Committee of Janmabhoomi
-
కాపు రుణాల మంజూరు.. పక్కా మోసం
► ప్రకటించింది రూ.2 లక్షలు.. ఇచ్చేది రూ.60 వేలు ► తీవ్ర అసంతృప్తిలో కాపు నాయకులు నెల్లూరు(సెంట్రల్): రుణాల మంజూరు విషయంలో ప్రభుత్వం కాపులను పక్కాగా మోసం చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కాపులను ఆదుకోవడానికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఇస్తామని చెప్పి సర్కారు మాటలు నీటిమూటలయ్యాయి. తీరా రుణం కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత ఒక్కొక్కరికి ఇచ్చేది రూ.60 వేలు మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. దీంతో దరఖాస్తుదారులు అవాక్కవుతున్నారు. ఇంత మోసమా అంటూ కాపు నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లెక్క ఇలాగా.. కాపు కార్పొరేషన్ కింద సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాకు రూ.7 కోట్లు కేటాయించింది. 2462 మందికి రుణాలు ఇస్తామని ప్రకటలు గుప్పించింది. దీంతో జిల్లాలో కాపు వర్గానికి చెందిన 12,714 మంది దరఖాస్తులు చేసుకున్నారు. తీరా కాపు కార్పొరేషన్ తరపున లబ్ధిదారులకు వచ్చే సబ్సిడీ రుణం ఎంతో తెలిసి నోరు వెళ్లబెడుతున్నారు. మొత్తం బ్యాంకు ఇచ్చే నగదు రూ. 60 వేలు సబ్సిడీ రుణం కాగా అందులో కాపు కార్పొరేషన్ ఇచ్చేది రూ.30 వేలు సబ్సిడీ మాత్రమే. అందుకు గాను జన్మభూమి కమిటీ ఆమోద ముద్ర తప్పని సరిగా పెట్టారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొం దాలంటే కనీసం జన్మభూమి కమిటీకి కొంత ముట్టచెప్పాలి. ఇక దరఖాస్తులు చేసుకోవడానికి, కుల ధ్రువీకరణ పత్రం, రుణం ఫైనల్ చేసుకునే సరికి లబ్ధిదారునికి సుమారు రూ.10 వేల వరకు ఖర్చువుతోందని తెలిసింది. లబ్ధిదారుని చేతికి వచ్చేది ఇక రూ.20 వేలు మాత్రమే. విసిగిపోతున్న దరఖాస్తుదారులు అటు జన్మభూమి కమిటీల పెత్తనం, మరో పక్క చాలా వరకు బ్యాంకుల నుంచి తలనొప్పులు ఎదురౌతున్నాయని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రుణాలు మాబ్యాంకు నుంచి ఇస్తున్నాం.. జన్మభూమి కమిటీల పెత్తనం ఏమిటని పలువురు బ్యాం క్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ రుణాలు ఇస్తుందని, తమను కమిటీ సభ్యులుగా నియమించిందని తాము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని కమిటీ సభ్యుల హుకుం జారీ చేస్తున్నారు. అటు బ్యాంకు అధికారులు, ఇటు కమిటీ సభ్యుల మధ్య కోల్ట్వార్తో దరఖాస్తుదారులు విసిగిపోతున్నారు. బ్యాంకు ల, కమిటీ సభ్యుల చుట్టూ తిరగలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే బీసీ కార్పొరేషన్ ఈడీ మాత్రం ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని కాపు నాయకులు ఆరోపిస్తున్నారు. ఒక జిల్లా అధికారి కనీ సం రుణాల విషయంలో జోక్యం చేసుకోకుండా మౌ నంగా చూస్తుండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కాపులను రుణాల పేరుతో ప్రభుత్వం మోసం చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. -
అట్రాసిటీ కేసు నమోదుతో టీడీపీ నేత హైడ్రామా
కుటుంబంతో సహా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ వైనం అడ్డుకున్న పోలీసులు సంగం (ఆత్మకూరురూరల్) : గ్రామంలో తనపై కక్ష కట్టి అట్రాసిటీ కేసు నమోదు చేశారని కుటుం బసమేతంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని జన్మభూమి కమిటీ మెంబరు నానా యాగీ చేసిన సంఘటన సంగం మండలం పడమటిపాళెంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. పడమటిపాళెం గ్రామానికి చెందిన షేక్ రసూల్, అతని సోదరులపై మంగళవారం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు కులం పేరుతో దూషించారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు. సంగం ఎస్సై వేణు కేసు నమోదు చేసుకున్నారు. దీంతో రసూల్, తనపై కక్ష కట్టి ఎలాంటి నేరం చేయకున్నా అట్రాసిటీ కేసు నమోదు చేయడం దారుణమని, తనకు అవమానం జరిగిందని ఇంటి చుట్టుప్రక్కల వారికి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బుధవారం తనకు న్యాయం జరగదని భావించి కుటుంబ సమేతంగా భార్య, ఇద్దరు పిల్లలతో గృహ నిర్భందం చేసుకున్నాడు. ఇంటి లోపల తలుపులు బిగించుకొని ఆత్మహత్యకు పాల్పడుతున్నామని అందరికీ చెప్పడంతో సమీపంలోని వారు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఎస్సై, బుచ్చిరెడ్డిపాళెం సీఐ గంగా వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అవకాశం లేకపోవడంతో కిటికీ వద్ద నుంచి రసూల్‌తో మాటలు కలిపా రు. తాను న్యాయం చేస్తానని, ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని ఎస్సై హామీ ఇవ్వడంతో కిటికీ తలుపులు తెరిచి పోలీసు సిబ్బందితో రసూల్ మాట్లాడాడు. ఈ తరుణంలో వెనుకవైపు నుంచి పోలీసు సిబ్బంది లోపలికి ప్రవేశించి ఒంటిపై కిరోసిన్ పోసుకోబోతున్న కుటుంబ సభ్యులను తప్పించారు. అందర్నీ వెలుపలికి తీసుకువచ్చి ఎలాంటి కేసులు నమోదుచేయబోమని, అట్రాసిటీ కేసుపై పూర్తిస్థాయిలో విచారిస్తామని హామీ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. -
రుణమాఫీ పరిశీలన వేగవంతం చేయాలి
ఒంగోలు టౌన్ : రైతులకు సంబంధించిన రుణమాఫీ జాబితా పరిశీలనను వేగవంతం చేయాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో రుణమాఫీ అమలుపై బుధవారం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తహశీల్దార్లు రుణమాఫీ జాబితాను వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నుంచి సీడీ రూపంలో తీసుకుని పరిశీలన కోసం ఈ నెల 13వ తేదీకి జన్మభూమి కమిటీకి పంపించాలని ఆదేశించారు. జిల్లాలో 7 లక్షల మంది రైతులు అర్హులు కాగా, రేషన్, ఆధార్ కార్డులు లేని జాబితాను పునఃపరిశీలించి అర్హుల జాబితాను తయారు చేయాలని కోరారు. రైతు రుణమాఫీ రూ.1.50 లక్షలుగా ప్రకటించినందున వ్యక్తిగతంగా కాకుండా కుటుంబం నేపథ్యంలో పరిశీలన జరగాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పరిశీలనను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే. యాకూబ్ నాయక్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాష్‌కుమార్, ఎన్ఐసీ డీఐఓ మోహన్‌కృష్ణ, ఉద్యానశాఖ ఏడీ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
49 లక్షల ఖాతాలకే రుణమాఫీకి అర్హత
-
ఖాతాలు ఖతం
రైతన్నల జీవితాలతో ప్రకృతే కాదు ... పాలకులూ ఆడుకుంటున్నారు. అధికార దాహంతో అడ్డగోలుగా హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసిన చందంగా పాలన సాగిస్తుండడంతో అన్నదాతలు అవస్థల పాలవుతున్నారు. రుణం కట్టాలంటూ బ్యాంకర్లు ... ఆధార్, రేషన్ కార్డుల పేరుతో తొలగింపులకు పాల్పడుతుండడంతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. * 1.50 లక్షల ఖాతాల తిరస్కరణ? * జన్మభూమి కమిటీలో తుది నిర్ణయం * మళ్లీ రైతుల్లో టెన్షన్ ఒంగోలు: రైతుల్లో మళ్ళీ టెన్షన్ ప్రారంభమైంది. రుణమాఫీకి సంబంధించి తాజాగా జిల్లాలో 1.50 లక్షల ఖాతాలు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. జన్మభూమి మండల కమిటీకి పంపి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల కమిటీలు మళ్లీ వాటిని గ్రామసభలకు పంపి వారు ఇచ్చే నివేదికపై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించడంతో రైతుల్లో మళ్ళీ టెన్షన్ మొదలైంది. రుణమాఫీకి సంబంధించి అక్టోబరు 19వ తేదీనాటికి బ్యాంకర్లు తాము సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాలలో ప్రభుత్వం సూచించిన ఏపీ స్టేట్ రెసిడెన్షియల్ డేటా హబ్ (ఏపీఎస్‌ఆర్‌డీహెచ్)లో అప్లోడ్ చేశారు. ఆధార్ కార్డును జతపరచకపోవడంతో ప్రాథమికంగా 15631 ఖాతాలను ఏపీఎస్‌ఆర్‌డీహెచ్ ప్రాథమిక దశలోనే తొలగించింది. అవిపోను మిగిలిన మొత్తం రుణమాఫీకి అర్హత పొందిన ఖాతాల సంఖ్య 6,81,276 . కానీ తరువాత మరికొద్ది రోజులు గడువు ఇవ్వడంతో 19019మంది తమ ఆధార్, రేషన్ కార్డులను జతచేశారు. దీంతో మొత్తం రుణమాఫీకి అర్హత పొందిన ఖాతాల సంఖ్య 7,00,295కి చేరింది. రుణమాఫీకి సంబంధించి ఆధార్ కార్డు తప్పనిసరిగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా రేషన్ కార్డును కూడా పొందుపరిచారు. ఒకే కుటుంబంలో ఒక్కరికే రుణం వర్తిస్తుందంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆధార్ నెంబర్, రేషన్‌కార్డులోని సభ్యుల వివరాలను పోల్చుకోవడం ద్వారా కొంతమందిని రుణమాఫీని తొలగించాలనేది ప్రభుత్వం లక్ష్యం. తాజాగా మరికొన్ని రోజులు అవకాశం కల్పించడంతో తాజాగా మరో చిక్కు వచ్చి పడింది. ఏపీస్టేట్ రెసిడెన్షియల్ డేటా హబ్ పరిశీలించిన వాటిలో బ్యాంకర్లు పంపే సమయంలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు గుర్తించారు. దీంతో వాటిని సరిచేసి తిరిగి పంపాలంటూ ఇప్పటికే బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో పరిశీలిస్తే కొండెపి, తర్లుపాడు, ఉప్పలపాడు, వలేటివారిపాలెం, కొమరోలుతోపాటు పీడీసీసీబీకి చెందిన ఎనిమిది ఖాతాలు కూడా రూ10 లక్షలపైన రుణాలు తీసుకున్నట్లు ఏపీఎస్ఆర్డీహెచ్కు పంపించారు. అయితే వాస్తవానికి వారు అంత మొత్తం రుణం తీసుకొని ఉండరనేది ఏపీఎస్‌ఆర్‌డీహెచ్ భావన. దీంతో పొరపాటు జరిగి ఉంటుందని భావించి వాటిని పరిశీలించి పంపాలంటూ ఆదేశించారు.