కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అస్వస్థతతో నవంబర్ 29 నుంచి సెలవుల్లో ఉన్న కలెక్టర్ ఎం.వీరబ్రహ్మ య్య శనివారం తిరిగి విధుల్లో చేరారు. ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్న జేసీ సర్ఫరాజ్ అహ్మద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఇన్నాళ్లూ విజయనగరంలో కుటుంబసభ్యులతో ఉన్న వీరబ్రహ్మయ్య శనివా రం హైదరాబాద్‌లో వైద్యపరీక్షల అనంతరం సతీమణి విజయలక్ష్మితో కలిసి కరీంనగర్ చేరుకున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయ న ఉత్సాహంగా కనిపించారు. ఆయన కు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలి పారు.
అరగం ట పాటు ఆయన చాంబర్ లో కూర్చున్న కలెక్టర్ క్యాంపు ఆఫీసుకు వెళ్లిపోయారు. కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డెప్యుటీ కలెక్టర్‌గా జిల్లాకు బదిలీ అయిన ఆయ న సతీమణి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. కలెక్టర్‌కు అదనపు జేసీ ఎ.మనోహర్, జెడ్పీ సీఈవో చక్రధర్‌రావు, డ్వామా పీడీ మనోహర్, డీపీఆర్‌వో పి.శ్రీనివాస్, డీఎస్‌వో చంద్రప్రకాశ్, ఎల్‌డీఎం చౌదరి, డీపీవో కుమారస్వామి, రిజిస్ట్రార్ వెంకటరమణ, డీటీసీ మీరా ప్రసాద్, కార్పొరేషన్ కమిషనర్ రమేశ్, ఆర్వీఎం పీవో శ్యాంప్రసాద్‌లాల్, హౌసింగ్ పీడీ పి.నర్సింహరావు, కలెక్టరేట్ ఏవో రాజాగౌడ్, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు స్వాగతం పలికారు.
ఎల్‌ఎండీలో..
తిమ్మాపూర్ : ఎల్‌ఎండీలో అధికారులు, నాయకులు కలెక్టర్‌కు స్వాగతం పలికా రు. కలెక్టర్ దంపతులు ఎల్‌ఎండీ అతిథి గృహానికి చేరుకుని కార్యాలయ సవ యం వరకు ఉన్నారు. అధికారులు వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్, ఏపీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కార్తీకేయ మిశ్రా, డీఆర్‌వో కృష్ణారెడ్డి, ఆర్డీవో చంద్రశేఖర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ నారాయణ, ఎస్సారెస్పీ జీవీసీ-4 ఎస్‌ఈ భగవంతరావు, ఈఈ కరుణాకర్, ట్రాన్స్‌కో ఏడీ నాగేశ్వర్‌రావు, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కిషన్‌స్వామి, కేడీసీసీబీ డెరైక్టర్ దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల సేవా ట్రస్టు చైర్మన్ ఏకానందం, సర్పంచ్ మాతంగి స్వరూప లక్ష్మణ్ కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.
కలెక్టర్ సారు.. వచ్చేశారు
Published Sun, Jan 19 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement