ఆగస్టు 15 నుంచి కోల్కతాకి మరో విమానం
గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో కోల్కతాకు మరో విమాన సర్వీసు వాలబోతోంది. ఇండిగో విమాన సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి సర్వీసులకు ముహూర్తం నిర్ణయించింది. ఇప్పటికే ఈ విమాన సంస్థ్ధ విశాఖ నుంచి భువనేశ్వర్ మీదుగా కోల్కతాకు సర్వీసులు అందిస్తోంది.
కొత్త సర్వీసు షెడ్యూలు ఇదీ...
కోల్కతాలో ఉదయం 10.30కు బయలుదేరి విశాఖకు మధ్యాహ్నం 12.25కు చేరుతుంది. ఇక్కడ 12.55కు బయలుదేరి మధ్యాహ్నం 3గంటలకు కోల్కతా చేరుకుంటుంది.