Comets
-
ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి
మెక్సికో : విశ్వంలో మనం నివసిస్తున్న భూమి ఎంత అందంగా కనిపిస్తుందో.. పైన కనిపించే ఆకాశం కూడా అంతే అద్భతంగా కనిపిస్తుంది. సాధారణంగా ఎలాంటి మబ్బులు లేకపోతే చుక్కల వెలుగుల్లో రాత్రి వేళ ఆకాశాన్ని పరిశీలిస్తే దానికి మించిన మజా ఇంకోటి ఉండదు. పైగా ఆకాశంలో మన భూమిమీద నుంచి ఇతర గ్రహాలైన శుక్రుడు, గురుడు, శనిగ్రహం వంటివి నక్షత్రాల్లా మెరుస్తూ కనిపిస్తాయి. అసలు ప్రకృతిలో చోటుచేసుకునే అందాలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కానీ ఇప్పటి జనాలు బిజీ లైఫ్‌లో పడి ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించడం మరిచిపోతున్నారు.('మన పరిస్థితి కూడా సీతాకోకచిలుకలాగే..') తాజాగా మెక్సికోలోని తావోస్‌లో ఒక అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఆకాశంలో ఒక ఉల్కాపాతం జరిగింది. ఆ సమయంలో మ్యుజిషియన్ అయిన అంబెర్ కఫ్మాన్‌కి మెరుస్తున్న ఉల్క ఒకటి కనిపించింది. అది ఆకాశంలో అలా వెళ్తుంటే ఆశ్చర్యపోతూ వీడియో తీశారు. తన జీవితంలో ఎప్పుడూ అలాంటిది చూడలేదనీ, ఇదో అద్భుతమని చెబుతూ.. అంబెర్ ఆ వీడియోని ట్విట్టర్లో షేర్ చేశారు. సాధారణంగా ఉల్కలు అంత స్పష్టంగా కనిపించవు. ఈ వీడియోలో మాత్రం ఉల్క నిప్పులు చిమ్ముతూ... కాంతివంతంగా మెరిసిపోతూ... దూసుకెళ్లింది. జులై 29న పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటికే 33 లక్షల మంది ఈ వీడియోను చూడగా.. దాదాపు 2లక్షల మందికి పైగా లైక్ చేశారు. Guys, we just saw one of the craziest things we have ever seen in our lives and I managed to capture some of it. A meteor for the ages! pic.twitter.com/kPIchIPREV — Amber Coffman (@Amber_Coffman) July 29, 2020 -
సూర్యుడిపైకి కామెట్స్ను పంపిన ఏలియన్ స్టార్
సాక్షి, వెబ్ డెస్క్ : దాదాపు 70 వేల ఏళ్ల క్రితం ఆకాశంలో జరిగిన అద్భుతంపై పరిశోధకులు ఆశ్చర్యపోయే నిజాలను వెల్లడించారు. స్కోల్జ్ స్టార్ లేదా బైనరీ స్టార్ అనే అతి చిన్న ఏలియన్ నక్షత్రం సౌర కుటుంబం మధ్యలోకి తోక చుక్కలను, గ్రహ శకలాలను పంపించిందని చెప్పారు. ఇదే సమయంలో ఆఫ్రికా పరిసర ప్రాంతాల్లో నివసించడం ప్రారంభించిన మన పూర్వీకులకు ఆ నక్షత్రం కనిపించినట్లు వెల్లడించారు. సదరు నక్షత్రం సూర్యుడికి ఒక కాంతి సంవత్సరం కన్నా తక్కువ దూరంలోకి రావడం వల్లే మనుషులు ఆ దృశ్యాన్ని చూడగలిగారని చెప్పారు. ఆకాశంలో ఎరుపు రంగులో ప్రకాశిస్తూ ఏలియన్ స్టార్ మానవుడి కంటికి కనిపించిందని వివరించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ సౌర వ్యవస్థలో ఉన్నాయని కంప్లూటెన్స్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి అంతరిక్ష పరిశోధకులు పేర్కొన్నారు. సౌర కుటుంబంలో హైపర్బోలిక్ ఆర్బిట్స్‌లో తిరుగుతున్న 340 శకలాలను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నామని వివరించారు. సాధారణంగా మనం ఊహించుకునే ఎలిప్టికల్ ఆర్బిట్స్కు బదులు సూర్యుడికి చేరువలో ‘వీ’ ఆకారపు కక్ష్యలు కనిపించినట్లు తెలిపారు. ఈ వీ ఆకారపు కక్ష్యల్లో ఓర్ట్ తోకచుక్కలు తిరుగుతున్నట్లు గుర్తించామని వివరించారు. విశ్వం పుట్టుక నాటి నుంచి ఓర్ట్ తోక చుక్కలు ఉన్నాయని చెప్పారు. సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి ఎక్కడ అంతమవుతుందన్న విషయాన్ని ఈ తోకచుక్కల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. స్కోల్జ్ అనే ఏలియన్ నక్షత్ర ప్రభావం వల్ల ఓర్ట్ తోకచుక్కలు గతి తప్పి సూర్యుడికి అతి చేరువగా వెళ్లాయని చెప్పారు. స్కోల్జ్ నక్షత్రాన్ని కనుగొన్నట్లు 2015లో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఏంటీ ఓర్ట్ మేఘం ? ఓర్ట్ మేఘం అనేది సౌర వ్యవస్థ చుట్టూ ఉండే ఓ ఊహాజనిత ప్రదేశం. విశ్వం పుట్టుక నుంచి ఓర్ట్ క్లోడ్లో ట్రిలియన్ల కొద్దీ తోక చుక్కలు ఉన్నాయి. వీటిలో కొన్ని అప్పుడప్పుడూ గతి తప్పి సౌర వ్యవస్థలోని గ్రహాల వైపు వస్తాయి. -
తోక లేని ‘తోక చుక్క’
వాషింగ్టన్: విశ్వంలోనే తొలిసారిగా మన సౌరకుటుంబంలో శిలలతో నిండిన తోక లేని ‘తోక చుక్క’ ఉనికిని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సీ/2014 ఎస్3గా పిలిచే ఈ తోక చుక్క తన కక్ష్యలో పూర్తి భ్రమణం పూర్తిచేసేందుకు 860 సంవత్సరాలు పడుతుంది. భూమి ఆవిర్భవించిన కాలంలో ఈ చుక్క ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఖగోళశాస్త్రవేత్తలు మ్యాన్క్స్(తోక లేని పిల్లి జాతి)గా పిలుచుకునే ఈ చుక్క సౌర మండలం ఆవల ఉన్న ఓర్ట్ క్లౌడ్ ప్రాంతంలో పరిభ్రమిస్తోంది. అత్యంత ఎక్కువ భ్రమణకాలం ఉన్న గ్రహశకలం లాంటి పదార్ధం ఇదేనని హవాయి వర్సిటీ పరిశోధకుడు కరేన్ మీక్ తెలిపారు. -
తోకచుక్క నుంచి మద్యం ఉత్పత్తి!
న్యూయార్క్: ఆల్కహాల్ ఆంతరిక్షంలోనూ ఉత్పత్తవుతోందని ఫ్రాన్స్‌లోని ప్యారిస్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. లవ్‌జాయ్ అనే తోకచుక్క సెకెనుకు 500 బాటిళ్ల ఆల్కహాల్‌ను అంతరిక్షంలోకి విడిచిపెడుతోందట. ఒక తోకచుక్కపై ఇథైల్ ఆల్కహాల్‌ను కనుగొనడం ఇదే మొదటిసారి. అతిశీతల వాతావరణం ఉండే లవ్‌జాయ్ ఈ ఏడాది జనవరి 30న సూర్యునికి దగ్గరగా వచ్చింది. సూర్యుని వేడిమికి ఇది సెకెనుకు 20 టన్నుల నీటి ఆవిరిని రోదసిలో విడుదల చేసింది. దీనిలో 500 బాటిళ్లకు సమానమైన ఇథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో తోకచుక్కపై జీవం ఉనికికి అవసరమైన కర్బన పరమాణువులు ఉన్నట్లు తేలిందన్నారు. ప్రకాశవంతమైన ఈ తోకచుక్కను స్పెయిన్‌ని నవేదా పర్వతాల్లో ఉన్న టెలిస్కోప్ ద్వారా పరిశీలించారు. భూమిలాంటి గ్రహం నుంచి విడివడిన పదార్థమే తోకచుక్కగా రూపాంతరం చెందిందని విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నాయనే వాదనకు మద్దతు లభించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
చెమటోడుస్తున్న తోకచుక్క!
పారిస్: సూర్యునికి 58.3 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక తోకచుక్క ప్రతీ సెకనుకు రెండు చిన్నపాటి గ్లాసుల చెమటను కార్చేస్తుందట. 2004లో తాము ప్రయోగించిన రొజెట్టా అనే అంతరిక్ష నౌక తాజాగా ఒక మైక్రోవేవ్ సెన్సర్ ద్వారా ఈ దృగ్విషయాన్ని గుర్తించిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ) సోమవారం ప్రకటించింది. 67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో అనే ఆ తోకచుక్క ప్రతీ సెకనుకు 300 మిల్లీలీటర్ల నీటిని భాష్పభవనం చెందిస్తోందని రొజెట్టా గుర్తించినట్లు ఈఎస్ఏ పేర్కొంది. అంటే 100 రోజుల్లో ఒక స్విమ్మింగ్ పూల్ నిండేంత నీటిని వెలువరిస్తోందన్న మాట. సూర్యుడికి అంత దూరంలో ఉన్నప్పటికీ ఆ తోకచుక్క ఆ స్థాయిలో చెమటోడ్చటం వింతేనని ఈఎస్ఏ పేర్కొంది. దీన్నిబట్టి సుదూరంలో ఉన్న తోకచుక్కలపై కూడా సూర్యుడి ప్రభావం ఉంటుందని తేలిందని వివరించింది. ప్రస్తుతం ఆ తోకచుక్కకు రొజెట్టా 3.5 లక్షల కి.మీ.ల దూరంలో ఉందని వెల్లడించింది. రొజెట్టా ఈ నవంబర్‌లో 100 కేజీల ల్యాండర్‌ను తోకచుక్కపై దింపి ప్రయోగాలు కొనసాగిస్తుందని వివరించింది.