comming soon
-
తీరనున్న ఎగిరే ట్యాక్సీ కల! ‘సాక్షి’తో సీఈఓ ప్రేమ్ కుమార్
‘‘రెండేరెండు గంటల్లో హైదరాబాద్ నుంచి అటవీ ప్రాంతమైన ములుగుకు ఎయిర్ ట్యాక్సీలో గుండెను తీసుకెళ్లి రోగి ప్రాణాలు కాపాడొచ్చు’’. ‘‘తొమ్మిది గంటల్లో ఆదిలాబాద్ నుంచి తిరుపతికి ఎంచక్కా ఎగురుతూ వెళ్లిపోవచ్చు’’. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే 2025లోనే ఇవన్నీ నిజమవుతాయి. జపాన్‌కు చెందిన ఫ్లయింగ్ కార్ల తయారీ సంస్థ స్కై డ్రైవ్ పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. మనదేశంలో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేందుకు హైదరాబాద్‌కు చెందిన డ్రోన్ తయారీ సంస్థ మారుత్ డ్రోన్స్‌తో ఒప్పందం చేసుకుంది. సాక్షి, హైదరాబాద్: భూమి ఉపరితలం నుంచి 5 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ప్రయాణించడం ఎయిర్ ట్యాక్సీల ప్రత్యేకత. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించడంతోపాటు కొండ ప్రాంతాలు, తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలకు ప్రయాణికులను తీసుకెళ్లడమే లక్ష్యమని మారుత్‌డ్రోన్ సీఈఓ ప్రేమ్‌కుమార్ విస్లావత్ ‘సాక్షి’కి తెలిపారు. ఎయిర్ ట్యాక్సీ ప్రత్యేకతలు ఆయన మాటల్లోనే.. వాయు రవాణారంగంలో సరికొత్త శకం మొదలుకానుంది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ఈ–కామర్స్ వృద్ధి వంటి కారణంగా ప్రజలు, వస్తువులకు వేగవంతమైన, సురక్షితమైన, సరసమైన రవాణావిధానం అవసరం. దీనికి అర్బన్ ఎయిర్ మొబిలిటీ (యూఏఎం) పరిష్కారం చూపిస్తుంది. 2030 నాటికి యూఏఎం ఎయిర్‌క్రాఫ్ట్ మార్కెట్ దాదాపు 25–30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని పరిశ్రమవర్గాల అంచనా. ఎయిర్ ట్యాక్సీ అంటే.. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ (ఈవీటీఓఎల్) ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్ ట్యాక్సీలని పిలుస్తారు. ఇవి ఎలక్ర్టిక్ బైక్‌లు, కార్ల లాగా బ్యాటరీలతో నడుస్తాయి. వీటికి హెలికాప్టర్ ఫిక్స్డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సామర్థ్యంతో మిళితమై ఉంటాయి. కాలుష్య ఉద్గారాలను విడుదల చేయని ఈ ఎయిర్ ట్యాక్సీలతో ట్రాఫిక్ రద్దీ, రణగొణ ధ్వనుల వంటి సమస్యలు ఉండవు. రాజేంద్రనగర్‌లో టెస్టింగ్ సెంటర్ ఎయిర్ ట్యాక్సీలను స్కైడ్రైవ్ జపాన్‌లో తయారు చేస్తుంది. పరిశోధనలు, అనుమతులు పూర్తయ్యాక.. విడిభాగాలను ఇండియాకు తీసుకొచ్చి హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న టెస్టింగ్ సెంటర్లో బిగిస్తామని మారుత్ డ్రోన్స్ సీఈఓ ప్రేమ్‌కుమార్ చెప్పారు. భవిష్యత్ అవసరాలకు సెంటర్‌ను విస్తరించేందుకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తాం. ఎయిర్ ట్యాక్సీ ప్రత్యేకతలివే.. సీటింగ్ సామర్థ్యం : 3 సీట్లు (ఒక పైలెట్+ ఇద్దరు ప్రయాణికులు) కొలతలు: 13 మీటర్లు*13 మీటర్లు*3 మీటర్లు యంత్రాలు: 12 మోటార్లు/రోటర్లు గరిష్ట టేకాఫ్ బరువు: 1.4 టన్నులు (3,100 ఎల్బీఎస్) గరిష్ట వేగం: గంటకు వందకిలోమీటర్లు గరిష్ట ఫ్లయిట్ రేంజ్: 15 కి.మీ. ఇదీ స్కైడ్రైవ్ కథ.. జపాన్‌కు చెందిన స్కైడ్రైవ్ 2018లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ రోజువారీ రవాణాగా ఈవీటీఓఎల్‌ను వినియోగించేలా చేయడం దీని లక్ష్యం. 2019లో జపాన్‌లో జరిగిన తొలి ఈవీటీఓఎల్ విమాన పరీక్షలో స్కైడ్రైవ్ విజయం సాధించింది. వచ్చే ఏడాది జపాన్‌లోని ఒసాకాలో జరగనున్న అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ (ఏఏఎం) ప్రాజెక్ట్ పాల్గొనేందుకు స్కైడ్రైవ్ అర్హత సాధించింది. ఈ ఏడాది సుజుకి మోటార్ కంపెనీకి చెందిన ప్లాంట్‌లో స్కైడ్రైవ్ ఎయిర్ ట్యాక్సీల ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మారుత్ డ్రోన్ కథ.. సామాజిక సమస్యలకు డ్రోన్ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మారుత్ డ్రోన్స్ ప్రత్యేకత. ముగ్గురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు 2019లో దీనిని ప్రారంభించారు. తాజా ఒప్పందంలో ప్రదర్శన, వాణిజ్య విమానాల కార్యకలాపాలకు స్థానిక ప్రభుత్వం నుంచి మినహాయింపులు, ధ్రువీకరణ పత్రాలు పొందడంతోపాటు పైలెట్, మెకానిక్ శిక్షణ వంటి వాటిల్లో మారుత్ డ్రోన్స్‌ది కీలకపాత్ర. ఎయిర్ ట్యాక్సీలకు నెట్‌వర్క్‌లను కనెక్ట్ చేయడం, కస్టమర్లను గుర్తించడం, ఎయిర్‌ఫీల్డ్‌ల భద్రత, అవసరమైన మౌలిక సదుపాయాలకు సహకరించడం వంటివి వాటిలోనూ భాగస్వామ్యమవుతుంది. -
వచ్చేది జగనన్న పాలనే
వీఆర్‌పురం (రంపచోడవరం) : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుం దని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనను పార్టీ అధినేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి తీసుకువస్తారని ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ (బాబు) అన్నారు. మండలంలోని వడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వంద కుటుంబాలు గురువారం ఆయన సమక్షంలో పార్టీలోకి చేరాయి. బాగుల రామచంద్రం, బొర్రా రామారావు, రేవు శ్రీరామ్ ఆధ్వర్యంలో వారందరూ పార్టీలో చేరారు. అనంతరం అనంతబాబు మాట్లాడుతూ ఊరంతా ఒకేసారి కదిలిరావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీపై వచ్చిన వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పొడియం గోపాల్, జిల్లా కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మాచర్ల గంగులు ,ఆవుల మరియాదాస్, బత్తుల సత్యనారాయణ, ఇతర నాయకులు పత్తిగుళ్ల రామాంజనేయులు, జల్లేపల్లి రామన్నదొర, కొవ్వూరు శివయాదవ్, మామిడి బాలాజీ, మడకం జోగమ్మ, బొడ్డు సత్యనారాయణ, రేవు బాలరాజు, మాచర్ల వెంగళరావు, చీమల కాంతారావు, పూల శ్రీనివాస్, కాపారపు వినోద్, ముత్యాల సాయి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో డిజిధన్ మేళా
కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా జిల్లాలో డిజిధ¯ŒS మేళా ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ కోర్టు హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే ఈ మేళాలో వివిధ బ్యాంకులు, మొబైల్ ఏప్‌లు నిర్వహించే సంస్థలు పాల్గొని నగదు రహిత లావాదేవీలు, వాటి ప్రయోజనాలు తెలియజేస్తాయన్నారు. ఈ మేళాకు జిల్లాలోని గ్రామ సర్పంచ్‌లు, గ్రామ సమాఖ్యల ప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారన్నారు. మేళాను ఫిబ్రవరి మొదటి లేదా రెండోవారంలో నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు అంగీకరించాలని లేనిపక్షంలో అటువంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రయ్యను ఆదేశించారు. ఒకటి నుంచి ఈ–ఆఫీసు విధానం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మండల స్థాయి కార్యాలయాల్లో ఈ–ఆఫీసు విధానం అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలకు 1200 బయోమెట్రిక్ పరికరాలు రాగా, వాటిలో 600 వివిధ సంస్థలకు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలలో దశలవారీగా ఎల్ఈడీ లైట్లు అమర్చాలని సూచించారు. రక్షిత నీటి సరఫరా పథకాలకు విద్యుత్ చార్జీల బకాయిలు చెల్లించాలని, ఈ లోగా విద్యుత్‌ను తొలగించవద్దని ట్రా¯Œ్సకో అధికారులకు సూచించారు. జిల్లాలో రెండు గ్రామాల్లో అన్ని గృహాలకు కుళాయిలు కల్పించి, వాటిని ఆదర్శ గ్రామాలుగా రూపొందించాలన్నారు. జేసీ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 రాధాకృష్ణమూర్తి, డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, జిల్లాపరిషత్ సీఈఓ కె.పద్మ, ఆర్అండ్బీ ఎస్ఈ సీఎస్ఎ¯ŒS మూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేశ్వరరావు, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, బీసీ కార్పొరేష¯ŒS ఈడీ ఎం.జ్యోతి, సీపీఓ మోహ¯ŒSరావు పాల్గొన్నారు. రానున్న రెండు నెలల్లో అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ రానున్న రెండు మాసాల్లో అన్ని మండలాల్లో ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ముమ్మర స్థాయిలో చేపట్టాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మండల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ మండల, డివిజనల్ అధికారులతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించి వివిధ అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభించిన ఫారమ్ పాండ్లన్నింటినీ పూర్తి చేయాలని, ఇంకా గ్రౌండ్ కాని వాటినన్నింటినీ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మెట్ట ప్రాంతంలో ఈ రెండు నెలల్లో లాండ్ డెవలప్మెంట్ పనులు ముమ్మరంగా నిర్వహించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఓడీఎఫ్ గ్రామాల సాధన అంశాలలో ఎండీఓల పురోగతి ఆధారంగా వారికి ఏ, బీ,సీ,డీ గ్రేడులు కేటాయించామన్నారు. ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీకి ఎండీఓలు మంగళవారం సొమ్మును బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవాలని ఆదేశించారు.