సిఎం పార్టీ పాతాళానికి - చేరినవారు కైలాసానికి : శంకర్రావు
విజయవాడ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్తగా రాజకీయ పార్టీ పెడితే, ఆ పార్టీ పాతాళానికి వెళుతుందని మాజీ మంత్రి శంకర్రావు అన్నారు. ఆ పార్టీలో చేరినవారు కైలాసానికి వెళ్తారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో ఈరోజు ఆయన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. సీల్డ్‌కవర్ సీఎంకు అధిష్టానాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని శంకర్రావు జోస్యం చెప్పారు.
ఈనెల 29 తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై మాట్లాడదామని ముఖ్యమంత్రి తనతో అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అంతేకాకుండా సీఎం కొత్త పార్టీ పెడితే అందులో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ నేపధ్యంలో శంకర్రావు ఈ వ్యాఖ్యలు చేశారు.