టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్
Published Tue, Mar 7 2017 9:38 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
సిటీబ్యూరో: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభంకానున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఈ పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధిస్తూన్నట్లు కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 నుంచి 30 వరకు అమలులో ఉండే వీటి ప్రకారం ఆ ప్రాంతాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది ఒక చోట గుమిగూడ కూడదు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి భవనాలకు రెండు కిమీ పరిధిలో నిషేధాజ్ఞలు విధించారు.
ఈ నెల 10 నుంచి 16 వరకు ఇవి అమలులో ఉంటాయని కొత్వాల్ తెలిపారు. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి గురువారం పోలింగ్ జరుగనుంది. దీంతో పోలింగ్ స్టేషన్ల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాల వద్ద పురుషులకు, స్త్రీలకు వేర్వేరుగా క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఓటరూ విధిగా క్యూలోనే రావాలని, ఒకరికి కేటాయించిన క్యూలోకి మరొకరిని అనుమతించమని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
Advertisement
Advertisement