collectors review
-
మీరు మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదు: సీఎం జగన్
-
ముంపు ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ పరిహారం.. అందలేదన్న మాట రాకూడదు
సాక్షి, అమరావతి: వరదలతో ముంపునకు గురైన ప్రతి ఇంటికీ పరిహారం అందాలని, ఎవ్వరికీ పరిహారం అందలేదన్న మాట రాకూడదని సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. వరద బాధితులపట్ల ఉదారంగా ఉండటంతోపాటు మానవతా దృక్పథాన్ని చూపించాలని ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల్లో సహాయ కార్యక్రమాలపై సోమవారం సచివాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులను ఆదుకోవడంపై సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఆయనేమన్నారంటే.. గ్రామ, వార్డులు యూనిట్‌గా సాయం ‘వరద బాధితులకు 25 కేజీల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ బంగాళదుంపలు ఇవ్వాలి. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకోవాలి. వలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికీ సహాయం అందాలి. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి ఎక్కడా లోటు రానీయకుండా మంచి సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట వినిపించాలి. అలాగే, ఈ శిబిరాల నుంచి వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలి. విద్యుత్, రక్షిత తాగునీటి పునరుద్ధరణ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి. విద్యుత్ పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదు. సరిపడా సిబ్బందిని తరలించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. 104కు వచ్చే సమస్యలపై వెంటనే స్పందించండి 104 కాల్ సెంటర్ గురించి ఇప్పటికే ప్రజలందరికీ తెలుసు. వరదలకు సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా.. ఈ నంబర్‌కు సమాచారం ఇవ్వమని చెప్పండి. ఈ నంబర్‌కు ఎలాంటి సమాచారం వచ్చినా అధికారులు స్పందించి బాధితులకు తోడుగా ఉండాలి. జిల్లాల్లో ‘104’కు ప్రత్యేక అధికారిని నియమించాలి. మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షలు నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబానికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలి. విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి మిగిలిన వారిలో ధైర్యం నింపడానికే ఈ చర్యలు తీసుకుంటున్నాం. అలాగే, మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలి. పంట నష్టం ఎన్యూమరేషన్ మొదలుపెట్టాలి పంటల నష్టం ఎన్యూమరేషన్ వెంటనే మొదలు పెట్టాలి. రైతులకు 80శాతం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలి. అంతేకాక.. మరణించిన పశువుల కళేబరాలవల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పశువుల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టాలి. పశువులకు దాణా కూడా అందించమని ఆదేశాలు జారీచేశాం. ఇందుకు చర్యలు తీసుకోవాలి. పశువులు మరణిస్తే నష్టపరిహారం ఇవ్వాలి. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి చెరువులు, ఇతర జలాశయాలు, కట్టల మీద దృష్టి పెట్టాలి. ఈ విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాతంలో మళ్లీ వస్తున్న అల్పపీడనం తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నట్లు చెబుతున్నారు. అయినా మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.40 కోట్లను వెంటనే ఇస్తున్నాం. ఇక వరదలతో గండ్లు పడ్డ చెరువుల్లో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలి.’ ఈ సమీక్షలో హోంమంత్రి సుచరిత, జలవనరులశాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ కె.కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారికి రూ.95 వేలు ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా.. బాధితులకు వెంటనే నగదు ఇవ్వాలి. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ.95,100 నగదు ఇచ్చి వీరికి కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయాలి. అలాగే, ఇల్లు నిర్మించుకునేందుకు వీరికి రూ.1,80,000 కూడా ఇవ్వాలి. దీనివల్ల వారు వెంటనే ఇంటి పనులు మొదలుపెట్టగలుగుతారు. అలాగే, పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ.5,200ల నగదు వెంటనే అందించాలి. రోడ్ల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్యం, వైద్య శిబిరాల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ముందు తాత్కాలిక పనులు వెంటనే పూర్తిచేయాలి. శాశ్వతంగా చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాలి. ఇప్పుడు వచ్చిన వరదను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు డిజైన్లు రూపొందించి శాశ్వత పనులు చేపట్టాలి. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లు ఖరారుచేసి పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. -
Cyclone Gulab: మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం
-
వారానికి రెండుసార్లు సచివాలయాలను సందర్శిస్తా: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: కరోనా తగ్గుముఖం పట్టగానే వారానికి రెండు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రేపటి నుంచి అధికారులు చురుగ్గా గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారనే మాట రావాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మరో 200 సేవలను అదనంగా ప్రజలకు అందించబోతున్నామని, మొత్తంగా వీటిద్వారా 740 సేవలు అందుతాయన్నారు. మంగళవారం ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వారానికి రెండుసార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శిస్తానని తెలిపారు. అదే సమయంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమంపై దృష్టి పెట్టాలని, అర్హులైన వారికి 90 రోజుల్లోగా ఇంటి పట్టాలు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 104 కాల్ సెంటర్.. వన్ స్టాప్ సొల్యూషన్ కావాలని, థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సెకండ్ డోస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. -
మీరే కీలకం
బంగారు తెలంగాణ సాధనకు సిద్ధం కండి ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయండి వచ్చే నెల 3 నుంచి 10 వరకు ‘హరిత’ వారోత్సవాలు జిల్లాలో 3.60 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం ప్రతి గ్రామంలో హరిత కమిటీలు ఏర్పాటు చేయాలి రీ-సైక్లింగ్ ‘రైసుమిల్లర్ల’పై క్రిమినల్ కేసులు ప్రతి నియోజకవర్గంలో మొదటగా 500 ఇండ్లు ‘పుష్కరాల’కు రూ.50 లక్షల అత్యవసర నిధి ప్రజాప్రతినిధులను కలుపుకొని నడవండి కలెక్టర్, ఎస్పీ, అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ నిజామాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణ మే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులే కీలకంగా వ్యవహరించాలని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, ప్రజ ల్ని భాగస్వాములను చేయాలని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృతప్రచారం నిర్వహించి ప్రజలకు అందే లా చూడాల్సిన బాధ్యత కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారుల పైనే ఉందని పేర్కొన్నారు. హరితహారం అమలులో నిజామాబాద్ జిల్లా ముందడుగులో ఉం దని ప్రశంసించిన సీఎం, అన్ని కార్యక్రమాల అమలు, అన్ని జిల్లాల్లో ఇదే సూచిక ఉండాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ శిక్షణ కేంద్రంలో కలెక్టర్లు, ఎస్పీలు, గృహనిర్మాణ సంస్థ పీడీలు, అటవీ, పౌరసరఫరాలశాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ఆయన సమీక్షించారు. 3.60 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం హరితహారం పథకం అమలులో కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సహా ఇతర అధికారులను అభినందించిన సీఎం కేసీఆర్ జిల్లాలో 3.60 కోట్ల మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంకు 40 వేల చొప్పున మొత్తం 3.60 కోట్ల మొక్కల నాటాలన్నారు. ఇందుకోసం వచ్చే నెల 3 నుంచి 10 వరకు ‘హరిత వారోత్సవాలు’ అత్యంత ఘనంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆ వారం రోజులు పల్లె నుంచి పట్నం వరకు ఫ్లెక్సీలు, బ్యానర్లు, స్టిక్కర్లతో విస్తృతంగా ప్రచారం నిర్వ హించాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయం, వాహనాలకు బ్యానర్లు, స్టిక్కర్లు అంటించాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. వీఆర్వోలు, వీఏఓలు, ఏఎన్ఎం తదితర గ్రామస్థాయి అధికారులతో ‘గ్రామ హరిత కమిటీ’లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పల్లెపల్లెను కలిపే రహదారుల చుట్టూ మొక్కలు నాటాలని, ఇందుకోసం ఈ నెలాఖరులోగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారని అధికారులు తెలిపారు. హరితహారం పథకాన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని కూడా ఆదేశించారన్నారు. హరితహారంలో అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వ్యామం ఉండేలా చూడాలని అన్నారు. నియోజకవర్గానికి 500 డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వం ప్రకటించిన విధంగా త్వరలోనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధమైందని,జిల్లాలవారీగా అర్హుల జాబి తాను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఇండ్లను మొదటి విడతగా నిర్మించనున్నామన్నారు.ప్రతి నియోజకవర్గా నికి 500 చొప్పున జిల్లాలో 4500 మంది అర్హుల జాబితా తయూరు చేయాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. డబ్బులు దుర్వినియోగం కా కుండా, ఎక్కువ ఖర్చు కాకుండా ఉండేందుకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం బాధ్యతలను టెండర్ల ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించనున్నట్లు చెప్పారన్నారు. పేదోళ్ల బియ్యంతో రీ -సైక్లింగ్ బియ్యం ద ందాకు పాల్పడే రైసుమిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే మిల్లులు సీజ్ చేసి క్రిమినల్ పెట్టాలని ఆదేశించారు. బినామీ డీలర్లు, బ్లాక్‌దందాకు పాల్పడే డీలర్లపై కూడ పీడీయాక్టు కింద కేసులు పెట్టాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. రైసుమిల్లర్ల ఆగడాలు, పేకాటరాయుళ్లపై ఎస్పీలు దృష్టి సారించాలని సీఎం సూచించారు. మహా రాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున గోదావరిలో ఇప్పటికి నీరు వచ్చి చేరుతోందని, పుష్కారాలను అత్యంత వైభవంగా చేపట్టాలన్నారు. జిల్లాలోని కందకుర్తికి వీఐపీల తాకిడి ఉండనుందని, ఇప్పటి నుంచే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గోదావరి పుష్కరాల కోసం జిల్లాకు అత్యవసరం నిధి కింద రూ.50 లక్షలు కలెక్టర్‌కు కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ చైతన్య కుమార్, సీసీఎఫ్ ఎస్.కె.జోషి, డీఎఫ్ఓలు నాగేశ్వర్రావు, వేణుబాబు, అటవిశాఖ, పౌరసరఫరాలశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.