commissioner mahender reddy
-
టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్
సిటీబ్యూరో: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఈ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధిస్తూన్నట్లు కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 నుంచి 30 వరకు అమలులో ఉండే వీటి ప్రకారం ఆ ప్రాంతాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడ కూడదు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి భవనాలకు రెండు కిమీ పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు. ఈ నెల 10 నుంచి 16 వరకు ఇవి అమలులో ఉంటాయని కొత్వాల్ తెలిపారు. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి గురువారం పోలింగ్ జరుగనుంది. దీంతో పోలింగ్ స్టేషన్ల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాల వద్ద పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఓటరూ విధిగా క్యూలోనే రావాలని, ఒకరికి కేటాయించిన క్యూలోకి మరొకరిని అనుమతించమని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఈ నెల 31న మద్యం బంద్
సాక్షి, సిటీబ్యూరో: బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 వరకు నగరంలోని స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్బుల మినహా ఎక్కడా మద్యం విక్రయించకూడదని ఆయన స్పష్టం చేశారు. -
నేరాల సంఖ్య 14 శాతం తగ్గించాం
పంజగుట్ట: గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నేరాల సంఖ్య 14 శాతం తగ్గించగలిగామని నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. ఎర్రమంజిల్‌లో సీసీ కెమెరాల మానిటరింగ్ సిస్టమ్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి విద్యుత్సౌధా మీదుగా తాజ్‌కృష్ణా వరకు, జీవీకే మాల్ వద్ద నుంచి తాజ్ డక్కెన్ మీదుగా కేసీపీ జంక్షన్ వరకు పర్యవేక్షించే విధంగా 46 కెమెరాలను ఏర్పాటు చేశారు. 9 మంది దాతల సాయంతో 26.50 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు చేశారు. మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రారంభించిన అనంతరం పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడారు. గతేడాది కంటే నేరాల సంఖ్య తగ్గిందని, దీనికి సీసీ టీవీలు, పీడీ యాక్ట్ ప్రయోగమే కారణమని ఆయన అన్నారు. కొత్తగా ఐడెటిఫికేషన్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చామని, పాతనేరస్తుడు మళ్లీ ఏదైనా నేరం చేస్తే ఈ సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్ అతడ్ని పట్టిస్తుందన్నారు. ఈ సందర్భంగా కెమెరాల ఏర్పాటుకు సహకరించిన జీవీకే గ్రూప్, బీఎండబ్లు్య షోరూం, కాన్కార్డ్ మోటార్స్‌ను ఆయన అభినందించారు. కెమెరాల ఆవశ్యకతను దాతలకు వివరించి, వారు ఆర్థిక సహాయం చేసేందుకు కృషి చేసిన ఎస్సై బ్రహ్మమురారిని కమి షనర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటేశ్వర రావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్, డీఐ లక్ష్మీనారాయణ, అడ్మిన్ ఎస్సై నాగరాజు, ఎస్సైలు దాతలు తదితరుల పాల్గొన్నారు. -
కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు ప్రారంభం
హైదరాబాద్: కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టును హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గురువారం ఉదయం మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని మొత్తం ఆరు ప్రాంతాల్లో 60 కెమెరాలు ఏర్పాటయ్యాయి. ముందుగా ఉమానగర్‌లో ఏర్పాటు చేసిన 15 కెమెరాలను సీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. వైట్‌హౌస్ ప్రాంతంలో 10, లైఫ్ స్టయిల్ భవనంలో 15, హెచ్‌టీసీ సాఫ్ట్వేర్ సంస్థలో 4, కుందన్‌బాగ్‌లో 6, మెథడిస్ట్ కాలనీలో పది చొప్పున సీసీ కెమెరాలు పనిచేయనున్నాయి. రూ.43 లక్షల ఖర్చుతో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
అవతరణ కళ
రసూల్‌పురా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో భారీ భద్రత చర్యలు చేపట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పరేడ్ మైదానాన్ని పరిశీలించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో కలసి భద్రతా చర్యలపై చర్చించారు. భద్రత కోసం మూడువేల మంది పోలీసులు, అధికారులను వినియోగిస్తున్నట్టు తెలిపారు. పోలీసులు ఇప్పటికే మైదానాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలనిప్రజలకు సూచించారు. వీవీఐపీ, వీఐపీల రాకపోకలను పురస్కరించుకుని ట్రాఫిక్ మళ్లించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయలో... నాంపల్లి: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో నిర్వహించేఈ ఉత్సవాలు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా తెలంగాణ తేజోమూర్తులు అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేయనున్నారు. 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు తెలంగాణ నృత్య రీతులపై సదస్సు, సాయంత్రం 5గంటలకు డాక్టర్ జి.ఎం.రామశర్మ అష్టావధానం ఉంటుంది. 4న ఉదయం 10.30గంటలకు ‘తెలంగాణ చరిత్ర-సంస్కృతి-వినూత్నాంశాలు’పై సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. 5న ఉదయం 10.30 గంటలకు ‘తెలంగాణ పత్రికలు-గోలకొండ పత్రిక విశిష్టత’పై సదస్సు జరుగుతుంది. ప్రముఖ పత్రికా సంపాదకులు ఈ సదస్సులో పాల్గొంటారు. 6వ తేదీ ఉదయం ‘తెలంగాణ సాహిత్యం-అనువాద ఆవశ్యకత’పై సదస్సు నిర్వహిస్తారని తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి తెలిపారు. గన్పార్క ముస్తాబు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు గన్‌పార్క్ ముస్తాబవుతోంది. జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా నాంపల్లి అసెంబ్లీ ఎదురుగా ఉండే అమరవీరుల స్థూపాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏర్పాట్లు ఆదివారం ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. స్థూపాన్ని రంగురంగుల పూలతో అలంకరిస్తున్నారు. గన్‌పార్క్ చుట్టూ కాంతులు విరజిమ్మేలా విద్యుద్దీపాలను అమర్చారు. ఇక్కడ వారం రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. రాజకీయ నాయకులు, విద్యార్థి, ఉపాధ్యాయ, జర్నలిస్టు, ఉద్యోగ సంఘాల నాయకులు ఇక్కడకు రానున్నారు.