వచ్చేది జగనన్న పాలనే
Published Fri, Apr 28 2017 12:37 AM | Last Updated on Tue, Jun 4 2019 5:58 PM
వీఆర్‌పురం (రంపచోడవరం) :
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుం దని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనను పార్టీ అధినేత జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి తీసుకువస్తారని ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ భాస్కర్ (బాబు) అన్నారు. మండలంలోని వడ్డిగూడెంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వంద కుటుంబాలు గురువారం ఆయన సమక్షంలో పార్టీలోకి చేరాయి. బాగుల రామచంద్రం, బొర్రా రామారావు, రేవు శ్రీరామ్ ఆధ్వర్యంలో వారందరూ పార్టీలో చేరారు. అనంతరం అనంతబాబు మాట్లాడుతూ ఊరంతా ఒకేసారి కదిలిరావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీపై వచ్చిన వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పొడియం గోపాల్, జిల్లా కార్యదర్శి ముత్యాల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మాచర్ల గంగులు ,ఆవుల మరియాదాస్, బత్తుల సత్యనారాయణ, ఇతర నాయకులు పత్తిగుళ్ల రామాంజనేయులు, జల్లేపల్లి రామన్నదొర, కొవ్వూరు శివయాదవ్, మామిడి బాలాజీ, మడకం జోగమ్మ, బొడ్డు సత్యనారాయణ, రేవు బాలరాజు, మాచర్ల వెంగళరావు, చీమల కాంతారావు, పూల శ్రీనివాస్, కాపారపు వినోద్, ముత్యాల సాయి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement