపాడు. బట్టల షాపులో విలువైన రెడీమెడ్ పాయింట్లు, టీషర్టులతో పాటు షాపులో రూ. 63 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వెల్లడించారు. దొంగతనం విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి పరిశీలించినట్లు తెలిపాడు. సీసీ పుటేజీలో అనవాళ్లు ఆర్ఆర్ రెడీమేడ్ షాపు పక్కనే ఉన్న స్వాతి జ్యూవెల్లరి నగల దుకాణం వెనుకాల అమర్చిన సీసీ కెమెరాలో దొంగల ముఖాలు కనిపించాయి. ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ షాపు వెనుకాల రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఒకరు లోనికి చొరబడగా మరోకరు కాపలా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖం పూర్తిగా కనబడకపోవడంతో ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. సీసీ పుటేజీలో రికార్డు అయిన వీడియోను పోలీసులకు అందజేయనున్నట్లు షా పు యజమాని తెలిపారు. అంతేకాకుండా పోలీసులు ఇటీవల గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మానుకోటలోని ఓ ఇంట్లో దొంగతనం మానుకోట పట్టణంలోని నర్సంపేట బైపాస్‌రోడ్డులోగల హోలియదాసరి బజార్లో నివాసం ఉండే వట్టం ఉపేందర్, భాగ్యమ్మ నివాసంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. మానుకోట రూరల్, టౌన్ ఇన్చార్జి ఎస్సై పత్తిపాక జితేందర్ కథనం ప్రకారం...మానుకోట పట్టణంలోని నర్సంపేట బైపాస్‌రోడ్డులోగల హోలియదాసరి బజార్లో నివాసం ఉండే వట్టం భాగ్యమ్మ వృత్తిరీత్యా ముత్యాలమ్మగూడెం ఏహెచ్‌ఎస్‌లో ఉపాధ్యాయురాలు. ఆమె ఎన్నికల విధుల్లో భాగంగా వర్ధన్నపేటకు గురువారం సాయంత్రం వెళ్లారు. ఆమె భర్త వట్టం ఉపేందర్ కొత్తగూడ మండలంలోని గోపాలపురంకు ఓటు వేయడం కోసం వెళ్లారు. ఆయన శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లోని సామానులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. బెడ్రూంలోకి వెళ్లి చూసేసరికి బీరువా తలుపులు పగులగొట్టి కనిపించాయి. సమాచారం అందుకున్న టౌన్ సీఐ ఎస్.రవికుమార్, సీసీఎస్ సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, క్లూస్‌టీం బృందం ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు -
చిత్తూరులో వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం
- ఎగిసిపడుతున్న మంటలు చిత్తూరు: చిత్తూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న కుమరన్ శిల్క్స్ వస్త్ర దుకాణంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. వస్త్ర దుకాణంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో దుకాణంలోని సిబ్బంది వీధిలోకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దుకాణంలోని వస్త్రాలు కాలి బూడిదవుతున్నాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దుస్తుల దుకాణంలో అగ్నిప్రమాదం
వనస్థలిపురం(హైదరాబాద్): వనస్థలిపురంలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని ‘ఉయ్లైక్’ దుస్తుల దుకాణంలో శనివారం వేకువజామున అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో తెల్లవారుజామున ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దుకాణంలో షార్ట్‌సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగి, రూ.5 లక్షల విలువైన దుస్తులు కాలిపోయాయని నిర్వాహకులు తెలిపారు.