co-ordinators
-
సాక్షర భారత్ కోఆర్డినేటర్ల నిరసన
కామారెడ్డి రూరల్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సాక్షరభారత్ గ్రామ, మండల కోఆర్డినేటర్ల ధీర్ఘకాల కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నాచౌక్ వద్ద చేపట్టిన రిలే నిరహార దీక్షలు మంగళవారం నాటికి రెండో రోజుకు చే రుకున్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సాక్షరభారత్ కోఆర్డినేటర్ల జిల్లా అధ్యక్షుడు బత్తుల రవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 8 సంవత్సరాల నుంచి చాలీచాలనీ వేతనాలు అందిస్తూ అవికూడా సంవత్సరాల కాలం పాటు చెల్లంచకుండా కోఆర్డినేటర్ల జీవితాలతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరాస్యత అభివృద్ధి చెందకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అందించాలని దానిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వాలు తమకు న్యాయం చేసేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ప్రతిరోజు, రెండు మండలాల చొప్పున గ్రామ, మండల కోఆర్డినేటర్లు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లైన సాక్షరభారత్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనసాగిస్తు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, çసమానవేతనం అందించాలని, వయోజనవిద్య, సాక్షరభారత్ కార్యక్రమాన్ని పంచాయితీరాజ్‌శాఖలో విలీనం చేయాలని వయోజన విద్యా కేంద్రాలను గ్రంథాలయాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. మండల కోఆర్డినేటర్లు చంద్రశేఖర్, దత్తు, కామారెడ్డి, బిచ్కుంద మండలాలగ్రామకోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ల సమావేశం
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో నూతన వ్యవస్థను ఏర్పాటు చేసిన అనంతరం తొలిసారిగా జిల్లా పార్టీ నేతల సమావేశాన్ని సోమవారం కాకినాడలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం పార్లమెంట్ జిల్లాల అధ్యక్షులతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు మాత్రమే హాజరయ్యే ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత, ప్రాంతీయ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు హాజరుకానున్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలను సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు నాగమల్లితోట జంక్షన్ సమీపంలో హెలికాన్టైమ్స్లో ఈ సమావేశం జరగనుంది. జగన్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోన్న నేపథ్యంలో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వైఎస్సార్ సీపీ విధానాలపై ప్రజల వెంట పార్టీ ఉందన్న భరోసా ఇచ్చేలా భవిష్యత్ కార్యాచరణపై నేతలకు సూచనలు ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులతోపాటు, పార్లమెంట్, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు కూడా హాజరుకావాలని ధర్మాన పిలుపునిచ్చారు. నేడు కంపర రమేష్ బాధ్యతలు స్వీకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడిగా కంపర రమేష్ సోమవారం సాయంత్రం 4 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్‌హాలు ఆవరణలోని ఆడిటోరియంలో జరిగే సమావేశానికి మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణతోపాటు జిల్లా పార్టీ నేతలు కూడా హాజరుకానున్నారు. తొలుత 50 బిల్డింగ్ సెంటర్ నుంచి భానుగుడి, మెయిన్‌రోడ్డు, సినిమారోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించి అనంతరం బాధ్యతల స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారు. -
అందని అక్షరం
గ్రామీణ ప్రాంతాల్లో వయోజనులను విద్యావంతులను చేయాల్సిన సాక్షరభారత్ కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రతి రోజు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు అక్షరాలు నేర్పేందుకు ప్రతి గ్రామంలో వీటి ఏర్పాటు చేశారు. గ్రామ కో-ఆర్డినేటర్లను నియమించినా ఫలితం లేకుండా పోయింది. కేంద్రాల్లో వసతులు లేకపోవడం, సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో అనుకున్న లక్ష్యాన్ని ఇవి సాధించలేకపోతున్నాయి. 60 శాతం మహిళలు నిరక్ష రాస్యులే: జిల్లా వ్యాప్తంగా 34 మండలాల పరిధిలోని 570 గ్రామ పంచాయతీల్లో 7,29,792 మంది మహిళలు నిరక్షరాస్యులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 15 నుంచి 50 ఏళ్లలోపు వారే 60 శాతం అంటే 4,37,875 మంది ఉన్నట్లు తేల్చారు. ఆదోని డివిజన్‌లోనే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కోసిగిలోని 23.80 శాతం మాత్రమే మహిళల్లో అక్షరాస్యులున్నారు. దాని తర్వాత పెద్దకడుబూరు 27,26, హొళగుంద 31.15, కౌతాళం 31.37, సి. బెళగల్ 31.53, నందవరం 32.70, దేవనకొండ 32.90, ఆస్పరి 33.12, మంత్రాలయం 33.44, గోనెగండ్ల 34.41, క్రిష్ణగిరి 39.26, తుగ్గలి 39.26, హాలహర్వి 40.53, గూడూరు 41.19, కోడుమూరు 42.39, వెల్దుర్తి 43.44, ఎమ్మిగనూరు 43.59, ప్యాపిలి 44.08, చిప్పగిరి 44.18, రుద్రవరం 44.44, పత్తికొండ 44.85, కొలిమిగుండ్ల 45.73, అవుకు 46.63, ఆలూరు 46.91, మద్దికెర 47.47, సంజామల 48.02, మహానంది 48.31, కొత్తపల్లి 48.63, బండిఆత్మకూరు 48.70, దొర్నిపాడు 48.71, గడివేముల 49.36, జూపాడుబంగ్లా 49.37, చాగలమర్రి 49.61, ఆదోని 49.76 శాతంగా మహిళల్లో అక్షరాస్యత ఉన్నట్లు నిర్ధారణ అయింది. నవంబర్ 15 నుంచి ఆరు నెలల పాటు అక్షరాస్యతా ప్రత్యేక కార్యక్రమం ద్వారా వీరిని అక్షరాస్యులుగా చేసేందుకు ప్రణాళిక తయారు చేశారు. ఇందుకుగాను రూ.1000 గౌరవ వేతనంతో ప్రతి పంచాయతీకి ఇద్దరి చొప్పున నియమించారు. ఒక్కొక్కరు 30 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని వీరికి లక్ష్యం నిర్దేశించారు. అయితే ఆయా ప్రాంతాల్లో కోఆర్డినేటర్లు ఇచ్చిన పుస్తకాలు కేంద్రాలకే పరిమితమయ్యాయి. అక్షరదీపం, అక్షర భారతి కేంద్రాలు ఏనాడో మూలనపడ్డాయి. అధికారులు నిర్లక్ష్యం, మండల సాక్షరభారత్ కోఆర్డినేటర్లు పర్యవేక్షణ పూర్తిగా కొర బడటంతో కేంద్రాలకు బోర్డులే కాదు చిరునామాలు కూడా అగుపించడంలేదు. కోఆర్డినేటర్లు తప్పుడు సమాచారంతో తప్పుడు రికార్డులు రాసేం దుకు ఆఫీసులకు పరిమితమైన వారు సెంటర్లును నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇదీ సాక్షరభారత్ కేంద్రాల పరిస్థితి.. ఆలూరు మండలంలో 14 సాక్షరభారత్ కేంద్రాలు సరిగా పనిచేయడం లేదు. వాలంటీర్లకు ఆరు నెలలకోసారి వేతనాలు అందుతున్నాయి. వీరి పనితీరు సక్రమంగా లేదంటూ మండల కో-ఆర్డినేటర్లు, సంబంధిత అధికారులు వేతనంలో కోతలు విధిస్తున్నారు. ఆస్పరి మండలంలో 20 పంచాయతీల్లో కేంద్రాల నిర్వహణ గాలికొదిలేశారు. వలంటీర్లకు గౌరవ వేతనం సక్రమంగా రాకపోవడంతో సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారు. దేవనకొండ మండలంలో 20 కేంద్రాలున్నా 15వేల మంది, చిప్పగిరి మండలంలో 12 కేంద్రాలున్నా 9 వేల మంది నిరక్ష్యరాస్యులుగానే మిగిలిపోయారు. హొళగుంద మండలంలో 17, హాలహర్వి మండలంలో 15 పంచాయతీల్లో సాక్షరభారత్ కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేదు. శ్రీశైలం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సాక్షర భారత్ కేంద్రాలకు బోర్డులు మాత్రమే దర్శనమిస్తున్నాయి మినహా వాటి తలుపులు మాత్రం తెరుచుకోలేదు. దీంతో నిరక్షరాస్యులైన వయోజనులు అటువైపు వెళ్లడం లేదు. ఆత్మకూరు మండలంలో 13 సాక్షర భారత్ కేంద్రాల్లో 26 మంది కో ఆర్డినేటర్లు 780మంది నిరక్షరాస్యులకు బోధిస్తున్నట్లు, వీరిలో 656 మంది మహిళలు వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే వీరిలో 50 శాతం మంది మాత్రమే అక్షరాస్యులుగా మారారు. వెలుగోడు మండలంలో 8 సాక్షర భారత్ కేంద్రాలో 16మంది కో ఆర్డినేటర్లున్నారు. వేతనాలు సరిగా రాకపోవడంతో కేంద్రాలు నిర్వహించడం మానేశారు. మహానంది మండలంలో 22 కేంద్రాల్లో 660 మందికి విద్య నేర్పుతుండగా 330 మంది మహిళలున్నారు. 50శాతం మిహ ళలు కూడా అక్షరాస్యులు కాలేకపోయారు. బండిఆత్మకూరు మండలంలో 26 కేంద్రాల్లో 450 మంది మహిళలు విద్యనభ్యసిస్తున్నారు. ఈ సంఖ్య రికార్డులకు మాత్రమే పరిమితమైందన్న విమర్శలున్నాయి. పత్తికొండ మండలంలో 30 సెంటర్లలో 900 మంది, తుగ్గలిలో 38 సెంటర్లలో 1,440 మంది, మద్దికెరలో 14 సెంటర్లలో 420 మంది, క్రిష్ణగిరిలో 30 కేంద్రాల్లో 1,220 మంది, వెల్దుర్తి మండలంలో 44 సెంటర్లలో 1,260 మంది అక్షరాలు నేర్చుకుంటున్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ప్రతి మండలంలో ఐదారేళ్ల నుంచి సెంటర్లు నిర్వహించినప్పటికి కేవలం 8 నుంచి 10 శాతం మాత్రమే అక్షరాలుగా మారినట్లు సమాచారం. -
సాక్షర భారత్‌కు నిధుల జబ్బు
సాక్షి, కడప : సాక్షర భారత్ లక్ష్యం నీరుగారి పోతోంది. 15 సంవత్సరాలకు పైబడిన నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమం నామమాత్రంగా మారింది. ఏడాదిగా గ్రామ కోఆర్డినేటర్లు, మండల, జిల్లా కోఆర్డినేటర్లకు జీతాలు అందడంలేదు. దీంతో జిల్లాలో పలు చోట్ల సాక్షరభారత్ కేంద్రాలు మూతబడుతున్నాయి. వీరికి జీతాలు చెల్లించక పోవడంతో అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా క్షేత్ర స్ధాయిలో మాత్రం అశించిన మేర ఫలితాలు దక్కడంలేదు. వయోజనులకు వృత్తి నైపుణ్యాల కోసం ఇవ్వాల్సిన శిక్షణలు నిధులున్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో అటకెక్కాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ ,రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులను విడుదల చేయక పోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. రావలసిన జీతాల బకాయిలు ఇవే.. గ్రామ కో ఆర్డినేటర్లకు నెలకు రూ. 2 వేలు, మండల, జిల్లా కో ఆర్డినేటర్లకు నెలకు రూ. 6 వేలు చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది. ఈ మొత్తం ఏడాదిగా వీరికి అందడం లేదు. సాగుతోందిలా... సాక్షర భారత్ కార్యక్రమాన్ని సెప్టెంబరు 8, 2009న ప్రధానమంత్రి లాంఛనంగా ప్రారంభించినా బాలారిష్టాలను అధిగమించి కార్యక్రమం అమలయ్యే సరికే ఏడాది సమయం పట్టింది. జిల్లాలో 2,76,940మంది పురుషులు, 3,44,565 మంది మహిళలు కలిపి మొత్తం 6,21,505 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే నాలుగు దశల్లో అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు రూ. 6 కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ ఆశించిన మేర ఫలితం కనిపించడం లేదు. పేపరు పైన అంకెలు తప్ప క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. 2012-13కు సంబంధించి సమ్మె నేపథ్యంలో ఎంత మంది ఉత్తీర్ణులైంది పూర్తి స్థాయిలో వివరాలు అందలేదు. నాల్గవ దశ కార్యక్రమం సెప్టెంబరు 2013లో ప్రారంభం కావాల్సినప్పటికీ నవంబరు 1 నుంచి ఆలస్యంగా ప్రారంభమైంది. అటకెక్కిన శిక్షణ వయోజన విద్య కేంద్రాలలో నమోదైన లబ్ధిదారులకు అక్షరాస్యతతోపాటు వృత్తి విద్య నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. స్వయంగా ఆర్థిక పరిపుష్టి కలిగేలా తర్ఫీదు ఇవ్వాలి. ముఖ్యంగా టైలరింగ్, డిజైనింగ్, ఫినాయిల్, జండూబామ్, డిటర్జెంట్లు, తినుబండారాలు, క్యాండిల్ తయారీ వంటి వాటిపై శిక్షణ ఇవ్వాలి. ప్రతి పంచాయతీలో 50 మంది తప్పకుండా శిక్షణ పొందేలా చూడాలి. అయితే జిల్లాలో ఇప్పటివరకు కేవలం 40, 50 పంచాయతీల్లో మాత్రమే ఈ శిక్షణలు జరగడం గమనార్హం. ముఖ్యంగా శిక్షణలు ఇచ్చే ఏజెన్సీలను ప్రభుత్వం ఎంపిక చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతో నిధులు ఉన్నప్పటికీ శిక్షణలు అటకెక్కాయి. మహిళల అక్షరాస్యత పెంపు కోసం ప్రస్తుతమున్న సాక్షర భారత్ కార్యక్రమం అంతంత మాత్రంగా నడుస్తుంటే ప్రభుత్వం కొత్తగా మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న 16 మండలాల్లోని 249 పంచాయతీల్లో 14,940 మంది మహిళలను అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఆరు నెలల ప్రత్యేక కోర్సుగా ఏర్పాటు చేసి ఒక్కో పంచాయతీలో ఇద్దరు ఇన్‌స్ట్రక్లర్లను ఏర్పాటు చేయడంతోపాటు వారికి రూ. 1000 గౌరవ వేతనం ఇవ్వనున్నారు. ముఖ్యంగా బద్వేలు, రాయచోటి ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ కార్యక్రమం ఏమేరకు సఫలమవుతుందో వేచి చూడాల్సిందే. -
సంతకం మందమే..
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన సాక్షరభారత్ లక్ష్యానికి ఆమడదూరంలో ఉంది. కో ఆర్డినేటర్లకు ఏడాదిగా వేతనాలు రాకపోగా కేంద్రాలకు సరఫరా చేయాల్సిన పుస్తకాలు, ఇతర వస్తువులు సక్రమంగా రావడం లేదు. దీంతోపాటు అధికారుల పర్యవేక్షణా లోపంతో జిల్లాలో సగానికిపైగా కేంద్రాలు మూతపడ్డాయి. మిగిలిన కేంద్రాలు సైతం మూతపడే దశకు చేరుకున్నాయి. 2010 సెప్టెంబర్ 8న మంత్రి శ్రీధర్‌బాబు సాక్షరభారత్ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ది సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని ఆనాడు ఘనంగా ప్రకటించారు. జిల్లాలో గుర్తించిన 14.40 లక్షల మంది నిరక్షరాస్యులను 2014 వరకు అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యం నిర్ణయించుకోగా.. ఈ మూడేళ్లలో 4.30 లక్షల మందిని మాత్రమే ఓనమాలు నేర్పించినట్లు రికార్డులు చెబుతున్నాయి. వాస్తవంగా అంతమంది అక్షరాస్యత సాధించలేదని సమాచారం. రికార్డుల ప్రకారం చూసుకున్నా మిగతా 10లక్షల మందిని అక్షరాస్యులుగా చేసేందుకు ఎంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఆగస్టు 31న కలెక్టర్ అధ్యక్షతన జరిగిన వయోజన విద్యాశాఖ సమీక్షలో జిల్లాలో అక్షరాస్యత 64 శాతం ఉందని, 10.30 లక్షల మంది నిరక్షరాస్యులున్నారని, మార్చి 2014లోగా 5లక్షల మందిని, మార్చి 2015లోగా మరో 5లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించడం కొసమెరుపు. మూడేళ్లలో 4లక్షల మందిని మాత్రమే అక్షరాస్యులుగా తీర్చిదిద్దగా, అస్తవ్యస్త నిర్వహణతో ఏడాదిలో 5లక్షల మందికి ఎలా చదువు నేర్పిస్తారో అధికారులకే తెలియాలి. అంతా అస్తవ్యస్తం.. జిల్లాలో ప్రతి గ్రామానికి ఒకటి చొప్పున మొత్తం 1194 లోక్‌శిక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి ఇద్దరు చొప్పున 2,388 మంది గ్రామ కో ఆర్డినేటర్లను, మండలానికొక్కరు చొప్పున 57 మండల కో ఆర్డినేటర్లను నియమించారు. 14.40 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించి 2014 వరకు వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు గ్రామ కో ఆర్డినేటర్లతోపాటు ఆయా గ్రామాల్లోని డ్వాక్రా మహిళలు, ఆశ కార్యకర్తలు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, ఇతర స్వచ్ఛంద సంస్థలవారు ఒక్కొక్కరు 20 మంది చొప్పున దత్తత తీసుకుని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వం ప్రతీ కేంద్రానికి ప్రైమరీ పుస్తకాలు, లాంగ్ నోట్‌బుక్, పెన్సిల్, ఎరేజర్, చాక్మార్ వంటివి అందించాలి. కానీ, అధికారులు సగానికి పైగా సెంటర్లకు ఈ వస్తువులు సరఫరా చేయలేదు. స్వచ్ఛందంగా బోధించేవారిని ప్రోత్సహించకపోవడంతో వారు తమ పనుల్లో బిజీగా ఉన్నామని, రాత్రి పూట చదువు చెప్పడం వీలు కావడం లేదని విముఖత చూపుతున్నారు. దీంతో జిల్లాలోని సగానికిపైగా కేంద్రాలు తెరిచిన పాపానపోలేదు. ఏడాదిగా అందని వేతనాలు మండల కో ఆర్డినేటర్లకు నెలకు రూ.6వేలు, గ్రామ కో ఆర్డినేటర్లకు రూ.2వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. ఈ చాలీచాలని జీతాలు ఏడాదిగా అందకపోవడంతో గ్రామ కో ఆర్డినేటర్లు కేంద్రాల నిర్వహణకు స్వస్తిపలుకుతున్నారు. వీరికి 2012 ఆగస్టు నుంచి జీతాలు చెల్లించాల్సి ఉంది. మండల కో ఆర్డినేటర్లకు సైతం జనవరి నుంచి వేతనాల జాడే లేదు. దీంతో వీరు కూడా నామ్‌కే వాస్తేగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేగాకుండా కో ఆర్డినేటర్ల వేతనాలకు ప్రభుత్వం సర్వేల పేరుతో మెలికపెట్టింది. వేతనాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ ఖాతాల్లో జమ చేస్తుంది. పంచాయతీలు వేతనాలు చెల్లిస్తాయి. సాక్షరభారత్ ఆధ్వర్యం లో 2011లో అక్షరాస్యత గణన నిర్వహించగా, ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరిచే వరకు తాత్కాలిక సిబ్బందికి వేతనాలు చెల్లించరాదని ప్రభుత్వం నిర్ణయించింది. వేతనాలు విడుదల కాకపోవడంతో ఆన్లైన్ ప్రక్రియ ఈ ఆగస్టు 31లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. గడువు మేరకు ఆన్లైన్ ప్రక్రియ పూర్తయినా వేతనాలు మాత్రం అందకపోవడం గమనార్హం. నెలాఖరులోగా వేతనాలు నేను వారం రోజుల క్రితమే ఇక్కడ జాయిన్ అయ్యాను. సాక్షర భారత్ కో ఆర్డినేటర్లకు వేతనాలు అందని మాట వాస్తవమే. సర్వే వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయకుండా వేతనాలు ఆగాయా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? తెలుసుకున్న తర్వాత వివరాలు చెబుతా. వేతనాల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఈ నెలాఖరులోగానీ, వచ్చే నెల మొదటివారంలోగానీ వేతనాలు అందుతాయి. - సత్యనారాయణ, వయోజన విద్యాసంచాలకులు ఆసక్తి చూపడం లేదు.. కేంద్రాలకు వచ్చేందుకు అభ్యాసకులు అసక్తి చూపడం లేదు. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో పనికి పోయి వచ్చి అక్షరాలు దిద్దే ఓపిక లేదని చెబుతున్నారు. గ్రామ కో ఆర్డినేటర్లకు వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడంతో పని చేయడానికి ఆసక్తి చూపడం లేదు. - అంబటి శ్రీకాంత్ , మండల కో ఆర్డినేటర్, చందుర్తి