Cloud Seeding
-
దుబాయ్‌లో వర్షం ఎలా పడుతుందో తెలుసా..!
భారత్‌లో వర్షం కోసం మనం ఎదురూ చూడాల్సిన పరిస్థితి ఉండదు. కాలానుగుణంగా వర్షాలు పడుతూనే ఉంటాయి. మన దేశంలో కూడా కొన్ని వానలు కురవని ప్రాంతాలు ఉన్నాయి. అయితే మరీ అస్సలు పడకుండా మాత్రం ఉండదు. అయితే దుబాయ్‌లాంటి అరబ్ దేశాల్లో అస్సలు వర్షాలూ పడవనే విషయం ఎంతమందికి తెలుసు. అక్కడ ఏడాదంతా వేడి వాతావరణంతో పొడిపొడిగా ఉంటుందట. నీటి సమస్య కూడా ఎక్కువే. మరి అలాంటి ప్రదేశాల్లో వర్షం లేకపోవడం కారణంగా వ్యవసాయాధారిత పంటలు కూడా ఏమి ఉండవు. అందుకని వర్షం పడేలా వాళ్లు ఏం చేస్తారో తెలుసా..! ఆయా దేశాల్లో వర్షాలు పడకపోవడంతో కృత్రిమ వర్షం సృష్టిస్తారు. దీన్ని క్లౌడ్ సీడింగ్ అని పిలుస్తారు. వర్షం లేదా మంచు ఏర్పడటాన్ని ప్రోత్సహించడానికి పదార్థాలను గాలిలోకి వెదజల్లి వర్షం పడేలా చేస్తారు. ఈ విధానంలో సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లేదా డ్రై ఐస్ వంటి పదార్థాలతో మేఘాలను విత్తడం జరుగుతుంది. ఇవి నీటి బిందువులు చుట్టూ ఏర్పడటానికి కేంద్రకాలుగా పనిచేస్తాయి. ఈ కణాలకు తేమను ఆకర్షించే గుణం ఉండటం వల్ల పెద్దగా వర్షంలా పడేందుకు దారితీస్తాయి. ఈ పద్ధతి వర్షం లేదా మంచును ఉత్పత్తి చేయని మేఘాలలో వర్షపాతాన్ని ప్రేరేపిస్తాయి. అయితే దీన్ని దశాబ్దాలుగా ప్రయోగం చేస్తున్నప్పటికీ.. వాతారణ పరిస్థితులు, కారకాల కారణంగా ఒక్కోసారి ప్రభావం మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ విధానంలోనే వర్షం పడేలా చేస్తుంది. అక్కడ అధికారులు నీటి కొరత సవాళ్లను పరిష్కరించేందుకు ఈ వ్యూహాత్మక విధానాన్ని ఉపయోగిస్తుంటోంది. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఎక్కువగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లోనే ఉపయోగిస్తారు. అక్కడ తీవ్రమైన వేడి వాతావరణం దృష్ట్యా నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిష్కరించేందుకు యూఏఈ శాస్త్రవేత్తలు ఈ క్లౌడ్ సీడింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించారు. అందుకోసం వారు దేశ వాతావరణంపై చాలా అప్రమత్తమైన నిఘా ఉంచుతారు. ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతితో పొడి వాతావరణ పరిస్థితుల్లో 30% నుంచి 35%, ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో 10% నుంచి 15% వరకు వర్షపాతాన్ని పెంచగలవని శాస్త్రవేత్తల చెబుతున్నారు. ఈ పద్ధతిలోనే దుబాయ్‌లో వర్షం పడేలా చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. This is Dubai's artificial rain which happens because of cloud seeding pic.twitter.com/O5Uqcf4xC7 — Historic Vids (@historyinmemes) April 8, 2024 (చదవండి: యుద్ధ భయంతో పడవ ఎక్కితే..నడి సంద్రంలో ఇంజన్ ఫెయిల్..!) -
చైనా: కరువుపై మేఘమథన అస్త్రం!
చాంగ్కింగ్(చైనా): దక్షిణ చైనాలో కరువు ఉరుముతోంది. ఎండలు మండిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. నదుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు వాడొద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కరెంటు లేక ఫ్యాక్టరీలకు తాళాలు వేయాల్సి వస్తోంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటుతోంది. తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. కరువు నేపథ్యంలో కొన్నిచోట్ల అత్యవసర పరిస్థితిని సైతం ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కరువు సమస్యను అధిగమించడానికి మేఘ మథనంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మేఘాలపై రసాయనాలు వెదజల్లి, వర్షాలు కురిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. సిచువాన్, హూబే ప్రావిన్స్‌ల్లోనూ ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు చేతికి రాకుండా పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో పంటలను కరువు బారినుంచి కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొంది. చైనాలో వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేసే ప్రక్రియ 61 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది. ఇప్పటినుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సిచువాన్ ప్రావిన్స్‌లో 45 డిగ్రీల సెల్సియస్(113 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ చైనాలో వరిసాగు అధికం. పంట దెబ్బతినకుండా కాపాడుకోవడానికి రాబోయే 10 రోజులు చాలా కీలకమని వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెంజియాన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదు. దాంతో చైనా సర్కారుకు ఇప్పుడు మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) ఒక ప్రత్యామ్నాయంగా మారింది. డ్రోన్ల సాయంతో మేఘాలపై రసాయనాలు చల్లి, కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఉత్తర చైనాలో మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కింగాయ్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా 26 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. -
చంద్రబాబుకు రఘువీరా సవాల్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మేఘమథనంలో అవినీతి చోటు చేసుకుందంటూ చేసిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సవాల్ విసిరారు. ఈ మేరకు చంద్రబాబుకు రఘువీరా లేఖ రాశారు. అనంతపురంలో ప్రముఖుల సమక్షంలో మేఘమథనంలో అవినీతి జరిగిందని చంద్రబాబు చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. ఆ వ్యవహారంలో సీబీఐ లేదా హైకోర్టు, సుప్రీం కోర్టు, సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్ చేశారు.