ఉపాధ్యాయుడిని బలిగొన్న కొబ్బరిచెట్టు
ఆచంట: కొబ్బరి చెట్టు విరిగి మీద పడడంతో ఓ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన కోలా శ్రీనివాసరావు (45) కొవ్వూరు మండలం దొమ్మేరులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సంక్రాంతి పండగను జరుపుకొనేందుకు కుటుంబసభ్యులతో కలసి స్వగ్రామం ఆచంట వచ్చారు.
సోమవారం మధ్యాహ్నం స్థానిక కచేరీ సెంటర్కు మోటార్ బైక్పై వచ్చి వెళుతుండగా గ్రామచావిడిలోని కొబ్బరిచెట్టు అకస్మాత్తుగా విరిగి ఆయనపై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసరావు మృతితో ఆచంటలో విషాద ఛాయలు అలముకున్నాయి.