co living
-
రియల్టీ అంటే ఇళ్లు ఒక్కటే కాదు.. ఇవి కూడా
సాక్షి, హైదరాబాద్: డేటా సెంటర్, సీనియర్ లివింగ్, స్టూడెంట్ హౌసింగ్, కోలివింగ్ వంటి ప్రత్యామ్నాయ రియల్ ఎస్టేట్ విభాగాలలో పెట్టుబడులు వరద పారుతోంది. సాంకేతిక వినియోగం పెరగడంతో డేటా భద్రత చట్టం అనివార్యమైంది. దీంతో డేటా సెంటర్లలో పెట్టుబడులు పెరిగాయని కొలియర్స్ ఇండియా డైరెక్టర్ పీయూష్ గుప్తా తెలిపారు. గతేడాది దేశీయ ప్రత్యామ్నాయ రియల్టీలో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని రిపోర్ట్ వెల్లడించింది. 2020తో పోలిస్తే ఇది 26 శాతం మేర వృద్ధి రేటని పేర్కొంది. అధిక నాణ్యత, సాంకేతికత, పాలన, కస్టమర్ సర్వీస్‌లలో గణనీయమైన మార్పులు వచ్చాయి. డేటా వేర్‌హౌస్‌లు, షేర్డ్ స్పేస్ (రెసిడెన్షియల్ లేదా కమర్షియల్), ప్రాప్‌టెక్ వంటి కొత్త వ్యాపారాలు ఊపందుకున్నాయి. మెరుగైన పాలన, గడువులోగా డెలివరీలు, నగదు లభ్యతతో నివాస సముదాయాల మార్కెట్లో సానుకూలత తిరిగొచ్చింది. నివాస రంగంలో 900 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది నాలుగేళ్లలో అత్యధికం. పెట్టుబడిలో అందుబాటు, మధ్యతరగతి గృహాలు 64 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ–కామర్స్ డిమాండ్‌తో గత ఐదేళ్లలో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలో గరిష్ట స్థాయిలో 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడిదారులు, డెవలపర్లు, ప్రాపర్టీ యజమానులు స్థిరమైన అభివృద్ధి వైపు దృష్టిసారించారు. దేశంలో గ్రీన్ బాండ్లు, గ్రీన్ ఫైనాన్సింగ్ ఎక్కువ ఆమోదం పొందుతున్నాయి. చదవండి: ఫైర్ సెఫ్టీ యాక్ట్‌లో మార్పులు చేయండి - నరెడ్కో విజ్ఞప్తి -
47 అంతస్తుల కో లీవింగ్ ప్రాజెక్ట్.. ఇండియాలోనే అతి పెద్దది.. ఎక్కడంటే?
ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం జనాలు మెట్రో నగరాలకు వెళ్తున్నారు. వీరిలో చాలా మంది హస్టళ్లలో ఉంటున్నారు. లేదంటే ఇళ్లు అద్దెకు తీసుకుంటారు. ఖర్చు పెట్టే స్థోమత ఉన్నా ఫ్యామిలీ టైప్ సెక్యూరిటీతో అన్ని సౌకర్యాలతో కూడిన ఇళ్లు లభించడం కష్టం. ఇలాంటి వారి కోసం లగ్జరీ కో లివింగ్ ప్రాజెక్టును మన హైదరాబాద్‌లో చేపడుతున్నారు. కో లివింగ్‌కి 5 ఫ్లోర్లు నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ భారీ కో లివింగ్ ప్రాజెక్టు నిర్మాణానికి రేరా నుంచి అనుమతులు వచ్చాయి. మొత్తం 47 అంతస్థులతో హైదరాబాద్ వన్ పేరుతో భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో 41 అంతస్థులు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లకు కేటాయించగా 5 అంతస్థులను కేవలం కోలివింగ్ కోసమే కేటాయిస్తున్నారు. మిగిలిన ఫ్లోర్లో స్విమ్మింగ్‌పూల్, సెవెన్‌స్టార్ బార్, జిమ్ , కేఫ్టేరియా ఇతర సౌకర్యాల కోసం ఉపయోగించనున్నారు. కేవలం మహిళలకే త్వరలో అందుబాటులోకి రాబోయే ఈ భవనంలో ఐదు అంతస్థులు కోలివింగ్కి కేటాయించారు. అయితే కో లివింగ్ ఫెసిలిటీని కేవలం మహిళలకే కేటాయించారు. ప్రతీ గదిలో ఇద్దరు మహిళలు ఉండవచ్చు. గది వైశాల్యం 397 చదరపు అడుగుల నుంచి 546 చదరపు అడుగుల వరకు ఫుల్ ఫర్నీచర్ ఎక్విప్మెంట్తో ఉంటాయని నిర్మాణ సంస్థ చెబుతుంది. వీటికి నెలవారీ అద్దె రూ. 26,000ల నుంచి రూ. 36,000 రేంజ్లో ఉండవచ్చని అంచనా. ఫుల్ వెరిఫికేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఫుల్ వెరిఫికేషన్ పూర్తైన వారినే కోలివింగ్కి అనుమతి ఇస్తామని నిర్మాణ సంస్థ చెబుతోంది. ప్రతీ రూమ్‌లో పానిక్ బటన్ అందుబాటులో ఉంటుందని హామీ ఇస్తోంది. రిలీజియన్, జెండర్, క్యాస్ట్ తదితర వివక్ష పాటించని వారకే ఇందులో అనుమతి అని చెబుతోంది. ఈ భారీ భవనంలో ఎవరైనా డ్రగ్ వంటి మత్తు పదార్థాలు వాడుతున్నట్టు సమాచారం అందిస్తే నజరానా కూడా అందిస్తామంటోంది. 2026 నాటికి హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు ఎక్కువగా విస్తరించిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో రూ. 1500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. 2026 చివరి నాటికి 47 అంతస్థుల భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. హెచ్ 1 పేరుతో నిర్మిస్తున్న ఈ భవనం 160 మీటర్ల ఎత్తుతో ఉండబోతుంది. ప్రపంచంలోనే కోలీవింగ్కి సంబంధించి ఇదే అతి పెద్దదని నిర్మాణ సంస్థ అంటోంది. యూకే తరహాలో కోలివింగ్ కోసం ప్రత్యేకంగా భవనాలు నిర్మించే ట్రెండ్ ప్రస్తుతం యూకేలో ఎక్కువగా ఉందని. ఇండియాలో హైదరాబాద్‌తో ఈ ట్రెండ్ రానుందని నిర్మాణ కంపెనీ అంటోంది. ఐటీ, ఫార్మా సెక్టార్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌కి దేశం నలుమూలల నుంచి యువత వస్తున్నారు. హై పెయిడ్ ఎంప్లాయిస్ సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. అయితే వీరికి సకల సౌకర్యాలు, సెక్యూరిటీ కూడిన లివింగ్ స్పేస్ కొరత ఉంది. హెచ్ 1 ఈ కొరత తీరుస్తుందని నిర్మాణ కంపెనీ అంటోంది. చదవండి: 40 అంతస్థుల జంట భవనాలు కూల్చేస్తారా లేక జైళ్లో పెట్టమంటారా ? -
రెండేళ్లలో కో–లివింగ్ రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: గతేడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో కో–లివింగ్ మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. దశల వారీగా విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావటం, రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ చేరుకోవటంతో దేశీయ కో–లివింగ్ మార్కెట్ క్రమంగా రికవరీ అయింది. దీంతో వచ్చే రెండేళ్లలో దేశీయ కో–లివింగ్ మార్కెట్ రెట్టింపు అవుతుందని కొలియర్స్ అడ్వైజరీ అంచనా వేసింది. ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60 శాతం ఆక్యుపెన్సీకి చేరుకోవటంతో ఈ విభాగం శరవేగంగా కోలుకుందని పేర్కొంది. ఈ ఏడాది వ్యవస్థీకృత రంగంలో 2.10 లక్షల బెడ్స్ ఉండగా.. 2024 నాటికి రెట్టింపు వృద్ధి రేటుతో 4.50 లక్షల పడకలకు చేరుతుందని అంచనా వేసింది. కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవటం, వర్క్ ఫ్రం హోమ్, వలసల నేపథ్యంలో ఆర్ధిక పరిస్థితులు అనిశ్చితిలోకి వెళ్లిపోయాయి. దీంతో కో–లివింగ్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఈ ఏడాది మేలో 11.84 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు నవంబర్ నాటికి 7 శాతం క్షీణించింది. కరోనా సమయంలోనూ ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు నియామకాలను పెంచడంతో కో–లివింగ్ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొందని కొలియర్స్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు. ఉద్యోగ నియామకాలలో వృద్ధి, పట్టణాలకు వలసలు, విద్యార్థుల సంఖ్య పెరగడం, అసంఘటితక రంగంలో కో–లివింగ్ నమూనా వృద్ధి వంటివి ఈ పరిశ్రమ డిమాండ్ పెరిగిందని వివరించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో కో–లివింగ్ ఆక్యుపెన్సీ 45–50 శాతం, ఈ ఏడాది నాల్గో త్రైమాసికంలో 60–70 శాతానికి చేరిందని పేర్కొన్నారు. మధ్యలో సెకండ్ వేవ్ ప్రచారం కారణంగా రెండో త్రైమాసికంలో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గిందన్నారు. సంప్రదాయ నివాస సముదాయాలలో 2–3 శాతం ఆదాయంతో పోలిస్తే కో–లివింగ్ మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. -
నగరాల్లో కొత్త కల్చర్.. కో లివింగ్!
మంచి ఉద్యోగాలు కావాలంటే పెద్ద నగరాలకు వెళ్లాలి. అక్కడైతేనే పెద్ద జీతంతో కూడిన ఉద్యోగాలు వస్తాయి. కానీ అలాంటి పెద్ద నగరాల్లో ఎక్కడ ఉండాలనేది పెద్ద సమస్య. ముఖ్యంగా అమ్మాయిలైతే ఒకవైపు సదుపాయాలు, మరోవైపు భద్రత రెండింటికీ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. ఇందుకోసం ఇప్పుడు పెద్ద నగరాల్లో కొత్తగా వస్తున్న కల్చర్... కో లివింగ్. ఈ తరహా సదుపాయాలను కొంతమంది సర్వీసు ప్రొవైడర్లు అందిస్తున్నారు. అంటే ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఒకే విలాసవంతమైన ఇంటిని పంచుకోవడం అన్న మాట. ప్రస్తుతం గుర్గావ్, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇళ్లను వాళ్లే అద్దెకు తీసుకుని, వాటిలో మంచి ఫర్నిచర్ సిద్ధం చేసి వాటిని ఇలా మళ్లీ అద్దెకు ఇస్తారు. కావాలనుకుంటే ఒక ఇల్లు మొత్తం మనమే తీసుకోవచ్చు లేదా ఒకరిద్దరితో కలిసి షేర్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇళ్లలో వై-ఫై, టీవీ, ఫ్రిజ్, మైక్రోవేవ్, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్.. ఇలాంటి సదుపాయాలన్నీ సిద్ధంగా ఉంటాయి. కేవలం మనకు కావల్సిన దుస్తులు తీసుకుని అక్కడకు వెళ్లిపోతే సరిపోతుంది. వీటి అద్దెలు కూడా నెలకు 8వేల నుంచి 30 వేల వరకు ఉన్నాయి. మన బడ్జెట్‌ను బట్టే సదుపాయాలు కూడా ఉంటున్నాయి. ప్రస్తుతం ఇలాంటి సంస్థలు గుర్గావ్లో నాలుగు, బెంగళూరు ప్రాంతంలో రెండు ఉన్నాయి. గుర్గావ్లో అయితే మొత్తం 575 ఇళ్లను వీళ్లు ఇలా సిద్ధం చేశారు. అమెరికా, చైనా లాంటి దేశాల్లో ఇది ఎప్పటి నుంచో ఉందని, మన దేశంలో మాత్రం ఈ మధ్య కాలంలోనే వచ్చిందని కోహో స్టేజ్ సంస్థ వ్యవస్థాపకుడు ఉదయ్ లక్కర్ చెప్పారు. ప్రధానంగా లోపల ఉండేవాళ్లకు సౌకర్యంగా అనిపించడంతో పాటు.. నిర్వహణ సేవలు బాగుండటం ఇందులో మరో ప్రధానాంశం. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్నవాళ్లతో పాటు వేరే చోట కొన్నాళ్లు చేసి పెద్ద నగరాలకు వచ్చే యువత తాము ఉండే ప్రాంతం సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటారు. తాను ఉండే చోట ఏదైనా స్విచ్ పగిలిపోయినా, వంట గ్యాస్ అయిపోయినా తాను ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదని.. మొబైల్ యాప్‌లో ఆ విషయాన్ని తెలియజేస్తే కొన్ని గంటల్లోనే సమస్య పరిష్కారం అవుతోందని ఇలాంటి కో లివింగ్‌లో ఉంటున్న స్మృతి ఆనంద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు.