co operative
-
సీసీఎస్ బకాయిల కోసం రూ.500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను పూర్తిగా వాడేసుకుని ఉద్యోగులకు రుణాలు, విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ చెల్లించకుండా గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దేందుకు సిద్ధపడింది. కేవలం సీసీఎస్ బకాయిలు చెల్లించేందుకు వీలుగా నేషనల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రూ.400 కోట్ల రుణం తీసుకుని ఆర్టీసీకి అందించాలని నిర్ణయించింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వనుంది. సీసీఎస్ నిల్వ మొత్తాన్ని వాడుకోవడం, ప్రతినెలా దానికి జమ చేయాల్సిన మొత్తాన్ని ఎగ్గొడుతున్న ఫలితంగా దానికి ఆర్టీసీ దాదాపు రూ.950 కోట్ల వరకు బకాయి పడింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం కష్టంగా మారడంతో ముందుగా రూ.500 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. అప్పుడు వద్దనుకుని.. నిజానికి ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకునే అంశం దాదాపు మూడు నెలల క్రితమే చర్చకొచ్చింది. అప్పుడు ఆ కార్పొరేషన్‌తో అధికారులు చర్చించారు. సాధారణంగా ఎన్సీడీసీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు చెందిన సహకార సంస్థలకే రుణాలిస్తుంది. సీసీఎస్ కూడా సహకార సంస్థే కావటంతో రుణం ఇచ్చేందుకు అప్పట్లో అంగీకరించినట్లు తెలిసింది. అయితే రుణం నేరుగా సీసీఎస్‌కే ఇస్తామని, ఆర్టీసీకి ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నట్టు సమాచారం. తీసుకునే రుణంలో కొంత సీసీఎస్‌కు ఇచ్చి, మిగతాది తమ అవసరాలకు వాడుకోవాలన్న యోచనలో ఉన్న ఆర్టీసీ అందుకు అంగీకరించలేదు. ఫలితంగా అప్పట్లో ఆ రుణ అంశం అటకెక్కిందని తెలిసింది. ఇప్పుడు సీసీఎస్ పరిస్థితి దారుణంగా తయారు కావటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో డబ్బు దాచుకుని నెలనెలా వడ్డీ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులు ఇటీవల బస్‌భవన్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. దీనికి సంబంధించి ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. సీసీఎస్‌లో సభ్యత్వం ఉండటం.. నెలనెలా జీతంలో కోత పడుతుండటంతో ఏకంగా సభ్యత్వాలనే మూకుమ్మడిగా రద్దు చేసుకోవాలని ఉద్యోగులు భావిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సీసీఎస్ మూసివేతకు రంగం సిద్ధం అయిన తీరుపై ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. దీంతో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. గతంలో వద్దనుకున్న ఎన్సీడీసీ రుణాన్ని తిరిగి తీసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు ఇవ్వాలనే విషయంపై చర్చించారు. దీనికి ఆర్థిక శాఖ అంగీకరించడంతో ఆ రుణం పొందేందుకు మార్గం సుగమమైంది. బడ్జెట్లో పేర్కొన్న రుణం అందినట్టే.. బడ్జెట్(2021–22)లో ఆర్టీసీకి రూ.1,500 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రభుత్వ బ్యాంకు నుంచి రూ.వేయి కోట్ల రుణంపై చర్చించగా, తొలుత రూ.500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మొత్తం దాదాపు నెలన్నర క్రితం అందింది. అది ఖర్చు చేశాక మరో రూ.500 కోట్ల రుణం ఇవ్వనున్నట్లు ఆ బ్యాంకు పేర్కొంది. వెరసి రూ.వేయి కోట్లు అక్కడి నుంచి రానుండగా, తాజాగా ఎన్సీడీసీ నుంచి మరో రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించడంతో ప్రభుత్వ రుణం దాదాపు ఆర్టీసీకి అందినట్లు అవుతుంది. ఉద్యోగుల బకాయిలకు వినియోగం? దాదాపు నెలన్నర క్రితమే అందిన రూ.500 కోట్ల బ్యాంకు రుణాన్ని ఎలా ఖర్చు చేయాలనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేక అలాగే ఉంచారు. ఇప్పుడు వాటిని ఉద్యోగుల బకాయిల కింద వాడాలని భావిస్తున్నట్లు సమాచారం. సీసీఎస్‌కు ఎన్సీడీసీ రుణాన్ని ఇవ్వనుండగా, ఉద్యోగులకు ఉన్న బాండ్ల బకాయిలు, వేతన సవరణ బకాయిలు, విశ్రాంత ఉద్యోగుల బకాయిలకు వాటిని వాడాలని భావిస్తున్నట్లు తెలిసింది. అద్దె బస్సు బకాయిలు కూడా చెల్లించాలని అనుకుంటున్నట్లు సమాచారం. వాటి వ్యయంపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టత వచ్చాక వెల్లడించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. -
గుంటూరులో సీఎం జగన్‌కు పాలభిషేకం
సాక్షి, గుంటూరు: 56 బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం పాలకమండలి సభ్యులను నియమించినందకు ఆ కుల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు గుంటూరు నగరం పాలెంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా ఇన్చార్జి మంత్రి రంగనాథ రాజు పాలాభిషేకం చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, జ్యోతిరావు పూలే విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరుగ నాగార్జున, విడుదల రజిని ,ఉండవల్లి శ్రీదేవి, అన్నాబత్తుని శివ కుమార్, మద్దాల గిరిధర్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ‘బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలకమండలి నియమించడం గొప్ప శుభపరిణామం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్దపీట వేశారు. బీసీలు రాజకీయంగా ,ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బీసీల అభివృద్ధికి సీఎం జగన్ ఎన్నికల ముందే ప్రణాళికను సిద్ధం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి బీసీ వర్గాలకు మేలు చేశారు కాబట్టే సీఎం జగన్ గెలుపులో బీసీలు భాగస్వాములయ్యారు. సీఎం జగన్ క్యాబినెట్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 60 శాతం పైగానే ఉన్నారు’ అని అన్నారు. అదేవిధంగా హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్‌లా కాకుండా బ్యాక్ బోన్ కాస్ట్‌గా నిలబెట్టారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి బాటలు వేశారు. సీఎం జగన్ దేశానికే ఆదర్శం. గత ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడికుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గుంటూరుకు 4 కార్పొరేషన్ చైర్మన్లు రావడం ఆనందకరం. కార్పొరేషన్ ఏర్పాటుతో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవచ్చు’ అని అన్నారు. ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ, ‘ సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో జ్యోతిరావు పూలే కనిపించారు. దేశ రాజకీయాల్లో సీఎం జగన్‌కు ముందు ఆ తరువాత అన్న కోణంలో రాజకీయాలు నడుస్తున్నాయి. బీసీ కులాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు’ అని అన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాధ రాజు మాట్లాడుతూ, ‘ దేశంలో ఎక్కడా లేని లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఎవరికి తెలియని కులాలను కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గుంటూరు జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం ఆనందంగా ఉంది. కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆ కులాల్లోని సమస్యను పరిష్కరించవచ్చు’ అని పేర్కొన్నారు. చదవండి: ఏపీలో బీసీలు.. బ్యాక్ బోన్ క్లాస్ -
14 నుంచి సహకార వారోత్సవాలు
బోట్‌క్లబ్ (కాకినాడ): జిల్లాలోని అన్ని సొసైటీల్లోను సహకార వారోత్సవాల సందర్భంగా పతాకాలు ఆవిష్కరించాలని జిల్లా సహకార అధికారి టి.ప్రవీణ పేర్కొన్నారు. స్థానిక డీసీసీబీలో శుక్రవారం ఈ నెల 14 నుంచి 20 వరకూ జరిగే 63వ సహకార వారోత్సవాలపై సహకార సంఘ అధ్యక్షుడు, సీఈవోలుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలు అందించాలన్నారు. సహకార విద్యాధికారి ఆదిమూలం వేంకటేశ్వరరావు మాట్లాడుతూ సహకార వారోత్సవాలను ఈ నెల 14న డీసీసీబీ చైర్మ¯ŒS వరుపుల రాజా డీసీసీబీలో ప్రారంభిస్తారన్నారు. కాకినాడ డివిజ¯ŒS సహకార అధికారి కె.పద్మ ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించారు. పెద్దాపురం డివిజ¯ŒS సహకార అధికారి ఎ.రాధాకృష్ణ పరపతేతర వ్యాపారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు దున్నా జనార్థనరావు, సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు.