
భారత్‌లో వర్షం కోసం మనం ఎదురూ చూడాల్సిన పరిస్థితి ఉండదు. కాలానుగుణంగా వర్షాలు పడుతూనే ఉంటాయి. మన దేశంలో కూడా కొన్ని వానలు కురవని ప్రాంతాలు ఉన్నాయి. అయితే మరీ అస్సలు పడకుండా మాత్రం ఉండదు. అయితే దుబాయ్‌లాంటి అరబ్ దేశాల్లో అస్సలు వర్షాలూ పడవనే విషయం ఎంతమందికి తెలుసు. అక్కడ ఏడాదంతా వేడి వాతావరణంతో పొడిపొడిగా ఉంటుందట. నీటి సమస్య కూడా ఎక్కువే. మరి అలాంటి ప్రదేశాల్లో వర్షం లేకపోవడం కారణంగా వ్యవసాయాధారిత పంటలు కూడా ఏమి ఉండవు. అందుకని వర్షం పడేలా వాళ్లు ఏం చేస్తారో తెలుసా..!
ఆయా దేశాల్లో వర్షాలు పడకపోవడంతో కృత్రిమ వర్షం సృష్టిస్తారు. దీన్ని క్లౌడ్ సీడింగ్ అని పిలుస్తారు. వర్షం లేదా మంచు ఏర్పడటాన్ని ప్రోత్సహించడానికి పదార్థాలను గాలిలోకి వెదజల్లి వర్షం పడేలా చేస్తారు. ఈ విధానంలో సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లేదా డ్రై ఐస్ వంటి పదార్థాలతో మేఘాలను విత్తడం జరుగుతుంది. ఇవి నీటి బిందువులు చుట్టూ ఏర్పడటానికి కేంద్రకాలుగా పనిచేస్తాయి.
ఈ కణాలకు తేమను ఆకర్షించే గుణం ఉండటం వల్ల పెద్దగా వర్షంలా పడేందుకు దారితీస్తాయి. ఈ పద్ధతి వర్షం లేదా మంచును ఉత్పత్తి చేయని మేఘాలలో వర్షపాతాన్ని ప్రేరేపిస్తాయి. అయితే దీన్ని దశాబ్దాలుగా ప్రయోగం చేస్తున్నప్పటికీ.. వాతారణ పరిస్థితులు, కారకాల కారణంగా ఒక్కోసారి ప్రభావం మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఈ విధానంలోనే వర్షం పడేలా చేస్తుంది. అక్కడ అధికారులు నీటి కొరత సవాళ్లను పరిష్కరించేందుకు ఈ వ్యూహాత్మక విధానాన్ని ఉపయోగిస్తుంటోంది. ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఎక్కువగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లోనే ఉపయోగిస్తారు. అక్కడ తీవ్రమైన వేడి వాతావరణం దృష్ట్యా నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. దీన్ని పరిష్కరించేందుకు యూఏఈ శాస్త్రవేత్తలు ఈ క్లౌడ్ సీడింగ్ అనే టెక్నాలజీని ఉపయోగించారు.
అందుకోసం వారు దేశ వాతావరణంపై చాలా అప్రమత్తమైన నిఘా ఉంచుతారు. ఈ క్లౌడ్ సీడింగ్ పద్ధతితో పొడి వాతావరణ పరిస్థితుల్లో 30% నుంచి 35%, ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో 10% నుంచి 15% వరకు వర్షపాతాన్ని పెంచగలవని శాస్త్రవేత్తల చెబుతున్నారు. ఈ పద్ధతిలోనే దుబాయ్‌లో వర్షం పడేలా చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
This is Dubai's artificial rain which happens because of cloud seeding pic.twitter.com/O5Uqcf4xC7
— Historic Vids (@historyinmemes) April 8, 2024
(చదవండి: యుద్ధ భయంతో పడవ ఎక్కితే..నడి సంద్రంలో ఇంజన్ ఫెయిల్..!)