College professor
-
విజిటింగ్ ప్రొఫెసర్‌గా ‘అలీబాబా’ జాక్ మా
టోక్యో: చైనా ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా కాలేజీ ప్రొఫెసర్‌గా మారనున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన పరిశోధన సంస్థ టోక్యో కాలేజీలో విజిటింగ్ ప్రొఫెసర్ కానున్నారు. సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తి అంశంపై ఆయన పరిశోధనలు చేస్తారని వర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంట్రప్రెన్యూర్షిప్, కార్పొరేట్ మేనేజ్మెంట్ తదితర రంగాల్లో తన అనుభవాన్ని విద్యార్థులు, అధ్యాపకులతో జాక్ మా పంచుకుంటారని తెలిపింది. 1990ల్లో ఈ– కామర్స్ సంస్థ అలీబాబాను స్థాపించిన జాక్ మా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. -
Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు?
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి ఇంటిపై జరిగిన ఐటీ సోదాలకు సంబంధించి ఆ శాఖ అధికారులు మంగళవారం రెండోరోజు కూడా విచారణ కొనసాగించారు. మల్లారెడ్డి ఆడిటర్‌తోపాటు, కాలేజీల ప్రిన్సిపాళ్లు, అకౌంటెంట్లను అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు. వైద్య, ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునే సమయంలో ఫీజులు, డొనేషన్లను ఏ రూపంలో తీసుకుంటున్నారు? ఎంత తీసుకుంటున్నారు? ఎన్నిరకాల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ అధికారులు వారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సోదాల్లో లభించిన కీలక పత్రాలు, పెట్టుబడులకు సంబంధించిన ఆధారాల ఆధారంగా ఆడిటర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కళాశాలలకు మొత్తం ఎన్ని ఖాతాలున్నాయని, ఏ కళాశాలకు ఏయే బ్యాంకుల్లో ఖాతా లున్నాయని కూడా ప్రశ్నించారు. డొనేషన్ల రూపంలో వసూలు చేసిన వందకోట్ల నిధులను ఎక్కడ డిపాజిట్ చేశారన్న దానిపైనా ప్రశ్నించినట్లు తెలిసింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు కట్టించుకుని తక్కువ ఫీజుకు రశీదులు ఇస్తున్నట్లు అధికారుల దృష్టికి వచి్చన నేపథ్యంలో దానిపైనా ఆరా తీశారు. చదవండి: తెలంగాణలో జ్యోతిష్యం ప్రకారం ఎన్నికలు: సుప్రీం వ్యాఖ్య -
అమ్మకు జరిగిన మోసం.. మరెవరికి జరగకూడదని..
సాక్షి, హనుమకొండ: సైబర్ క్రైమ్.. కూర్చున్న చోటునుంచే మన డబ్బులను సైబర్ నేరగాళ్లు కొల్ల గొడుతున్నారు. 24 గంటల్లో పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే పోయిన 100శాతం డబ్బులు తిరిగివచ్చే ఆస్కారముంది. ఏమాత్రం ఆలస్యం చేసినా నగదును మనం మర్చిపోవాల్సిందే. బాధితులు కూర్చున్నచోటునుంచే సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసేలా వరంగల్‌కు చెందిన యువకుడు, లా స్టూడెంట్ డి.రాహుల్ శశాంక్ రూపొందించిన ‘సైబర్ అలర్ట్’ యాప్ ఎంతో మందికి బాసటగా నిలవనుంది. ఇది అందుబాటులోకి తెచ్చిన నాలుగురోజుల వ్యవధిలో రెండు ఫిర్యాదుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగింది. అమ్మకు ఎదురైన అనుభవం.. వరంగల్‌లోని ఓ కాలేజీలో ఫ్రొఫెసర్‌గా పనిచేస్తున్న రాహుల్ శశాంక్ తల్లి సెల్‌ఫోన్‌కు ఏడబ్ల్యూఎస్ నుంచి లింక్‌తో కూడిన ఓ మెసేజ్ వచ్చింది. అది వైరస్ లింక్ అని తెలియని ఆమె తెరవడంతో ఆటోమేటిక్‌గా తన బ్యాంక్ ఖాతాలోని రూ.10వేలు డెబిట్ అయ్యాయి. ఈ సంక్షిప్త సమాచారం చూసుకున్న ఆమె ఆ సమయంలో ఎక్కడా ఫిర్యాదు చేయాలో తెలియక తికమకపడి ఆలస్యమైంది. ఆ తర్వాత సైబర్‌క్రైమ్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ శశాంక్ తన అమ్మలాగా మిగతావారు మోసపోవద్దని భావించాడు. అప్పటికే సైబర్ నేరాలపై వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలు చదవడంతో పాటు ఆ రంగంలో అవగాహన ఉన్న న్యాయవాదులతో చర్చించాడు. ఇంటర్నెట్ ద్వారా కూడా సమగ్ర సమాచారం సేకరించి పట్టు పెంచుకున్న రాహుల్ శశాంక్ ‘సైబర్ అలర్ట్’ యాప్ కోసం రెండు నెలలపాటు శ్రమటోడ్చాడు. నాలుగురోజుల క్రితమే అధికారికంగా యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. సైబర్ అలర్ట్ అని టైప్ చేయగానే కనిపించే ఈ యాప్‌ను మొబైల్లో నిక్షిప్తం చేసుకోవచ్చు. ఎలా ఉపయోగపడుతుందంటే సైబర్ అలర్ట్ యాప్‌లోకి వెళ్లగానే సైబర్ ఈ–కంప్లయింట్, సైబర్ ట్రాకింగ్, స్టేటస్, సైబర్ పోలీసు స్టేషన్లు, సైబర్ లీగల్ ఎయిడ్, సైబర్ మెటీరియల్స్ సైబర్ ఇంటర్న్షిప్స్ అనే ఫీచర్లు కనిపిస్తాయి. ► సైబర్ ఈ–కంప్లయింట్ ఫీచర్లోకి వెళ్లి మీరు ఎక్కడి నుంచైనా సైబర్ నేరానికి సంబంధించిన ఫిర్యాదును టైప్ చేస్తే ఆటోమెటిక్‌గా అది సమీప ప్రాంతంలోని సైబర్‌క్రైమ్ పోలీసు స్టేషన్‌కు వెళ్తుంది. ఎవరైనా పోలీసు అధికారితో మాట్లాడాలకున్నా అక్కడ వారి సెల్‌ఫోన్ నంబర్ కూడా కనిపిస్తుంది. ► ఈ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందనే విషయం సైబర్ ట్రాకింగ్, స్టేటస్‌లో కనబడుతుంది. వీరి బృందమే సైబర్ పోలీసులతో మాట్లాడి కేసు స్టేటస్‌ను అప్లోడ్ చేస్తుంది. ఇది కేవలం కంప్లయింట్ ఇచ్చినవారికే కనబడుతుంది. ► ఫిర్యాదు చేయడంతో పాటు మీ సమీపంలో సైబర్‌క్రైమ్ పోలీసు స్టేషన్ ఎక్కడుందనే చిరునామాతో పాటు కాంటాక్ట్ నంబర్ పొందుపరచబడి ఉంటుంది. మీరు నేరుగా వెళ్లి పోలీసులతో మాట్లాడే అవకాశముంటుంది. పోలీసులు మారుతున్న వారి సమాచారం ఎప్పటికప్పుడూ అప్డేట్ చేస్తారు. నాలుగు రోజుల్లోనే ఇద్దరు బాధితులకు సాంత్వన.. ఈ సైబర్ అలర్ట్ యాప్ అందుబాటులో ఉంచిన నాలుగురోజుల్లోనే ఇద్దరికి న్యాయం జరిగింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.80వేలు నష్టపోయిన వ్యక్తి ఈ యాప్ ద్వారా చేసిన ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు 24 గంటల్లోనే అతడి డబ్బును వెనక్కి రప్పించగలిగారు. వరంగల్‌కు చెందిన ఓ మహిళ సెల్‌ఫోన్‌కు వచ్చిన గ్రోసరీ స్టోర్ లింక్ ద్వారా రూ.10వేలు డెబిట్ అయితే ఈ యాప్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదుతో రూ.ఎనిమిది వేలను తిరిగి పొందగలిగారు. ఇవీ 24 గంటల్లోనే ఫిర్యాదు చేయడంతో సాధ్యమైంది. చదవండి: ఉదయం పూలు అమ్ముతూ.. రాత్రి అయితే వేషం మార్చి.. -
లెక్చరర్‌కు నిప్పంటించాడు!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతిపై ఒక దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటన సోమవారం వార్ధా జిల్లాలోని హింగణ్ఘాట్లో జరిగింది. కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న అంకితని వివాహితుడైన వికేశ్ నగ్రాలె గత కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. కాలేజీకి బయల్దేరిన యువతిని సోమవారం ఉదయం నందోరి చౌక్ వద్ద అడ్డగించిన వికేశ్.. అకస్మాత్తుగా ఆమె తలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. 40శాతం కాలిన గాయాలైన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. నాగ్‌పూర్‌లో ఆస్పత్రిలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్న ఆ యువతిని వెంటనే రక్షించకపోవడంపై, పైగా.. కొందరు ఈ ఘటనను తమ సెల్ఫోన్లలో చిత్రీకరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలికి సత్వరమే న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుపుతామని హోంమంత్రి అనిల్ ప్రకటించారు. బాధితురాలు, నిందితుడు వికేశ్ ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. రెండేళ్ల క్రితం వరకూ ఇద్దరూ స్నేహితులేనని, వేధింపుల వల్ల ఇప్పుడు ఆమె స్నేహంచేయట్లేదని ఇన్స్పెక్టర్ సత్యవీర్ తెలిపారు. వికేశ్కు 9 నెలల బాబు ఉన్నాడన్నారు. వికేశ్ కారణంగా గత సంవత్సరం ఆమె వివాహం విచ్ఛిన్నమైందని బాధితురాలి సోదరుడు శుభమ్ తెలిపారు. -
ఆటల్లేని.. చదువులు..!
ఆట, పాటలతో ఆనందంగా కొనసాగాల్సిన విద్యార్థుల చదువు.. జీవితం తరగతి గోడలకే పరిమితమవుతోంది. మైదానాలు ఉంటే వ్యాయామ ఉపాధ్యాయులు ఉండరు.. వ్యాయామ ఉపాధ్యాయులు ఉంటే మైదానాలూ ఉండవు. ఇవి రెండూ లేని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోకొల్లలు. మంచిర్యాలసిటీ: అత్తెసరు వ్యాయామ ఉపాధ్యాయులతో అరకొర మైదానాలతో జిల్లాలోని విద్యార్థులు ఆటలకు దూరమై.. కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. మానసిక ప్రశాంతత కొరవడి చదువుకు కూడా దూరమవుతున్న వారు అనేకమంది విద్యార్థులు జిల్లాల్లో ఉండటం గమనార్హం. ఆటలంటే ఇష్టమున్న విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. దీంతో చదువుకు, ఆటలకు దూరమై విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, కళాశాలలు 523 ఉండగా.. 338 విద్యాలయాల్లో వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 185 విద్యాసంస్థల్లో మాత్రమే వ్యాయామ ఉపాధ్యాయులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 36 శాతం విద్యాలయాల్లో మాత్రమే విద్యార్థులకు క్రీడలు అందుబాటులో ఉండగా.. 64 శాతం సంస్థల్లో విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. మైదానాల పరిస్థితి ఉమ్మడి జిల్లాలో 466 ఉన్నత పాఠశాలలకుగాను సుమారు 150 పాఠశాలలకు మైదానాలు లేవు. 46 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. 20కి పైగా కళాశాలలకు మైదానాలు లేవు. 11 డిగ్రీ కళాశాలలకు మైదానాలు ఉన్నా.. తొమ్మిది కళాశాలలకు వ్యాయామ అధ్యాపకులు లేరు. అవసరమైన స్థలం అన్ని రకాల ఆటలను విద్యార్థులతో ఆడించేందుకు కొలతల ప్రకారం స్థలం అవసరం ఉంటుంది. ప్రాథమిక పాఠశాలలకు ఒకటిన్నర ఎకరం, ప్రాథమికోన్నత పాఠశాలలకు మూడెకరాలు, ఉన్నత పాఠశాలలకు ఐదెకరాల స్థలం ఉంటే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. జూనియర్ కళాశాలలకు ఐదు, డిగ్రీ కళాశాలలకు పదెకరాల స్థలం ఉండాలి. పోస్టులు భర్తీ చేయాలి విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలి. పీఈటీలకు పీడీలుగా పదోన్నతులు ఇవ్వకపోవడంతో అనేక పాఠశాలల్లో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీడీలకు పదోన్నతులు ఇచ్చిన నేపథ్యంలో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ఆటలు ఆడించడానికి అవకాశం ఉండేది. ఖాళీల ప్రభావంతోనే విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఆటలు దూరమై, కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. – బెల్లం శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు, తాండూర్ మండలం -
మధ్యవర్తులే సూత్రధారులు
- ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీపై బలపడుతున్న సందేహాలు - సీఐడీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం - ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ పాత్రపై అనుమానాలు - ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన కన్సల్టెన్సీలు - అభ్యర్థుల తల్లిదండ్రులను సంప్రదించి ఒప్పందాలు! - పరీక్షకు వారం ముందే కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిన విద్యార్థులు - ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉండి పరీక్షకు హాజరు - టీఎస్ ఎంసెట్-1, ఏపీ ఎంసెట్లలో 10-15 వేలకుపైన ర్యాంకులు - ఎంసెట్-2లో మాత్రం వందల్లోపు ర్యాంకులు వచ్చిన వైనం వరంగల్: వైద్య విద్య అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీపై సందేహాలు మరింతగా బలపడుతున్నాయి. సాధారణ విద్యార్థులకు కూడా ఎంసెట్-2లో మెరుగైన ర్యాంకులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు చెల్లించగల వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు మధ్యవర్తులు, కొన్ని కన్సల్టెన్సీలు ఈ వ్యవహారానికి తెరలేపాయనే ఆరోపణలు వస్తున్నా యి. ఒకే కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది పరీక్షకు వారం ముందు అక్కడ లేకుండా పోయిన వారికి మెరుగైన ర్యాంకులు వచ్చాయని పలువురు అభ్యర్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. తొలి ఎంసెట్ జరిగిన 40 రోజుల్లోనే ఎంసెట్-2 జరిగిందని.. ఇంత తక్కువ సమయంలోనే ఏకంగా వేలకుపైగా ర్యాంకుల నుంచి వందల్లోపు ర్యాంకులు రావడం అసాధారణమని పేర్కొంటున్నారు. ఇక ఈ వ్యవహారంలో వైద్య విద్య కోర్సుల ప్రవేశాల కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు కన్సల్టెన్సీలు కీలకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. విజయవాడలో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులు లక్ష్యంగా.. వారి తల్లిదండ్రులతో మధ్యవర్తులు సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎలా జరిగింది? వరంగల్ జిల్లా భూపాలపల్లి, పరకాల ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివారు. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్-1 పరీక్షలు రాశారు. తర్వాత ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్నారు. షార్ట్‌టర్మ్ కోచింగ్ కోసం వారిలో దాదాపు 19 మంది విజయవాడలోని బ్రిలియంట్ కోచింగ్ సెంటర్లో చేరారు. 40 రోజుల కోచింగ్ కోసం భారీగా ఫీజు చెల్లించారు. కానీ ఎంసెట్-2 పరీక్షకు వారం ముందే కోచింగ్ వదిలేసి.. బయటికి వచ్చారు. తర్వాత హైదరాబాద్‌లో పరీక్ష రాశారు. ఇలా పరీక్షకు వారం ముందు కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన వారికి వందల్లో ర్యాంకులు వచ్చాయి. విజయవాడలో పరీక్ష రాసిన వారికి మాత్రం ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్-1 తరహాలోనే వేలకుపైగా ర్యాంకులు వచ్చాయి. పరకాల, భూపాలపల్లి ప్రాంతాలకు చెందిన విద్యార్థుల్లో ఓ విద్యార్థికి ఏపీ ఎంసెట్‌లో 24 వేలకుపైన ర్యాంకు, టీఎస్ ఎంసెట్-1లో 17 వేలకుపైన ర్యాంకు రాగా... ఎంసెట్-2లో ఏకంగా ఏడు వందలలోపు ర్యాంకు రావడం గమనార్హం. మరో విద్యార్థికి ఏపీ ఎంసెట్‌లో 9 వేలకుపైన ర్యాంకు, టీఎస్ ఎంసెట్-1లో దాదాపు అదే ర్యాంకురాగా... ఎంసెట్-2లో మాత్రం మూడు వందలలోపు ర్యాంకు వచ్చింది. మరో విద్యార్థికి ఏపీ ఎంసెట్‌లో 27 వేలపైన, ఎంసెట్-1లో 20వేలపైన ర్యాంకులు రాగా... ఎంసెట్-2లో తొమ్మిది వందలలోపు ర్యాంకు వచ్చింది. దీంతో ఎంసెట్-2 పేపర్ లీకయినట్లుగా సందేహాలు బలపడుతున్నాయి. వారం రోజుల్లోనే.. ఎంసెట్-2 పరీక్ష సమయం దగ్గర పడుతున్న సమయంలో విద్యార్థులు మరింతగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. కానీ కొందరు విద్యార్థులు పరీక్ష దగ్గర పడిన సమయంలో కోచింగ్ నుంచి బయటకు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోచింగ్ తీసుకున్న విజయవాడలోగానీ, సొంత జిల్లా వరంగల్లోగానీ పరీక్షలు రాయాల్సి ఉండగా... హైదరాబాద్‌లో పరీక్షలు రాయడంతో సందేహాలు బలపడుతున్నాయి. ఫిజిక్స్ సబ్జెక్టుకు సంబంధించి ఒక విద్యార్థికి టీఎస్ ఎంసెట్-1లో 7 మార్కులురాగా.. ఎంసెట్-2లో 30కిపైగా మార్కులు ఎలా వచ్చాయనే ప్రశ్న తలెత్తుతోంది. భూపాలపల్లి పట్టణంలోని ఓ వ్యాపారి తన కుమార్తెను విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో చేర్పించారు. ఆమెకు ఎంసెట్-1లో 15వేలకుపైన, ఏపీ ఎంసెట్‌లో 20వేలకుపైన ర్యాంకు వచ్చింది. దీంతో ఎంసెట్-2 షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం మే నెలలో విజయవాడలోని బ్రిలియంట్ కోచింగ్ సెంట ర్లో చేర్పించారు. శిక్షణకు రోజుకు రూ.వెయ్యి చొప్పున 45 రోజులకు రూ.45 వేలు ఫీజు మాట్లాడుకున్నారు. కానీ కోచింగ్ పూర్తి కావడానికి వారం ముందే ఆమె అకాడమీ నుంచి బయటకు వచ్చిందని, ఇంటికి కూడా వెళ్లకుండా తండ్రితో కలసి హైదరాబాద్‌కు వెళ్లారని సమాచారం. శ్రీచైతన్య కళాశాలలో చదివి, బ్రిలియంట్ అకాడమీలో శిక్షణ పొందిన భూపాలపల్లికి చెందిన మరో విద్యార్థినికి కూడా ఎంసెట్-2లో మంచి ర్యాంకు వచ్చినట్లు తెలిసింది. పరకాల పట్టణానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు శ్రీచైతన్య కళాశాలలో చదివి, బ్రిలియంట్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నట్లు సమాచారం. భూపాలపల్లికి చెందిన విద్యార్థుల కంటే పరకాల విద్యార్థులు బాగా చదివేవారని తెలిసింది. అయితే వారిలో ఉత్తమ విద్యార్థులకు కాకుండా... ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్-1లో ప్రతిభ కనబరచని వారికి మంచి ర్యాంకులు వచ్చాయి. దీంతో పరకాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి సమాచారాన్ని సేకరించగా.. లీకేజీ సమాచారం బయటకు పొక్కింది. ఈ మేరకు బుధవారం ఇంటలిజెన్స్ అధికారులు పరకాలలో విచారణ జరిపినట్లు తెలిసింది. తక్కువ సమయంలోనే ర్యాంకులెలా పెరిగాయి? ‘‘టీఎస్ ఎంసెట్-1లో 15 వేలకుపైగా, ఏపీ ఎంసెట్‌లో 20 వేలకుపైగా ర్యాంకు వచ్చిన వారికి కొద్ది రోజుల్లోనే జరిగిన ఎంసెట్-2లో వందల్లో ర్యాంకులు ఎలా వస్తాయి? ప్రశ్నపత్రం లీకేజీ వాస్తవంగానే కనిపిస్తోంది. దీనికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. ఎంసెట్-2 మళ్లీ నిర్వహించాలి..’’ - ఎం.పురుషోత్తం, ఎంసెట్-2లో 3,470 ర్యాంకు సాధించిన పూజ తండ్రి బాధ్యులపై కఠిన చర్యలు: కడియం ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపడుతుందని, బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇంటలిజెన్స్, సీబీసీఐడీలు విచారణ చేపడుతున్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీపై సీఐడీ విచారణ సాక్షి, హైదరాబాద్: పరీక్షకు ముందే ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకైందంటూ వచ్చిన ఆరోపణలపై డీజీపీ అనురాగ్‌శర్మ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ ఎంసెట్ కన్వీనర్ రమణారావు బుధవారం లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సీఐడీ పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు ప్రారంభించారు. కొంత మంది తల్లిదండ్రులు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని.. ఆదిశగా కూడా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. అనుమానం ఉన్న కోచింగ్ సెంటర్లలో ఆరా తీయనున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎంసెట్ ప్రశ్నపత్రం రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని.. ఆయనే కొన్ని ప్రశ్నలు లీక్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ దిశగా దర్యాప్తునకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎంసెట్ లీకేజీపై ఆధారాలు లభిస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. మరోవైపు ఈ నెల 25వ తేదీ నుంచి జరిగే ఎంబీబీఎస్, బీడీఎస్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ యధావిధిగా ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.