coal minister
-
విధాన స్థిరత్వం, పారదర్శకత బాటన భారత్
న్యూఢిల్లీ: దేశంలో పెట్టుబడులను పురోభివృద్దికి పాలసీ స్థిరత్వం, పారదర్శకత, చక్కటి సంప్రదింపుల ప్రక్రియ బాటను అందిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పేర్కొన్నారు. దేశంలో ఇంధన వనరుల రంగంలో అవకాశాలు అపారమన్న ఆమె, ఈ అవకాశాలను అందిపుచ్చుకోడానికి పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు అమ్మకానికి సంబంధించి ఆరవ విడత గనుల వేలం పక్రియ ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘ఈ అమృత్ కాలం (భారత్ స్వాతంత్రం సముపార్జించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా) సమయంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సమయంలో భారతదేశానికి అన్ని ప్రాథమిక ఖనిజాలు అవసరం. ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలు అపారం’ అని ఆర్థికమంత్రి ఈ సందర్బంగా పేర్కొన్నారు. పెట్టుబడులకు తగిన దేశం భారత్ అని మోర్గాన్ స్టాన్లీ చేసిన వ్యాఖ్యను ఆర్థికమంత్రి ప్రస్తావించారు. బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ వాణిజ్య గనుల ఆరవ విడత వేలంలో 141 బొగ్గు, లిగ్నైట్ గనులను విక్రయించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 67 బొగ్గు గనులను కమర్షియల్ మైనింగ్ కింద అమ్మకానికి ఉంచినట్లు కూడా తెలిపారు. ప్రపంచంలో పలు దేశాలు మందగమనం ముందు నుంచొన్న సమయంలో భారత్ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని తెలిపారు. ఆరవ విడత బొగ్గు గనుల వేలం పక్రియను ప్రారంభిస్తున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ -
బొగ్గు ఉత్పత్తి పెంచండి
కోల్ ఇండియాకు కేంద్ర మంత్రి గోయల్ ఆదేశం న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తిని పెంచేందుకు వీలుగా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయల్ కోల్ ఇండియా లిమిటెడ్ను ఆదేశించారు. ‘బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తవ్వకాలు జరుపుతున్న గనుల నుంచి మరింత బొగ్గును వెలికితీసేందుకు అనుమతించాల్సిందిగా పర్యావరణ, అటవీ శాఖను కోరాం. విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా పెరిగే విధంగా ఈ-వేలంలో బొగ్గు పరిమాణాన్ని తగ్గించాలని ఆదేశించాం..’ అని ఆయన శుక్రవారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని విద్యుదుత్పత్తి కంపెనీలన్నిటికీ సరఫరా చేసేందుకు బొగ్గు ఉత్పత్తిని 50-60 శాతం పెంచాలని కోల్ ఇండియాను కోరినట్లు చెప్పారు. దేశంలో విద్యుత్ కొరతకు పరిష్కారాలను కనుగొనేందుకు ప్రైవేట్ విద్యుత్ దిగ్గజాలు అనిల్ అంబానీ (రిలయన్స్ పవర్), గౌతమ్ ఆదానీ (ఆదానీ గ్రూప్), వినీత్ మిట్టల్ (వెల్స్పన్ ఎనర్జీ), నవీన్ జిందాల్ (జిందాల్ పవర్) తదితరులతో గోయల్ సమావేశం నిర్వహించారు.