చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. విజయ దశమి సమీపించడంతో షాపింగుల పేరుతో దర్జాగా తిరుతున్నారు. ఇక పండగ సీజన్‌ను క్యాష్ చేసుకునే ఆలోచనలతో కొందరు వ్యాపారస్తులు ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. దీంతో అసలు కోవిడ్ మహమ్మారి ఉందనే సంగతి మరచి జనం విపరీతంగా షాపింగ్ మాల్స్ వద్ద ఎగబడతున్నారు.
తాజాగా తమిళనాడులోని సేలంలో వెలుగు చూసిన ఓ దృశ్యం తెగ వైరల్ అవుతోంది. నూతనంగా నిర్మించిన ఓ బట్టల దుకాణం ప్రారంభం సందర్భంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. 20 నుంచి 25 రూపాయలకే డ్రెస్ అంటూ ప్రచారం చేసింది. దాంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఎటువంటి కోవిడ్ జాగ్రత్తలు తీసుకోకుండానే వందలాది ప్రజలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ బట్టల దుకాణాన్ని సీజ్ చేశారు. వైరస్ బారినపడి ఎంతో మంది చనిపోతున్నా జనం మారడం లేదని సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment