Colombia plane crash
-
అద్భుతం జరిగింది.. సజీవంగా 40 రోజులకు దొరికిన చిన్నారులు
నమ్మకం వమ్ము కాలేదు. అడవితల్లే కరుణించిందా అన్నట్లుగా అద్భుతం జరిగింది. వన్య మృగాలు.. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంటపడకుండా ప్రాణాలతో బయటపడ్డారు ఆ నలుగురు చిన్నారులు. విమాన ప్రమాదంలో తల్లిని పొగొట్టుకున్నప్పటికీ.. తామైనా సజీవంగా బయటపడాలన్న వాళ్ల సంకల్పం ఫలించింది. దట్టమైన అమెజాన్ అడవుల్లో తప్పిపోవడంతో రంగంలోకి దిగిన కొలంబియా సైన్యం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 40 రోజుల తర్వాత వాళ్ల జాడను కనిపెట్టింది. చివరకు.. అమెజాన్ అడవుల్లో పాపం పసివాళ్ల కథ సుఖాంతంమైంది. ఆ నలుగురి వయసు 13, 9, 4, 11 నెలలు. అయితేనేం దట్టమైన అమెజాన్ అడవుల్లో మొక్కవోని ధైర్యం ప్రదర్శించారు. దాదాపు నెలకు పైనే పెద్దలెవరూ లేకుండా అడవుల్లో గడిపారు. 13 ఏళ్ల లెస్లీ తన తోబుట్టువులను దగ్గరుండి కాపాడుకుంటూ వచ్చింది. సూర్యుడి వెలుతురు కూడా నేల మీద పడనంత చీకట్లు అలుముకునే అడవుల్లో.. ముందుకు సాగింది. దొరికింది తింటూ.. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా ముందుకు సాగింది. మే 1న వాళ్లు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికాగా.. శుక్రవారం(జూన్ 9న) సాయంత్రం ఆ నలుగురు చిన్నారుల జాడను కొలంబియా సైన్యంలోని ఓ బృందం గుర్తించింది. 👉 కొలంబియా అమెజాన్ అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన రీజియన్ అది. విషపూరితమైన కీటకాలు, వన్యప్రాణుల నుంచి తప్పించుకుంటూ దొరికింది తింటూ ఇన్నాళ్లూ గడిపారు ఆ చిన్నారులు. అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ ముఠాల కంట పడకుండా జాగ్రత్తపడ్డారు. అడవుల్లో దొరికింది తింటూ.. నీళ్లు తాగుతూ.. మధ్యలో సైన్యం ఆకాశం నుంచి జారవిడిచిన ఆహార పొట్లాలను సైతం అందుకున్నారాట. పౌష్టికాహర లోపం తప్పించి.. వాళ్లకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకపోవడం గమనార్హం. అంతకన్నా ఆశ్చర్యకరం ఏంటంటే.. 11 నెలల ఆ పసికందు సైతం ఆరోగ్యంగానే ఉందని ఆర్మీ డాక్టర్లు ప్రకటించారు. పైగా ఆ చిన్నారి తన ఏడాది పుట్టినరోజును అమెజాన్లోనే చేసుకుందట(గడపడం). నలభై రోజుల క్రితం 👉 మే 1 ఉదయం, సెస్నా 206 అనే ఓ తేలికపాటి ప్యాసింజర్ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్‌లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. కానీ, ఆ ఎయిర్‌ప్లేన్ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సమస్య ఉందంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్ రాడార్‌కు అందకుండా పోయింది. This photo by Columbia’s Armed Forces Press, helps us to understand how the children survived the crash. The rear of the plane is untouched. You can see the open door on the side of the plane where they potentially jumped down from. pic.twitter.com/sj0uKVpsbO — Simply_Stranger (@AngelsBokenHalo) May 20, 2023 👉 దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే అది ప్రమాదానికి గురైంది. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా(33) కూడా మరణించింది. పైలట్‌తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. దీంతో వాళ్లు తమ ప్రాణాలు రక్షించుకునేందుకు ముందుకు సాగుతున్నారేమో అని సైన్యం భావించింది. అవాంతరాలు ఏర్పడ్డా.. 👉 వాషింగ్టన్కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్ నోరెయిల్(4), మరో పసికందు క్రిస్టిన్ ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగాయి. భీకరమైన, దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్ ఆపరేషన్‌కు అవాంతరాలు ఏర్పడ్డాయి. 👉 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావించారు. ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తూ వచ్చారు. వాళ్ల ఆచూకీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. కొలంబియా మొత్తం వాళ్లు ప్రాణాలతో బయటపడాలంటూ దేవుడ్ని ప్రార్థిస్తూ వచ్చారు. ఆ ప్రార్థనలు ఫలించాయి. వాళ్లకు అలవాటేనా? 👉 అమెజాన్ అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) తెగకు చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. పైగా లెస్లీకి వాళ్ల బామ్మ అన్ని విధాల శిక్షణ ఇచ్చిందట. కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేసిందామె. వాళ్లు ఊహించినట్లే లెస్లీ రక్షణ బాధ్యతలు తీసుకుంది. అమ్మలా వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది. -
అమెజాన్ అడవుల్లో.. పాపం పసివాళ్లు
దట్టమైన అమెజాన్ అడవులు. నెల రోజులుగా అలుపెరగకుండా ముందుకు సాగుతున్న సైన్యం. పాపం.. ఆ నలుగురు పసివాళ్లు ఇంకా బతికే ఉంటారనే ఆశ వాళ్లను అలా ముందుకు పోనిస్తోంది. సజీవంగా ఆ చిన్నారులు ఇంటికి చేరాలని కోట్లాది మంది ప్రార్థిస్తున్నారు ఇప్పుడు. కొలంబియా అమెజాన్ అడవుల్లో నెల కిందట తేలికపాటి విమాన ఒకటి ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. అయితే.. అందులో ప్రయాణించిన నలుగురు చిన్నారులకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఈ ప్రమాదం నుంచి నలుగురు చిన్నారులు బయటపడి ఉంటారని, అడవుల్లోనే ఎక్కడో ఒక దగ్గర సురక్షితంగా తలదాచుకుని ఉండిఉంచొచ్చని కొలంబియా సైన్యం భావిస్తోంది. ఆ ఆశతోనే భారీ సెర్చ్ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. This photo by Columbia’s Armed Forces Press, helps us to understand how the children survived the crash. The rear of the plane is untouched. You can see the open door on the side of the plane where they potentially jumped down from. pic.twitter.com/sj0uKVpsbO — Simply_Stranger (@AngelsBokenHalo) May 20, 2023 శాటిలైట్ చిత్రాల్లో.. పిల్లలు విమాన శకలాల నుంచి నడుచుకుంటూ వెళ్లిన కాలిముద్రలు, అలాగే వాళ్ల కోసం గాలిస్తున్న బృందానికి వాళ్లకు సంబంధించిన వస్తువులు, అడవుల్లో తాత్కాలిక ఆశ్రయం కోసం చేసుకున్న ఏర్పాట్లు, సగం తినిపడేసిన పండ్లు.. కిందటి వారం ఒక జత బూట్లు, డైపర్.. ఇలా ముందుకు వెళ్లే కొద్దీ పిల్లల ఆనవాళ్లకు సంబంధించిన వస్తువులు దొరుకుతుండడంతో వాళ్లు బతికే ఉంటారన్న ఆశలతో గాలింపును ఉధృతం చేశారు. 👉 దొరికిన ఆధారాలతో వాళ్లు సజీవంగానే ఉన్నారని భావిస్తున్నాం. వాళ్లకు కనిపెట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు అంటూ ఈ రెస్క్యూ ఆపరేషన్ బృందానికి నేతృత్వం వహిస్తున్న జనరల్ పెడ్రో చెబుతున్నారు. ఒకవేళ వాళ్లు చనిపోయి ఉంటే స్నిఫ్ఫర్ డాగ్స్ సాయంతో ఈపాటికే ఆ మృతదేహాలను కనిపెట్టేవాళ్లం. కానీ, అలా జరగలేదు కాబ్టటి వాళ్లు బతికే ఉంటారని మేం భావిస్తున్నాం అని ఆయన చెబుతున్నారు. 👉 ఏం జరిగిందంటే.. మే 1 ఉదయం, సెస్నా 206 తేలికపాటి ప్యాసింజర్ విమానం.. అరరాకువారా అని పిలువబడే అడవి ప్రాంతం నుండి కొలంబియా అమెజాన్‌లోని శాన్ జోస్ డెల్ గువియారే పట్టణానికి బయలుదేరింది. ఈ మధ్య దూరం 350 కిలోమీటర్లు. అయితే ఆ ఎయిర్‌ప్లేన్ బయల్దేరిన కాసేపటికే ఇంజిన్‌లో సమస్య ఉందంటూ పైలట్ రిపోర్ట్ చేశాడు. కాసేపటికే విమానం సిగ్నల్ రాడార్‌కు అందకుండా పోయింది. దీంతో విమానం ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 👉 ఆపై అది ప్రమాదానికి గురైందని ధృవీకరించుకుని.. శకలాల కోసం గాలింపు చేపట్టారు. మే 15, 16వ తేదీల్లో.. దట్టమైన అటవీ ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలను సైన్యం కనిపెట్టంది. ఆ పక్కనే చెట్ల పొదట్లో విమాన శకలాలు చిక్కుకుని కనిపించాయి. అయితే.. లెస్లీ(13), సోలెయినీ(9), టెయిన్ నోరెయిల్(4), మరో పసికందు క్రిస్టిన్ కనిపించకుండా పోయారు. 👉 దీంతో 200 మంది సైనికులు, కొందరు అడవుల్లో నివసించే స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. మధ్యలో వాళ్లకు సంబంధించిన వస్తువులు కనిపిస్తుండడంతో.. బతికే ఉంటారని భావిస్తున్నారు. ప్రత్యేక హెలికాఫ్టర్ల ద్వారా ఆ అడవుల్లో నీళ్ల బాటిళ్లు, ఆహార పొట్లాలు పడేస్తున్నారు. 👉 విమాన ప్రమాదంలో ఆ చిన్నారుల తల్లి మాగ్దలేనా కూడా మరణించింది. పైలట్‌తో పాటు ఓ తెగ నాయకుడు కన్నుమూశాడు. అయితే.. పిల్లలకు సంబంధించిన జాడ మాత్రం దొరకలేదు. వాషింగ్టన్కు రెండింతల పరిమాణంలో ఉండే ఆ అటవీ ప్రాంతంలో చిన్నారు ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు భీకరమైన,దుర్భేద్యమైన అటవీ ప్రాంతంలో కావడంతో సెర్చ్ ఆపరేషన్‌కు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దీంతో.. రోజులు గడిచే కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. అడవి మార్గంలో ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి ఆ ప్రయత్నాలు తీవ్రతరం అయ్యాయి. మూడు కిలోమీటర్లపాటు ఫోకస్ పడేలా సెర్చ్లైట్లను అడవుల్లో ఏర్పాటు చేసింది సైన్యం. తద్వారా పిల్లలు తమవైపు వస్తారనే ఆశతో ఉంది. ఆ నమ్మకమే బతికిస్తోంది.. కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు.. హుయిటోటో(విటోటో) కమ్యూనిటీకి చెందిన వాళ్లు. అడవితో మమేకమై జీవించడం ఆ తెగకు అలవాటే. చిన్నప్పటి నుంచి చేపల వేట, ఆహార పదార్థాల సేకరణ లాంటి పనుల్లో శిక్షణ తీసుకుంటారు. కాబట్టి, ఏదో రకంగా వాళ్లు బతికేందుకు ప్రయత్నిస్తారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ఆ చిన్నారుల తాత. లెస్లీ తన కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందేమోనని అంటున్నాడాయన. అయితే.. క్రూర వన్యప్రాణులతో పాటు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాలకు నెలవు ఆ ప్రాంతం. అలాంటి ముప్పును వాళ్లు ఎలా ఎదుర్కొంటారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారాయన. -
'అతడు లేని జీవితం నాకొద్దు'
రియో డీ జెనిరో: ఆమె అందరిలాగే అందమైన జీవితాన్ని కలగంది. ఏడేళ్లుగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి అంతా సిద్ధం చేసుకుంటుంది. ఆమె ఆనందానికి అవధులు లేవు. అంతా సవ్యంగా జరిగితే.. శుక్రవారం ఆమె పెళ్లి జరగాల్సింది. కానీ.. అంతలోనే జరిగిన పెను విషాదం ఆమెను ప్రియుడి అంత్యక్రియల్లో పాల్గొనేలా చేసింది. ఇటీవల విమానప్రమాదంలో మృతి చెందిన ఓ బ్రెజిల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడి ప్రేయసి అమందా మచాడో జీవితంలో చోటుచేసుకున్న పెను విషాదం ఇది. కోపా సుడామెరికా ఫైనల్స్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న బ్రెజిల్ చాపెకోయన్స్ ఫుట్‌బాల్ టీం క్రీడాకారులు ఇటీవల కొలంబియా విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో క్రీడాకారులతో సహా మొత్తం 75 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన 19 మంది క్రీడాకారుల్లో డెనర్ అసున్కావ్ బ్రాజ్ ఒకరు. డెనర్ మృతితో అమండా జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ’డెనర్ మరణ వార్త వినగానే నా గుండె ఆగిపోయింది.. అతడితో పాటే నేనూ వెళ్లిపోవాలని భావించా. అతడులేని జీవితం నా కొద్దు అనిపించింది’ అని ఆ విషాద ఘటనపై మాట్లాడుతూ అమండా తెలిపింది. డెనర్ విమానం ఎక్కడానికి ముందు తనకు ఓ మెసేజ్ చేశాడని.. కానీ దానిని తాను చూడకపోవడంతో చివరిసారిగా డెనర్కు గుడ్ బై చెప్పే అవకాశాన్ని కోల్పోయానని ఆమె వాపోయింది. తన సోల్‌మేట్, గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారుడు డెలన్ జీవితం మధ్యలోనే ఇలా ఆగిపోయిందని పెళ్లి కోసం వారు తయారుచేయించుకున్న ఉంగరాన్ని చూస్తూ ఆమె విషాదంలో మునిగింది. డెలన్తో అనుబంధానికి గుర్తుగా అమండాకు రెండేళ్ల కొడుకు బెర్నార్డో ఉన్నాడు. బెర్నార్డో అచ్చం తండ్రి డెలన్లాగే ఉంటాడని.. అతడిని మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతానని అంటోంది. మీ నాన్న ఒక అసాధారణమైన వ్యక్తి అని అతడికి చెబుతానంటూ.. కొడుకు భవిష్యత్తులోనే తన జీవితాన్ని వెతుక్కొంటోంది అమండా. -
కూలిన చిన్న విమానం
-
విమానం కూలి 10 మంది మృతి
బొగోట: కొలంబియా విమానం అమెజాన్ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారని ఉన్నతాధికారి వెల్లడించారని స్థానిక మీడియా తెలిపింది. మృతుల్లో 8 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. అరారకుర నుంచి ఫ్లోరెన్సియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసకుందని తెలిపింది. విమానం టెకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిందని కొలంబియా పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. సంఘటన స్థలానికి సహాయక చర్యల కోసం బృందాలను పంపుతున్నట్లు తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని.... విచారణ జరుగుతుందని పౌర విమానయాశాఖ తెలిపింది.