Co-living
-
కో–వర్కింగ్, కో–లివింగ్లకు మంచి భవిష్యత్తు
న్యూఢిల్లీ: రాబోయే సంవత్సరాలలో కో–వర్కింగ్, కో–లివింగ్ ప్రాజెక్ట్‌లకు మంచి భవిష్యత్తు ఉంటుందని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు. నరెడ్కో, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ సంయుక్తంగా ‘కోవిండ్ అనంతరం కో–వర్కింగ్ అండ్ కో–లివింగ్ వృద్ధి’ అనే అంశం మీద వెబినార్ నిర్వహించాయి. ఈ సందర్భంగా నరెడ్కో ప్రెసిడెంట్ నిరంజన్ హిరానందాని మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నేపథ్యంలో పెద్ద సంస్థల నుంచి ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. గతంలో సొంత ప్రాంగణాలకు ప్రాధాన్యమిచ్చే చాలా కంపెనీలు కరోనా తర్వాతి నుంచి కో–వర్కింగ్ స్పేస్ కోసం వెతుకుతున్నారని చెప్పారు. కోవిడ్‌తో విద్యా సంస్థల మూసివేత, వర్క్ ఫ్రం హోమ్ కారణంగా కో–లివింగ్ విభాగం మీద ప్రభావం చూపించిందని తెలిపారు. కో–లివింగ్‌లో స్టూడెంట్ హౌసింగ్ రాబోయే రెండేళ్లలో విపరీతమైన వృద్ధిని చూడనుందని చెప్పారు. విద్యా సంస్థలు పెద్ద ఎత్తున హాస్టల్ గృహాలను నిర్మించవని.. విద్యార్థి గృహల నిర్వాహకులతో భాగస్వామ్యం చేసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా, సౌత్ఈస్ట్ ఏషియా ఎండీ అన్షుల్ జైన్ మాట్లాడుతూ.. గతంలో కంటే కో–వర్కింగ్ స్పేస్ ఆకర్షణీయంగా మారిందన్నారు. వర్క్ ఫ్రం హోమ్ విధానాలతో తాత్కాలిక కాలం పాటు ఈ విభాగం మీద ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో ఈ రెండు రంగాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కంపెనీలు మూలధన పెట్టుబడుల పొదుపు, సౌకర్యం, వ్యయాల తగ్గింపు వంటి కారణంగా కో–వర్కింగ్ స్పేస్‌కు డిమాండ్ ఏర్పడుతుందని వివరించారు. -
వైరస్‌తో కలిసి సహజీవనం తప్పదు..
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరింత కాలం పాటు పొడిగించిన పక్షంలో దేశానికి ఆర్థికంగా.. ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్కు పొంచి ఉందని పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. లాక్డౌన్ వల్ల లక్షల ప్రాణాలను కాపాడుకోగలిగినప్పటికీ.. పొడిగిస్తూ పోవడం వల్ల బడుగు వర్గాలు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ‘టెస్టింగ్ పెరిగే కొద్దీ, కేసుల సంఖ్యపెరగడం కూడా సాధారణంగా జరిగేదే. అయితే, లాక్‌డౌన్‌ను మరింత దీర్ఘకాలం పొడిగిస్తే మాత్రం ఆర్థికంగా ఆత్మహత్యా సదృశ్యమయ్యే రిస్కు ఉంది. వైరస్‌తో కలిసి సహజీవనం చేయక తప్పదు’ అని ట్వీట్ చేశారు. -
అమ్మాయితో సహజీవనం చేస్తున్నా: ద్యుతీ చంద్
న్యూఢిల్లీ: భారత వేగవంతమైన మహిళా రన్నర్‌గా గుర్తింపుకెక్కిన ద్యుతీ చంద్ తన స్వలింగ సహజీవనంపై పెదవి విప్పింది. ఓ టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయమై తన కుటుంబంలో కలతలు చెలరేగాయని కూడా చెప్పింది. ఇటీవల కాలంలో కొందరు క్రీడాకారిణులు ఇలా బయటపడిన సంగతి తెలిసిందే. కొందరైతే పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఇదే కోవలో సహజీవనంపై బాహాటంగా అంగీకరించిన తొలి భారత అథ్లెట్ ద్యుతీనే కావడం గమనార్హం! ‘ఔను... నేను 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె నా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజిలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకూ సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడుతుంది’ అని 23 ఏళ్ల ద్యుతీ వెల్లడించింది. తమ సహజీవనం పట్ల తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... అక్క మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఆమె తన సోదరుడి భార్య నచ్చకపోతే ఇంటిలో నుంచి గెంటేసిందని చెప్పింది. తనను ఇలాంటి పనులు మానుకోకపోతే జైలుకు పంపిస్తానని బెదిరించిందని వెల్లడించింది. అయితే మేజర్ అయిన తను స్వతంత్రంగా ఉండాలనే నిర్ణయించుకున్నానని... అందుకే బహిరంగంగా తన సహజీవనంపై మాట్లాడుతున్నానని ద్యుతీ చెప్పుకొచ్చింది. ‘ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. ఎప్పటిలాగే నా కెరీర్‌ను కొనసాగిస్తాను. వచ్చే నెలలో జరిగే ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో పాల్గొంటాను. ప్రపంచ చాంపియన్‌షిప్, టోక్యో ఒలింపిక్స్‌లో అర్హత సాధించడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా భాగస్వామి అనుమతితోనే సహజీవనాన్ని బహిర్గతం చేశాను. ఇలా బయట పడటానికి మరో కారణం కూడా ఉంది. గతంలో పింకీ ప్రమాణిక్ అనే మహిళా అథ్లెట్ తన సహచర అథ్లెట్‌ను బలాత్కారం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. అందుకే అన్ని ఆలోచించాకే, భాగస్వామితో చర్చించాకే మా బంధాన్ని బయటపెట్టాను. పైగా సుప్రీం కోర్టు తీర్పుకూడా మేం బయటపడేందుకు ధైర్యాన్నిచ్చింది’ అని ద్యుతీచంద్ వివరించింది. గతంలో ఆమె కెరీర్లో సవాళ్లు ఎదుర్కొంది. పురుష హార్మోన్లు ఉన్నట్లు తేలడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ఆమెపై నిషేధం విధించింది. దీన్ని ఆమె ఆర్బిట్రేషన్ కోర్టులో సవాలు చేసి విజయం సాధించి మళ్లీ ట్రాక్‌లో అడుగుపెట్టింది. గతేడాది సుప్రీం కోర్టు మేజర్లయిన వారిమధ్య స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చింది. అయితే ఒకే లింగానికి చెందిన ఇరువురి మధ్య పెళ్లికి మాత్రం భారత్‌లో చట్టబద్ధత లేదు. తెలంగాణ కోచ్ నాగపురి రమేశ్ మార్గదర్శనంలో పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ద్యుతీ చంద్ గత ఏడాది జకార్తా ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల విభాగాల్లో రజత పతకాలు గెలిచింది. ఇటీవల దోహాలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకం నెగ్గింది. -
సమస్యల సహజీవనం!
చాటింగ్‌తో మొదలు.. ‘ఆమె ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. వయసు 26 ఏళ్లు. డేటింగ్ యాప్ ద్వారా 2018, జనవరిలో 27 ఏళ్ల యువకుడు పరిచయమయ్యాడు. అతనూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరూ మొబైల్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని చాటింగ్ ప్రారంభించారు. మనసులు కూడా కలవడంతో సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో విహారయాత్రలకు వెళ్లారు. ఆ యువకుడు తన ప్రియురాలి ఫోటోను ఓ స్నేహితుడికి చూపించాడు. ఆమె తనకు తెలుసని మిత్రుడు చెప్పాడు. ఆమె ఇంకా చాలా మందితో అఫైర్ కొనసాగించినట్లు తెలుసుకుని యువకుడు కంగుతిన్నాడు’ పార్టీలో కలిశారు.. ‘ఉత్తర భారత్‌కు చెందిన 22 ఏళ్ల యువతి నగరంలోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతోంది. 2018లో స్నేహితుడి ఇంటికి పార్టీకి వెళ్లినప్పుడు 31 ఏళ్ల టెక్కీ పరిచయం అయ్యాడు. అభిరుచులు కలిసి సహజీవనం ప్రారంభించారు. ఆతర్వాత అతనితో పెళ్లి ఇష్టం లేదంటూ ఆ యువతి తన సొంతూరుకి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోను చూపి బెదిరించడం ప్రారంభించాడు. ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు’ వెలుగులోకి రానివెన్నో టెక్ హబ్‌గా పేరొందిన బెంగళూరు సహజీవనానికి కూడా కేంద్రంగా మారుతోంది. పైన చెప్పిన సంఘటనలు కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. నగరంలో ఇంకా వెలుగుచూడని ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే సాకుతో పెళ్లి అనే సంప్రదాయానికి తూట్లు పొడిచి విదేశాల్లో ప్రాచుర్యం పొందిన సహజీవనం పేరిట యువత కొన్ని నెలల పాటు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. తరువాత ఒకరితో ఒకరికి పొసగకనో, మరో కారణంతోనో విడిపోతున్నారు. కొందరు ఇంతటితో ఆగకుండా సహజీవనంతో మోసపోయామని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఒక్క 2018లోనే కర్ణాటక వ్యాప్తంగా ఇలాంటి కేసులు 300కు పైగా నమోదయ్యాయి. ఫేస్బుక్, ఇతర డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులతో సహజీవనం చేసేందుకు చాలా మంది యువత సిద్ధమవుతున్నారు. ఆకర్షణ కూడా సహజీవనానికి ఒక కారణంగా తెలుస్తోంది. బాధితుల్లో యువతీయువకులు ఇద్దరూ ఉంటున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు బెయిల్ సులువుగా దొరుకుతోంది. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, బెంగళూరు -
సహజీవనం సరి కాదు
స్టార్ స్టేటస్‌ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్లు పెళ్లి గురించి ప్రస్తావించడానికి ఎక్కువగా ఇష్టపడరు. కెరీర్ గ్రాఫ్ గురించో.. లేదా పర్శనల్ విషయాలు ప్రైవేట్‌గా ఉండటం కోసమో పెళ్లి ఊసెత్తితే చాలు మాట దాటేయటమో లేదా మౌనవ్రతం చేస్తుంటారు. కానీ ఆలియా భట్ అలా కాదు. 30కి ముందే మూడు ముళ్లు వేయించుకుంటానేమో? అంటున్నారు. పెళ్లి విషయం గురించి ఆలియా మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం పెళ్లి మీద ఎటువంటి ఆలోచనలు లేవు. హానెస్ట్‌గా చెప్పాలంటే ఈ విషయం ఇప్పుడు జరగాలి.. అది అప్పుడు జరగాలి అని ప్లాన్ చేసుకునే టైప్ కాదు నేను. ఆ క్షణంలో చేయాలనిపించింది చేసేస్తా. నా ఉద్దేశంలో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయనప్పుడు జరిగితేనే అసలు కిక్కు. అందరూ నేను ముప్ఫై ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటాననుకుంటారేమో. దాని కంటే ముందే చేసుకొని సర్ప్రైజ్ చేస్తానేమో. నాకు లివ్ ఇన్ రిలేషన్షిప్ మీద మంచి ఒపీనియన్ లేదు. సహజీవనం సరి కాదనన్నది నా అభిప్రాయం. అందుకే నాకు నచ్చినవాడు దొరికితే ‘ఐలవ్ యు. మనం పెళ్లి చేసుకుందాం, కలిసుందాం. పెళ్లి తర్వాత కూడా నేను వర్క్ చేస్తాను’ అని చెప్పేస్తాను’’ అని పేర్కొన్నారు ఆలియా భట్. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్‌హీరో రణ్‌బీర్‌తో లవ్‌లో ఉన్నారని టాక్. ఈ రిలేషన్‌షిప్‌ని ఉద్దేశిస్తూ ఆలియా ఇలా మాట్లాడి ఉంటారా? అంటే సన్నాయి మేళం వినిపించేదాకా చెప్పలేం. -
బాయ్‌ఫ్రెండ్ ఎందుకు భరించాలి?
హీరోయిన్ కాబట్టి నాకు తప్పదు. కానీ, అతను (బాయ్‌ఫ్రెండ్) ఎందుకు మాటలు పడాలి? ఎవరెవరో ఏదేదో అంటుంటే ఎందుకు భరించాలి? అంటున్నారు ఇలియానా. ప్రముఖ ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్, ఇలియానా ఎప్పట్నుంచో డేటింగ్ (సహ జీవనం) చేస్తున్నారు. ఇద్దరూ కలసి షికార్లకు వెళతారు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ, బాయ్‌ఫ్రెండ్ గురించి ఇలియానా ఎప్పుడూ పబ్లిగ్గా మాట్లాడింది లేదు. ఎందుకలా? ఇలియానాను అడిగితే... ‘‘నటీనటులను ప్రేక్షకులు ఎంతగా ప్రేమిస్తారో ఒక్కోసారి అంతకు రెండింతలు ద్వేషిస్తారు. ఏ కారణం లేకుండానే తిడతారు. ఏవేవో మాటలంటారు. కొన్నిసార్లు వాళ్ల మాటలు మరీ దారుణంగా ఉంటున్నాయి. 11 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. ఇవన్నీ నాకు తెలుసు. నటిస్తున్నాను కాబట్టి నాకు తప్పదు. అతనూ మాటలు పడడం మంచిది కాదు. అందుకే, అతని గురించి పబ్లిగ్గా మాట్లాడను’’ అన్నారు. ఇలియానా మాట్లాడకున్నా జనాలు మాత్రం మాట్లాడుతూనే ఉంటారేమో!!