CMRS
-
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో మెట్రో రైళ్ల వేగం పెంపునకు CMRS గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గంటకు 80 కి.మీ నుంచి 90 కి.మీకి స్పీడ్ పెంచుకునేందుకు CMRS అనుమతిచ్చింది. అయితే, మార్చి 28,29,30 తేదీల్లో మెట్రో రైలు స్పీడ్, సెక్యూరిటీని అధికారులు పరిశీలించారు. తనిఖీల అనంతరం కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో స్పీడ్‌ను పెంచుకునేందుకు అనుమతించింది. కాగా, మెట్రో రైలు స్పీడ్ పెంపుతో ప్రయాణికులకు ట్రావెల్ సమయం ఆదా కానుంది. నాగోల్-రాయదుర్గం మధ్య 6 నిమిషాలు, మియాపూర్-ఎల్బీనగర్ మధ్య 4 నిమిషాలు, జేబీఎస్-ఎంజీబీఎస్ మధ్య ఒకటిన్నర నిమిషం ఆదా అవుతుంది. ఇదిలా ఉండగా.. ప్రయాణికులు కోసం సూపర్ సేవర్ కార్డును మెట్రో ప్రకటించిన విషయం తెలిసిందే. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ కార్డుతో హైదరాబాద్‌లోని 57 మెట్రో స్టేషన్ల మధ్య సెలవు రోజుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. -
‘మామూలు’గా సరిపెట్టేద్దాం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘మిల్లింగ్ మాయ’పై కఠిన చర్యలకు సంబంధిత విభాగాలు కదులుతుంటే.. వాటిని అడ్డుకొనేలా మేనేజ్ చేసేందుకు అదేస్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాడు. ‘సీఎంఆర్’ బియ్యం పక్కదారి పడుతున్న ఉదంతంపై ‘మిల్లర్ల మాయ’ శీర్షికతో 9.8.14నాటి సాక్షి జిల్లా సంచికలో ప్రత్యేక వార్తా కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. మిల్లర్లు చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తుండడంతో మిల్లింగ్‌తో సంబంధం ఉన్న అన్ని విభాగాలపైనా రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్ అధికారులు కన్నేశారు. మిల్లర్ల అక్రమాలపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికలు వెళ్లాయి. అయితే అక్రమార్కులకు ప్రస్తుతం కొన్ని యూనియన్ల నాయకులు తోడయ్యారు. మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. అధికారులు కొన్నిచోట్ల గుట్టుగా దాడులు చేసినా పత్రికల్లో తమపై వార్తలు వస్తుండడంతో ఏం చేయాలో తోచని స్థితిలో మిల్లర్లు ఉన్నారు. కొన్ని కేసులు చిన్నవేనంటూ బుకాయిస్తున్నారు. ఇన్నాళ్లూ చూసీ చూడనట్టు వ్యవహరించిన అధికారులు కూడా ఈ భారీ అక్రమాలపై నిఘా అధికారుల దృష్టి పడటం తో కలవరపాటుకు గురవుతున్నారు. మరోవైపు కేసుల్లేకుండా చూసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయించేందుకు కొంతమంది మిల్లర్లు సిద్ధమయ్యారు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులను బహిరంగంగానే టార్గెట్ చేసేందుకు రంగంలోకి దిగారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడున్న పెద్దలను మచ్చిక చేసుకునేందుకు బయల్దేరారు. సాధారణంగా బియ్యం అక్రమమార్గంలో రవాణా అవుతున్నా, లెక్కకు మించి స్టాకు కనుగొన్నా అధికారులు ‘6ఏ’ కేసులు నమోదు చేస్తుం టారు. అయితే ఇటీవల జిల్లాలో భారీ ఎత్తున మిల్లర్లు అక్రమాలకు పాల్పడడడంతో ఏకంగా క్రిమినల్ కేసులు నమోదు చేయించి, ప్రభుత్వానికి రావాల్సిన బియ్యం మొత్తాన్ని రెవెన్యూ రివకరీ (ఆర్ఆర్) యాక్టు కింద వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. అక్రమ నిల్వలను సీజ్ చేశారు. పదుల సంఖ్యలో స్థానిక తహశీల్దార్లు, పోలీసుల ఆధ్వర్యంలో కేసుల నమోదుకు సిద్ధమయ్యారు. ఇక్కడే మిల్లర్లకు కొంతమంది సాయపడేందుకు ముం దుకు వచ్చారు. డబ్బిస్తే ఏ అధికారి అయినా మెడ వంచాల్సిందేనని, అవసరమైతే ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల్ని మామూళ్లతో కలిస్తే పని అయిపోతోందని భరోసా ఇస్తున్నారు. ఇందుకు మిల్లర్ల పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి యూనియన్ నాయకుల ద్వారా రాజధానిలోని ఓ మంత్రికి ఇప్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని సమాచారం. తద్వారా కేసులు లేకుండా మాఫీ చేయాలని, తమకు ఇబ్బంది పెడుడుతున్న అధికారులను ఇక్కడి నుంచి పంపించేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఇటీవలే బదిలీలకు పచ్చజెండా ఊపేయడం, నిషేధం ఎత్తేయడంతో ఈ అంశానికి మరింత బలం చేకూరుతోంది. మొక్కుబడి కేసులతోనే సరిపెట్టండి అక్రమాలపై 6ఏ కేసులతోనే సరిపెట్టేయాలని మిల్లర్లు కోరుతున్నారు. క్రిమినల్ కేసులైతే కోర్టులు చుట్టూ తిరగాల్సి రావడం, మిల్లులు సీజ్ అయితే తమకు ఆర్థికంగా నష్టం వస్తుందనే ఆలోచనలో మిల్లర్లు ఉన్నట్టు తెలుస్తోంది. మిల్లర్లు చేసే అక్రమాలకు సీ ఫీజ్ గానీ, ఫైన్ గానీ కట్టించి, ప్రభుత్వ నష్టాన్ని పూరించేందుకు తమకు మరింత గడువిస్తే నష్టపోయిన మొత్తానికి బియ్యమే ఇచ్చేస్తామని, అందువల్ల కేసులు మరెందుకంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కేసుల నుంచి తమకు విముక్తి కలిగిస్తే పెద్ద మొత్తంలో నజరానా ముట్టజెబుతామని ఆశ చూపుతున్నారు. కేసుల్ని ‘మామూలు’గానే సరిపెట్టేయాలంటూ పెద్దలు రంగంలోకి దిగడంతో దర్యాప్తు చేపట్టిన అధికారులకే ఇప్పుడు కలవరం పుడుతోంది. అంత కష్టపడి కేసులు నమోదు చేయిస్తే మిల్లర్లు డబ్బుతో ప్రభుత్వ పెద్దల్నే మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసుల నుంచి విముక్తి కలగకుండా ఉండేందుకు చట్టంలోని అన్ని నిబంధనల్నీ జోడించేందుకు సిద్ధమవుతున్నారు. కేసు వీగిపోకుండా గట్టిగా నివేదికలు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఐదేళ్లగా జిల్లాలో చోటు చేసుకున్న అక్రమాలను వెలికి తీసే పనిలో పడ్డారు. ప్రభుత్వ విభాగాలన్నీ ఒకటై మిల్లర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు యోచిస్తున్నట్టు తెలిసింది. -
ప్రయాణానికి ముంబై మెట్రో రెడీ
సాక్షి, ముంబై: రాష్ట్రంలో మొదటిసారిగా అందుబాటులోకి వస్తున్న ‘ముంబై మెట్రో’ రైలుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) బృందం సోమవారం సాంకేతిక పరీక్షలు నిర్వహించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన వివిధ రకాల పరీక్షల్లో అంతా సవ్యంగా ఉన్నట్లు అధికారులు సంతృప్తివ్యక్తం చేశారు. ఇక భద్రతాపరమైన సామర్థ్యాన్ని సూచించే ధ్రువపత్రం (సేఫ్టీ సర్టిఫికెట్) జారీ చేయడమే మిగిలిపోయింది. మహారాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని మే ఒకటో తేదీన దీనిని జారీ చేయనున్నట్లు ఇదివరకే సంకేతాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సేవలు ప్రారంభించేందుకు రైల్వే పరిపాలనా విభాగం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఆ తరువాత ముంత్రులు లేదా వీఐపీల నుంచి అపాయింట్మెంట్ లభించగానే ముహూర్తం ఖరారు చేస్తారు. లోకల్ రైళ్లలో నిత్యం రద్దీ, ఉక్కపోతతో సతమతమవుతున్న ముంబైకర్లకు మెట్రో సేవలు సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వేసవి ఎండల కారణంగా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముంబైకర్ల మెట్రో ఏసీ బోగీల్లో సౌకర్యంగా ప్రయాణించవచ్చని చెబుతున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) ముంబైలో మెట్రో రైలు ప్రాజెక్టును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెమ్మార్డీయే తొలిసారిగా మెట్రోరైలు సేవలను ప్రారంభిస్తుండడంతో వీటి కోసం నగరవాసులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మెట్రో-1 ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో వర్సోవా-అంధేరి- ఘాట్కోపర్ మధ్య నిర్మిస్తున్న 11 కిలోమీటర్లు పొడమైన కారిడార్ ప్రాజెక్టు నిర్మాణ పనులు అనేక సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అనేక డెడ్లైన్లు కూడా వాయిదా పడటంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయింది. ఎట్టకేలకు పనులు పూర్తికావడంతో సీఎంఆర్ఎస్ బృందం భద్రతా పరీక్షలు నిర్వహించింది. సేఫ్టీ సర్టిఫికెట్ మంజూరు కాగానే ముహూర్తం ఖరారు చేస్తామని మెట్రో రైల్వే భద్రతా విభాగం కమిషనర్ పి.ఎస్.వాఘేలా చెప్పారు. విమానసేవలకు ఓకే రత్నగిరి-ముంబై ప్రాంతాల మధ్య 1991లో నిలిచిపోయిన విమానసేవలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముంబైకి చెందిన ‘ఇండియాపూల్’ కంపెనీ విమానం ద్వారా ఈ రెండు ప్రాంతాలను ఇటీవల సందర్శించింది. ప్రైవేటు విమాన సేవలు ప్రారంభించేందుకు ఎలాంటి ఇబ్బందులూ లేవని సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రభుత్వమూ అనుమతులు ఇవ్వడంతో ఈ రెండు ప్రాంతాల మధ్య త్వరలోనే విమాన సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదటగా ఎనిమిది సీట్ల సామర్థ్యమున్న తేలికపాటి విమానాలను నడపాలని యోచిస్తున్నారు. ఈ సేవలను స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని భావిస్తున్నామని మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) వర్గాలు తెలిపాయి. అప్పట్లో ఎంఐడీసీ ఆధ్వర్యంలో 1991 వరకు ముంబై-రత్నగిరి జిల్లా మధ్య విమాన సేవలు నడిచేవి. ఈ చిన్న విమానాలను రత్నగిరి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు వినియోగించేవారు. కాలక్రమేణా వాటి వినియోగం తగ్గిపోయింది. అదేవిధంగా రన్‌వే కూడా విమానాలకు అనుకూలంగా లేదు. దీనికి మరమ్మతులు చేపట్టాలని ఎంఐడీసీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి స్పందనే రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఎంఐడీసీ 1991లో రత్నగిరి విమానాశ్రయంలో ప్రైవేటు విమానాల ల్యాండింగ్‌ను నిలిపివేసింది. అయితే ప్రస్తుతం రత్నగిరి జిల్లా వేగంగా విస్తరిస్తోంది. అనేక ప్రాజెక్టులు వచ్చాయి. జాతీయ ర హదారులు, రైల్వే, జలరవాణా ద్వారా రాకపోకలు, వాణిజ్య లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. వాహనాల సంఖ్య భారీగా పెరగడం, ర హదారిపై ప్రమాదకర మలుపులు, రోడ్డు ప్రమాదాలు, విలువైన సమయం వృథా తదితరాల సమస్యలను పరిగణనలోకి తీసుకుంటే విమానసేవల ప్రాధాన్యమేమిటో తెలిసి వచ్చిందని ఎంఐడీసీ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అందుకే ముంబై-రత్నగిరి మధ్య తేలికపాటి విమానాల సేవలను ప్రారంభిస్తే బాగుంటుందనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అదేవిధ ంగా కొంకణ్ ప్రాంతం కూడా పర్యాటకపరంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అందమైన సముద్ర తీరాలు ఉన్నాయి. ఇక్కడికి నిత్యం దేశ, విదేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తుంటారు. విమానసేవలు ప్రారంభిస్తే కొంకణ్ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని జిల్లా ఇంచార్జి మంత్రి ఉదయ్ సామంత్ అభిప్రాయపడ్డారు. అందుకు ముంబైలోని ఇండియాపూల్ కంపెనీతో చర్చలు జరిపామని అన్నారు. దీంతో కంపెనీ అధికారులు ఈ రెండు ప్రాంతాలను విమానం ద్వారా పర్యవేక్షించి సేవల ప్రారంభానికి అంగీకరించారని సామంత్ వివరించారు.