‘న్యూఢిల్లీ’ నుంచి బరిలోకి అరవింద్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఆ పార్టీ సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ తన స్థానాన్ని మార్చుకోబోవడం లేదు. త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో కూడా ఆయన న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచే పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకుడు ఆశుతోష్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కాగా ఆప్ గురువారం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అరవింద్ పేరు లేని సంగతి విదితమే.