- కలెక్టర్ అరుణ్‌కుమార్
త్వరలో డిజిధన్ మేళా
Published Mon, Jan 30 2017 11:43 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కాకినాడ సిటీ :
నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహంలో భాగంగా జిల్లాలో డిజిధ¯ŒS మేళా ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. సోమవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ కోర్టు హాలులో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహించే ఈ మేళాలో వివిధ బ్యాంకులు, మొబైల్ ఏప్‌లు నిర్వహించే సంస్థలు పాల్గొని నగదు రహిత లావాదేవీలు, వాటి ప్రయోజనాలు తెలియజేస్తాయన్నారు. ఈ మేళాకు జిల్లాలోని గ్రామ సర్పంచ్‌లు, గ్రామ సమాఖ్యల ప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటారన్నారు. మేళాను ఫిబ్రవరి మొదటి లేదా రెండోవారంలో నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రులు, డయాగ్నొస్టిక్ సెంటర్లలో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు అంగీకరించాలని లేనిపక్షంలో అటువంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ చంద్రయ్యను ఆదేశించారు.
ఒకటి నుంచి ఈ–ఆఫీసు విధానం
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మండల స్థాయి కార్యాలయాల్లో ఈ–ఆఫీసు విధానం అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలకు 1200 బయోమెట్రిక్ పరికరాలు రాగా, వాటిలో 600 వివిధ సంస్థలకు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలలో దశలవారీగా ఎల్‌ఈడీ లైట్లు అమర్చాలని సూచించారు. రక్షిత నీటి సరఫరా పథకాలకు విద్యుత్ చార్జీల బకాయిలు చెల్లించాలని, ఈ లోగా విద్యుత్‌ను తొలగించవద్దని ట్రా¯Œ్సకో అధికారులకు సూచించారు. జిల్లాలో రెండు గ్రామాల్లో అన్ని గృహాలకు కుళాయిలు కల్పించి, వాటిని ఆదర్శ గ్రామాలుగా రూపొందించాలన్నారు. జేసీ ఎస్.సత్యనారాయణ, జేసీ–2 రాధాకృష్ణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, జిల్లాపరిషత్ సీఈఓ కె.పద్మ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సీఎస్‌ఎ¯ŒS మూర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రాజేశ్వరరావు, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, బీసీ కార్పొరేష¯ŒS ఈడీ ఎం.జ్యోతి, సీపీఓ మోహ¯ŒSరావు పాల్గొన్నారు.
రానున్న రెండు నెలల్లో అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ
రానున్న రెండు మాసాల్లో అన్ని మండలాల్లో ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ముమ్మర స్థాయిలో చేపట్టాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మండల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ మండల, డివిజనల్ అధికారులతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించి వివిధ అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభించిన ఫారమ్ పాండ్లన్నింటినీ పూర్తి చేయాలని, ఇంకా గ్రౌండ్ కాని వాటినన్నింటినీ వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మెట్ట ప్రాంతంలో ఈ రెండు నెలల్లో లాండ్ డెవలప్‌మెంట్ పనులు ముమ్మరంగా నిర్వహించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఓడీఎఫ్ గ్రామాల సాధన అంశాలలో ఎండీఓల పురోగతి ఆధారంగా వారికి ఏ, బీ,సీ,డీ గ్రేడులు కేటాయించామన్నారు. ఫిబ్రవరి నెల పింఛన్ల పంపిణీకి ఎండీఓలు మంగళవారం సొమ్మును బ్యాంకుల నుంచి డ్రా చేసుకోవాలని ఆదేశించారు.
Advertisement
Advertisement