విమానం కూలి 10 మంది మృతి
బొగోట: కొలంబియా విమానం అమెజాన్ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారని ఉన్నతాధికారి వెల్లడించారని స్థానిక మీడియా తెలిపింది. మృతుల్లో 8 మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. అరారకుర నుంచి ఫ్లోరెన్సియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసకుందని తెలిపింది.
విమానం టెకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిందని కొలంబియా పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. సంఘటన స్థలానికి సహాయక చర్యల కోసం బృందాలను పంపుతున్నట్లు తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని.... విచారణ జరుగుతుందని పౌర విమానయాశాఖ తెలిపింది.