బంగారు తెలంగాణ సాధనకు సిద్ధం కండి
ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయండి
వచ్చే నెల 3 నుంచి 10 వరకు ‘హరిత’ వారోత్సవాలు
జిల్లాలో 3.60 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
ప్రతి గ్రామంలో హరిత కమిటీలు ఏర్పాటు చేయాలి
రీ-సైక్లింగ్ ‘రైసుమిల్లర్ల’పై క్రిమినల్ కేసులు
ప్రతి నియోజకవర్గంలో మొదటగా 500 ఇండ్లు
‘పుష్కరాల’కు రూ.50 లక్షల అత్యవసర నిధి
ప్రజాప్రతినిధులను కలుపుకొని నడవండి
కలెక్టర్, ఎస్‌పీ, అధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్
నిజామాబాద్: బంగారు తెలంగాణ నిర్మాణ మే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులే కీలకంగా వ్యవహరించాలని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, ప్రజ ల్ని భాగస్వాములను చేయాలని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృతప్రచారం నిర్వహించి ప్రజలకు అందే లా చూడాల్సిన బాధ్యత కలెక్టర్, ఎస్‌పీ, ఉన్నతాధికారుల పైనే ఉందని పేర్కొన్నారు.
హరితహారం అమలులో నిజామాబాద్ జిల్లా ముందడుగులో ఉం దని ప్రశంసించిన సీఎం, అన్ని కార్యక్రమాల అమలు, అన్ని జిల్లాల్లో ఇదే సూచిక ఉండాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ శిక్షణ కేంద్రంలో కలెక్టర్లు, ఎస్‌పీలు, గృహనిర్మాణ సంస్థ పీడీలు, అటవీ, పౌరసరఫరాలశాఖల ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ఆయన సమీక్షించారు.
3.60 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం
హరితహారం పథకం అమలులో కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సహా ఇతర అధికారులను అభినందించిన సీఎం కేసీఆర్ జిల్లాలో 3.60 కోట్ల మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంకు 40 వేల చొప్పున మొత్తం 3.60 కోట్ల మొక్కల నాటాలన్నారు. ఇందుకోసం వచ్చే నెల 3 నుంచి 10 వరకు ‘హరిత వారోత్సవాలు’ అత్యంత ఘనంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆ వారం రోజులు పల్లె నుంచి పట్నం వరకు ఫ్లెక్సీలు, బ్యానర్లు, స్టిక్కర్లతో విస్తృతంగా ప్రచారం నిర్వ హించాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయం, వాహనాలకు బ్యానర్లు, స్టిక్కర్లు అంటించాలని సూచించినట్లు అధికారులు తెలిపారు.
వీఆర్‌వోలు, వీఏఓలు, ఏఎన్‌ఎం తదితర గ్రామస్థాయి అధికారులతో ‘గ్రామ హరిత కమిటీ’లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పల్లెపల్లెను కలిపే రహదారుల చుట్టూ మొక్కలు నాటాలని, ఇందుకోసం ఈ నెలాఖరులోగా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారని అధికారులు తెలిపారు. హరితహారం పథకాన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని కూడా ఆదేశించారన్నారు. హరితహారంలో అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వ్యామం ఉండేలా చూడాలని అన్నారు.
నియోజకవర్గానికి 500 డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు
ప్రభుత్వం ప్రకటించిన విధంగా త్వరలోనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను నిర్మించేందుకు కార్యాచరణ సిద్ధమైందని,జిల్లాలవారీగా అర్హుల జాబి తాను సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ జిల్లా ఉన్నతాధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఇండ్లను మొదటి విడతగా నిర్మించనున్నామన్నారు.ప్రతి నియోజకవర్గా నికి 500 చొప్పున జిల్లాలో 4500 మంది అర్హుల జాబితా తయూరు చేయాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. డబ్బులు దుర్వినియోగం కా కుండా, ఎక్కువ ఖర్చు కాకుండా ఉండేందుకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం బాధ్యతలను టెండర్ల ప్రక్రియ ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించనున్నట్లు చెప్పారన్నారు.
పేదోళ్ల బియ్యంతో రీ -సైక్లింగ్ బియ్యం ద ందాకు పాల్పడే రైసుమిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే మిల్లులు సీజ్ చేసి క్రిమినల్ పెట్టాలని ఆదేశించారు. బినామీ డీలర్లు, బ్లాక్‌దందాకు పాల్పడే డీలర్లపై కూడ పీడీయాక్టు కింద కేసులు పెట్టాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. రైసుమిల్లర్ల ఆగడాలు, పేకాటరాయుళ్లపై ఎస్పీలు దృష్టి సారించాలని సీఎం సూచించారు. మహా రాష్ట్రలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున గోదావరిలో ఇప్పటికి నీరు వచ్చి చేరుతోందని, పుష్కారాలను అత్యంత వైభవంగా చేపట్టాలన్నారు. జిల్లాలోని కందకుర్తికి వీఐపీల తాకిడి ఉండనుందని, ఇప్పటి నుంచే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. గోదావరి పుష్కరాల కోసం జిల్లాకు అత్యవసరం నిధి కింద రూ.50 లక్షలు కలెక్టర్‌కు కేటాయించనున్నట్లు సీఎం ప్రకటించారు. సమావేశంలో కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ చైతన్య కుమార్, సీసీఎఫ్ ఎస్.కె.జోషి, డీఎఫ్‌ఓలు నాగేశ్వర్‌రావు, వేణుబాబు, అటవిశాఖ, పౌరసరఫరాలశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.