Clothes showroom
-
వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం
మిర్యాలగూడ అర్బన్ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడు రోడ్డులో ఓ వస్త్ర దుకాణంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శివసాయి నైటీస్ సెంటర్‌ను ఆదివారం ఉదయం కొద్దిసేపు తెరిచి ఉంచిన నిర్వాహకులు అనంతరం మూసివేసి వెళ్లిపోయారు. మధ్యాహ్నం తర్వాత షాపులో షార్ట్‌సర్క్యూట్ తో మంటలు మొదలయ్యాయి. ఈ ప్రమాదంలో షాపులోని వస్త్రాలన్నీ కాలిపోయాయి. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
వస్త్ర దుకాణంలో చోరీ
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : ఓ వస్త్ర దుకాణంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. లక్ష రూపాయల విలువైన చీరలతోపాటు రూ.3.70 లక్షల నగదును ఎత్తుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీఎం కాలనీకి చెందిన యూనుస్ అహ్మద్ బండ్లగూడ హషమాబాద్ ప్రాంతంలో జిక్రా కలెక్షన్స్ పేరుతో ఓ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం షట్టర్ పైకి లేపి ఉండడాన్ని పాల వ్యాపారి గమనించి అతనికి సమాచారం అందించాడు. వెంటనే బాధితుడు అక్కడికి చేరుకొని చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రకాశంలో ’ఆదాశర్మ’ సందడి