Commercial complexes
-
అర్ధరాత్రి ఒంటి గంట వరకు షాపులు తెరవచ్చు..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ఇక నుంచి అర్ధరాత్రి 1 గంట వరకూ వాణిజ్య సముదాయాలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచి్చంది. పోలీసులు బలవంతంగా షాపులు మూసి వేయిస్తున్నారని సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడం, ఇదే అంశంపై అసెంబ్లీలోనూ చర్చ జరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ ముఖ్యమంతి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. మద్యం దుకాణాలు మినహా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఇతరత్రా వ్యాపార కేంద్రాలకు ఈ అనుమతి వర్తిస్తుంది. -
‘ఈవీ’ ఇళ్లు..!
సాక్షి, హైదరాబాద్: ఇంధన వనరుల ధరలు రోజుకో రేటు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని నెలకొల్పుతున్నారు. జిమ్, స్విమ్మింగ్ పూల్ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్ పాయింట్ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగ (రెట్రోఫిట్) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సరీ్వస్ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిరీ్ణత రుసుములను వసూలు చేస్తున్నారు. రానున్న కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్ స్థలాన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్ల కోసం కేటాయించబడతాయని జేఎల్ఎల్ ఇండియా స్ట్రాటర్జిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యువేషన్ అడ్వైజరీ హెడ్ ఏ శంకర్ తెలిపారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐఓటీ) చార్జింగ్ ఉపకరణాలు, ఇంటర్నెట్ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి గనక.. ఇప్పటికే ఉన్న పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు, బహుళ అంతస్తుల భవనాలలో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు వ్యయం, పరిమిత విద్యుత్ సరఫరా సామర్థ్యాలను బట్టి 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే ఎక్కువ నివాసితులు ఈవీ చార్జింగ్ పాయింట్ల అవసరాన్ని కోరుకుంటుంటే ఈ ప్రీమియం 2–5 శాతం వరకు ఉంటుందని తెలిపారు. ఆఫీస్ స్పేస్‌లలో కూడా.. ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్ స్పేస్‌లకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్ సరీ్వస్ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్ మోడల్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆఫీస్ పార్కింగ్‌లలో ఖాళీ ప్లేస్‌లు లేకపోవటమే అసలైన సవాలు. ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్ ఆపరేటర్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సరీ్వస్ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్ఎల్ సూచించింది. -
ఇకపై తమిళనాడులో 24 గంటల షాపింగ్
సాక్షి, చెన్నై : తమిళనాడులో ఇకపై దుకాణాలు, వాణిజ్య సముదాయాలు 24 గంటలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. వాణిజ్య, వ్యాపార అభివృద్ధితో పాటు, మహిళా ఉద్యోగులు భద్రతపై తమిళనాడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ చేసిన ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించింది. మూడు ఏళ్ల పాటు ఈ విధానం కొనసాగించనున్నట్టు తెలిపింది. 2016లో కేంద్రప్రభుత్వం దుకాణాలు మరియు విధుల నియంత్రణా మండలి, సేవలకు సంబందించిన నిబంధనల చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం సినిమా థియేటర్లు, హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు సహా పలు పరిశ్రమలు వారం లో 7 రోజుల పాటు 24 గంటలు పనిచేయవచ్చు. ఈ చట్టాన్ని అలాగే అమలు చేసుకోవచ్చు లేకపోతే.. స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవచ్చని కూడా అందులో పేర్కొంది. దీని ప్రకారం రాష్ట్రాలే తమ పరిధిలోని దుకాణాలు, సంస్థల పని గంటలను నిర్దేశించుకోవచ్చు. ఇప్పటికే మహారాష్ట్ర 24 గంటలు పని చేసేలా నిబంధనలను మార్చుకుంది. ఇప్పుడు తమిళనాడు కూడా ఆ జాబితాలో చేరింది. తమిళనాడులోని సినిమా థియేటర్లు, హోటళ్లు, దుకాణాలు, బ్యాంకులు సహా అన్ని రకాల పరిశ్రమలు నిరంతరాయంగా 24 గంటలు పని చేయవచ్చు. ఇక రాత్రిపూట పనిచేసే మహిళల భద్రతకు సంబంధించి సంస్థల నుంచి లిఖిత పూర్వక హామీని తీసుకోనున్నారు. వారం రోజులూ పని చేసే సంస్థలో ఎవరికి ఏ రోజు సెలవు అన్న వివరాలకు సంబంధించి తప్పనిసరిగా బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఓవర్ టైమ్ 10.30 గంటలకు మించరాదు. -
వచ్చే శని, ఆదివారాల్లో సాక్షి ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: మెట్రో నగరంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కుల్లేని ప్రాపర్టీలను వెతకడం సవాలే. అభివృద్ధి చెందే ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో స్థిరాస్తిని కొనుగోలు చేయడం కష్టమే. వీటన్నింటికి పరిష్కారం చూపించనుంది ‘సాక్షి ప్రాపర్టీ షో’. ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలు, వ్యక్తిగత గృహాలు, వాణిజ్య సముదాయాలు.. అన్ని రకాల ప్రాపర్టీ లను ఒకే వేదికగా ప్రదర్శించనుంది. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో మే 4, 5 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో జరగనుంది. ప్రారంభ సమయం ఉదయం 10 గంటలు. ప్రవేశం ఉచితం. ప్రధాన స్పాన్సర్: అపర్ణ కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్స్: రాంకీ, ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కో–స్పాన్సర్స్: జనప్రియ, ఎన్సీసీ, మ్యాక్ ప్రాజెక్ట్స్ ఇతర పాల్గొనే సంస్థలు: అక్యురేట్ డెవలపర్స్, ప్రావిడెంట్ హౌసింగ్, రాజపుష్ప ప్రాపర్టీస్, సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సాకేజ్ ఇంజనీర్స్, ఆర్వీ నిర్మాణ్, ఆర్క్ బిల్డర్స్, ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ, గ్రీన్ హోమ్, వర్టెక్స్ హోమ్స్, గిరిధారి హోమ్స్. స్టాల్స్ బుకింగ్ కోసం 99122 20380, 99516 03004 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. -
విమానాశ్రయాల్లా బస్టాండ్లు
సాక్షి, హైదరాబాద్: బస్టాండ్లను రాబడికి రాచమార్గాలుగా చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలోని పెద్ద పెద్ద బస్టాండ్లను విమానాశ్రయాల మాదిరిగా తీర్చిదిద్దనుంది. శంషాబాద్ విమానాశ్రయంలోని వాణిజ్య, వ్యాపార స్టాళ్ల మాదిరిగానే ఈ బస్టాండ్లలోనూ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. విమానాశ్రయాల్లో దొరికే అన్ని రకాల వస్తువులు లభించేలా తీర్చిదిద్దుతారు. దీంతోపాటు ప్రయాణికులకు అధునాతన వసతులు కల్పించనున్నారు.తొలి దశలో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి బస్టాండ్లను వాణిజ్య సముదాయాలుగా తీర్చిదిద్దనున్నారు. ప్రయాణికులు రాత్రి పూట బస చేసేందుకు వీలుగా అత్యాధునిక వసతులతోపాటు సింగిల్, డబుల్ బెడ్ రూమ్ గదుల నిర్మాణం చేపడతారు. పగలుగానీ లేదా రాత్రిగానీ గంట సేపు విశ్రాంతి తీసుకోవాలనుకునే ప్రయాణికులకు అనువుగా గదుల్ని నిర్మిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో బస్టాండ్లను లీజుకివ్వాలని నిర్ణయించారు. ఎవరు ఎక్కువ ఆదాయమిస్తే వారికి వీటిని కేటాయిస్తారు. తొలుత మూడుచోట్ల చేపడతాం రాష్ర్టంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి బస్టాండ్లను వాణిజ్య సముదాయాలుగా తీర్చిదిద్దనున్నామని రహదారులు, భవనాలు, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబ్ ‘సాక్షి ’కి తెలిపారు. ఈ బస్టాండ్లలో 12 నుంచి 20 ఎకరాల వరకు స్థలం ఉందన్నారు. ఇందుకోసం రెండు నెలల్లో ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తామన్నారు. గుజరాత్‌లోని బరోడాతోపాటు కర్ణాటకలోని ఆర్టీసీ బస్టాండ్లను వాణిజ్య సముదాయాలుగా తీర్చిదిద్దారని, అదే తరహాలో రాష్ట్రంలో తొలుత పెద్ద పెద్ద బస్టాండ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం ఎవరు ఇస్తే వారికి పీపీపీ విధానంలో ఆయా బస్టాండ్లను లీజుకిస్తామని చెప్పారు. క్రమంగా అన్ని జిల్లాల బస్టాండ్లను కూడా పీపీపీ విధానంలో లీజుకిచ్చి అభివృద్ధి చేస్తామన్నారు.