14 నుంచి సహకార వారోత్సవాలు
Published Fri, Nov 11 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM
బోట్‌క్లబ్ (కాకినాడ):
జిల్లాలోని అన్ని సొసైటీల్లోను సహకార వారోత్సవాల సందర్భంగా పతాకాలు ఆవిష్కరించాలని జిల్లా సహకార అధికారి టి.ప్రవీణ పేర్కొన్నారు. స్థానిక డీసీసీబీలో శుక్రవారం ఈ నెల 14 నుంచి 20 వరకూ జరిగే 63వ సహకార వారోత్సవాలపై సహకార సంఘ అధ్యక్షుడు, సీఈవోలుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రైతులకు సేవలు అందించాలన్నారు. సహకార విద్యాధికారి ఆదిమూలం వేంకటేశ్వరరావు మాట్లాడుతూ సహకార వారోత్సవాలను ఈ నెల 14న డీసీసీబీ చైర్మ¯ŒS వరుపుల రాజా డీసీసీబీలో ప్రారంభిస్తారన్నారు. కాకినాడ డివిజ¯ŒS సహకార అధికారి కె.పద్మ ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించారు. పెద్దాపురం డివిజ¯ŒS సహకార అధికారి ఎ.రాధాకృష్ణ పరపతేతర వ్యాపారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఉపాధ్యక్షుడు దున్నా జనార్థనరావు, సహకార శాఖ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement