Coach harendra Singh
-
ఇదేం నజరానా?
ప్రపంచ కప్ గెలిపించిన కోచ్‌కు రూ.25 వేలా! న్యూఢిల్లీ: ప్రపంచకప్ గెలిపించిన చీఫ్ కోచ్‌కు రూ. 25 వేలు, ఆటగాడికి రూ. 10 వేలు... ఇదేం నజరానానో అంతుచిక్కడం లేదు. కానీ ఎయిరిండియా మాత్రం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు... అన్న చందంగా ఘనంగా ప్రకటించింది. భారత్ ఆతిథ్యమిచ్చిన జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంస్థ ఉద్యోగులైన చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్‌కు రూ.25 వేలు, స్ట్రయికర్ అర్మాన్ ఖురేషీకి రూ. 10 ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు ఎయిరిండియా చైర్మన్ అశ్వని లోహని ప్రకటించారు. ఇంత తక్కువ మొత్తాన్ని అదో గొప్ప విషయమన్నట్టు ఆయన చెప్పుకోవడం విస్మయానికి గురిచేసింది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణించిన యువ క్రికెటర్ జయంత్ యాదవ్‌ను గురువారం జరిగిన కార్యక్రమంలో సత్కరించారు. ఇతని తండ్రి ఎయిరిండియా ఉద్యోగి కావడంతో సన్మానించారు. -
భారత్‌కు అసలు పరీక్ష!
లక్నో: లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ అదే జోరును నాకౌట్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. సొంతగడ్డపై జరుగుతున్న జూనియర్ పురుషుల హాకీ ప్రపంచకప్‌లో గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో కెనడాపై 4–0తో, ఇంగ్లండ్‌పై 5–3తో నెగ్గిన భారత్‌కు మూడో లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నుంచి గట్టిపోటీ ఎదురైంది. చివరకు 2–1తో గట్టెక్కిన భారత్ నాకౌట్ మ్యాచ్‌ను మాత్రం తేలిగ్గా తీసుకోవడంలేదు. ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రయోగాలు చేయకుండా ప్రణాళిక ప్రకారం ఆడతామని భారత కోచ్ హరేంద్ర సింగ్ తెలిపారు. ‘దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో తొలి 15 నిమిషాల్లో మా ఆటగాళ్లు స్థాయికి తగ్గట్టు ఆడలేదు. ప్రత్యర్థి జట్టు గురించి ఎక్కువ ఆలోచించకుండా సహజశైలిలో ఆడటం మంచి ఫలితాలు ఇస్తుందని నేను నమ్ముతాను’ అని హరేంద్ర చెప్పారు.