‘మీసేవ’ ద్వారా డిస్కం సేవలు
తిరుపతి : సదరన్ డిస్కం పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు ‘మీసేవ’ ద్వారా మరిన్ని విద్యుత్ సేవలను అందుబాటులోకి తెచ్చామని ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్‌వై.దొర బుధవారం తెలిపారు. సర్వీస్ పేరు, లోడ్ కేటగిరీల మార్పు, వీధి దీపాలు, పబ్లిక్ వాటర్వ ర్క్స్, గృహావసరాలు, వాణిజ్యం, కమర్షియల్ హోర్డింగ్స్ ఏర్పాటు తదితర కేటగిరీలకు సంబంధించి కొత్త సర్వీసులకు వినియోగదారులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, డాక్యుమెంట్ల నకళ్లను జతపరచి నిర్ధేశిత దరఖాస్తు ఫారాలను నింపి మీసేవ కేంద్రాల్లో సమర్పించాలన్నారు. ఆయా సేవలకు చెల్లించాల్సిన ఫీజులను కూడా మీసేవలోనే చెల్లించవచ్చన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే లక్ష ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
విద్యుత్ కాల్‌సెంటర్లతో పాటు మీసేవ కేంద్రాల్లో పైన పేర్కొన్న సేవల ను వినియోగదారులు పొందవచ్చునని, ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన వినియోగదారులకు విజ్ఞప్తి చేశా రు. వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి వీలుగా తిరుపతిలోని డిస్కం ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు 1800 425 1555333 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని దొర తెలిపారు.