అన్ని కార్యాలయాల్లో ఈ–ఆఫీస్, బయోమెట్రిక్
కలెక్టర్ భాస్కర్
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్, బయోమెట్రిక్ విధానాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు. శనివారం ఈ–ఆఫీస్, బయోమెట్రిక్, క్లీన్ అండ్ గ్రీన్, మే ఐహెల్ప్యు కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ–ఆఫీస్ విధానం ద్వారా అవినీతిరహితమైన పారదర్శక పాలన సాధ్యమవుతుందన్నారు. ప్రజలకు జవాబుదారీతనంలో సేవలు అందించాల్సిన బాద్యత ప్రతి ఉద్యోగిపై ఉందన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కింద కార్యాలయ ఆవరణలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మే ఐ హెల్ప్ యూ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్వో కె.కోటేశ్వరి, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, ప్రసాదరావు పాల్గొన్నారు