collectatarate
-
కలెక్టర్ సారు.. వచ్చేశారు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అస్వస్థతతో నవంబర్ 29 నుంచి సెలవుల్లో ఉన్న కలెక్టర్ ఎం.వీరబ్రహ్మ య్య శనివారం తిరిగి విధుల్లో చేరారు. ఇన్చార్జి కలెక్టర్‌గా ఉన్న జేసీ సర్ఫరాజ్ అహ్మద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ విజయనగరంలో కుటుంబసభ్యులతో ఉన్న వీరబ్రహ్మయ్య శనివా రం హైదరాబాద్‌లో వైద్యపరీక్షల అనంతరం సతీమణి విజయలక్ష్మితో కలిసి కరీంనగర్ చేరుకున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయ న ఉత్సాహంగా కనిపించారు. ఆయన కు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలి పారు. అరగం ట పాటు ఆయన చాంబర్ లో కూర్చున్న కలెక్టర్ క్యాంపు ఆఫీసుకు వెళ్లిపోయారు. కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డెప్యుటీ కలెక్టర్‌గా జిల్లాకు బదిలీ అయిన ఆయ న సతీమణి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. కలెక్టర్‌కు అదనపు జేసీ ఎ.మనోహర్, జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు, డ్వామా పీడీ మనోహర్, డీపీఆర్వో పి.శ్రీనివాస్, డీఎస్వో చంద్రప్రకాశ్, ఎల్డీఎం చౌదరి, డీపీవో కుమారస్వామి, రిజిస్ట్రార్ వెంకటరమణ, డీటీసీ మీరా ప్రసాద్, కార్పొరేషన్ కమిషనర్ రమేశ్, ఆర్వీఎం పీవో శ్యాంప్రసాద్‌లాల్, హౌసింగ్ పీడీ పి.నర్సింహరావు, కలెక్టరేట్ ఏవో రాజాగౌడ్, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు స్వాగతం పలికారు. ఎల్ఎండీలో.. తిమ్మాపూర్ : ఎల్ఎండీలో అధికారులు, నాయకులు కలెక్టర్‌కు స్వాగతం పలికా రు. కలెక్టర్ దంపతులు ఎల్ఎండీ అతిథి గృహానికి చేరుకుని కార్యాలయ సవ యం వరకు ఉన్నారు. అధికారులు వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్, ఏపీఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తీకేయ మిశ్రా, డీఆర్వో కృష్ణారెడ్డి, ఆర్డీవో చంద్రశేఖర్, ట్రాన్స్‌కో ఎస్ఈ నారాయణ, ఎస్సారెస్పీ జీవీసీ-4 ఎస్ఈ భగవంతరావు, ఈఈ కరుణాకర్, ట్రాన్స్‌కో ఏడీ నాగేశ్వర్రావు, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్‌స్వామి, కేడీసీసీబీ డెరైక్టర్ దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల సేవా ట్రస్టు చైర్మన్ ఏకానందం, సర్పంచ్ మాతంగి స్వరూప లక్ష్మణ్ కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. -
ఇక ఈ-గ్రీవెన్స్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యల పరిష్కారం.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన నిరుపేదలకు అందేవిధంగా కలెక్టర్ అహ్మద్‌బాబు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో తీసుకునే అర్జీలకు పరిష్కారం చూపడానికి మార్పులు తీసుకొచ్చారు. ఆరు నెలలు శ్రమించి గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను రూపొందించారు. ఈ పద్ధతిని జనవరి 1 నుంచి అంటే బుధవారం నుంచి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో శాఖలవారీగా 12 కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ ఫిర్యాదులను వెబ్సైట్లో పొందుపరుస్తారు. 30 రోజుల్లో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. మండల స్థాయిలోనూ ఇదే విధమైన సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. ఇంతకాలం పరిష్కారానికి నోచుకోని ప్రజావాణి దరఖాస్తులు ఇప్పుడు వెబ్‌సైట్‌తో పరిష్కారమవుతాయని కలెక్టర్ భావిస్తున్నారు. నూతన విధానం ఇలా.. జీఎంఎస్‌పై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించారు. అర్జీదారు నేరుగా కలెక్టరేట్‌లోగాని, మండల కేంద్రంలోగాని వివరాలు నమోదు చేసుకోవాలి. పేరు, చిరునామా, ఏ సమస్య, రేషన్ కార్డు, ఆధార్ నంబరు, ఫోన్ నంబర్‌ను తప్పని సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలకు రేషన్, ఆధార్, ఇతర వాటిని స్కాన్‌చేసి అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తారు. నమోదు చేసినవెంటనే సంబంధిత అధికారికి, అర్జీదారునికి ఫోన్ ద్వారా సమాచారం వెళ్తుంది. దీని కోసం ఒక ఎస్ఎంఎస్కు 13 పైసల చొప్పున(వెయ్యి ఎస్ఎంఎస్లకు రూ.130) ఖర్చు చేస్తున్నారు. చెప్పిన వివరాలు దరఖాస్తు రూపంలో వచ్చే కాపీని అర్జీదారుడికి అందజేస్తారు. సరైన సమయంలో సంబంధిత అధికారి సమస్యను పరిష్కరించని యెడల, ఆర్డీవోకు, ఆయన స్పందించకపోతే జేసీకి, జేసీ స్పందించకపోతే కలెక్టర్ వద్దకు సమస్య వెళ్లే విధంగా రూపొందించారు. ఈ పద్ధతిని కలెక్టర్ మానిటరింగ్ చేస్తున్నారు. అమలుకు ఆటంకాలు గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను బుధవారం నుంచి అమలుకానుంది. మొదటగా కలెక్టరేట్, ఐటీడీఏ, సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవారీగా అమలు చేయాలని అధికారులు భావించారు. అనంతరం మున్సిపల్, మండలాల్లో అమలు చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, సెక్షన్లవారీగా వివరాలు, సబ్జెక్టు, సబ్‌సబ్జెక్టు, కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు పేరు, హోదా, సెల్ నంబరు కంప్యూటర్లో పొందుపర్చాలి. ఆయా శాఖల అధికారులు ఈ వివరాలను జీఎంఎస్‌లో అప్లోడ్ చేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ వివరాలను కంప్యూటర్లో అప్లోడ్ చేస్తేనే సమస్య పరిష్కరించే సదరు అధికారికి గ్రీవెన్స్‌కు వచ్చిన సమస్య సమాచారం వెళ్తుంది. ప్రధానంగా సుమరు 85 ప్రభుత్వ శాఖల వివరాలను నమోదు చేయల్సి ఉంది. ప్రస్తుతం మాస్టర్ ఎంట్రీ, సీట్ ఎంట్రీ, ఎంప్లాయి డాటా, సెక్షన్ల వారీగా సబ్జెక్టు వివరాలు కంప్యూటర్లో పొందుపరుస్తున్నారు.