committee meeting
-
జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్న ధరణి పోర్టల్ కమిటీ
-
ద్రవ్యోల్బణం.. తీవ్ర అనిశ్చితే
ముంబై: అస్థిరత, అనిశ్చిత ఆహార ధరల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం– అవుట్‌లుక్ తీవ్ర అస్పష్టంగా ఉందని ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. శక్తికాంత దాస్ నేతృత్వంలో డిసెంబర్ 6 నుండి 8 వరకూ జరిగిన ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశ మినిట్స్ శుక్రవారం విడుదలయ్యింది. ద్రవ్యోల్బణ ఆందోళనలను ఉటంకిస్తూ కీలక వడ్డీ రేటు (బ్యాంకులు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో) 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా ఈ సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కూరగాయల ధరల తీవ్రత వల్ల ఆహార ద్రవ్యోల్బణం పుంజుకునే వీలుందని ఈ సమావేశంలో గవర్నర్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్య పరపతి విధాన వైఖరిలో ఏదైనా మార్పు ఉంటే అది ప్రమాదకరమని దాస్ ఉద్ఘాటించారు. -
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి అలక
-
మద్దతు ధరపై నాలుగు సబ్ గ్రూపులు
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం నియమించిన కమిటీ నాలుగు సబ్ గ్రూపులను ఏర్పాటు చేసింది. సోమవారం జరిగిన కమిటీ తొలి భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జీరో బడ్జెట్ ఆధారిత సాగు, దేశావసరాలకు అనుగుణంగా పంట విధానాల మార్పు, మద్దతు ధరను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చడం వంటి పలు అంశాలపై చర్చ జరిగినట్టు కమిటీ సభ్యుడు బినోద్ ఆనంద్ మీడియాకు తెలిపారు. ‘‘హిమాలయ రాష్ట్రాల్లో పంటల తీరుతెన్నులపై ఒక సబ్ గ్రూపు, సూక్ష్మ సాగును రెండోది, జీరో బేస్డ్ సాగును మూడోది, దేశవ్యాప్తంగా పంటల తీరుతెన్నులు, పంటల వైవిధ్యాన్ని నాలుగో సబ్ గ్రూపు అధ్యయనం చేసి నివేదికలు అందజేస్తాయి’’ అని వివరించారు. ముందుగా ప్రకటించినట్టుగానే సంయుక్త కిసాన్ మోర్చా ఈ భేటీకి దూరంగా ఉంది. ఇదీ చదవండి: రైతుల ‘మహాపంచాయత్’ -
ప్రపంచ నేతగా భారత్! ప్రధాని మోదీ అభిలాష
న్యూఢిల్లీ: కరోనా కల్లోలం ముగిసిన తర్వాత భారత్ ప్రపంచ నాయకురాలిగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047కు నూతన లక్ష్యాలతో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ రెండో సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ఆన్లైన్లో ప్రసంగించారు. కరోనా ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిందని, మూస భావనలను ధ్వంసం చేసిందని, దీనివల్ల భవిష్యత్‌లో ప్రపంచానికి కొత్త నాయకత్వం ఆవిర్భవించే అవకాశాలు పెరిగాయని చెప్పారు. 21వ శతాబ్దం ఆసియాదని అందరూ అంటారని, అయితే ఇందులో భారత్ స్థానంపై అందరం దృష్టి సారించాలని సూచించారు. దేశ స్వాతంత్య్ర శతసంవత్సరోత్సవాల నాటికి తగిన లక్ష్యాలను రూపొందించుకోవాలన్నారు. భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు అందరూ ఎవరి బాధ్యతలు వాళ్లు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. భవిష్యత్ ఎప్పుడూ గతంపైనే ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం మన పూర్వీకుల త్యాగఫలమని గుర్తించాలన్నారు. ఈ జాతీయ కమిటీలో లోక్‌సభ స్పీకర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులున్నారు. ప్రస్తుత సమావేశంలో మాజీ ప్రధాని దేవేగౌడ, గవర్నర్లు ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఆచార్య దేవవ్రత్, సీఎంలు వైఎస్ జగన్, యోగి ఆదిత్యనాధ్, అశోక్ గెహ్లాట్, బీజేపీ అధిపతి నడ్డా, ఎన్సీపీ అధిపతి శరద్ పవార్, ప్రముఖ గాయనీమణి లతా మంగేష్కర్, నటుడు రజనీకాంత్ తమ అభిప్రాయాలు వెల్లడించారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్‌గా పనిచేసి ప్రజల్లో ఎండగట్టాలని, టీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చి అమలు చేయలేని అన్ని అంశాలపై పోరాటాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం నిర్ణయించింది. నిరుద్యోగ అంశంతోపాటు ఇతర అన్ని ప్రజాసమస్యలపై పోరాట కార్యాచరణను రూపొందించాలని తీర్మానించింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకమైన తర్వాత శనివారం పీఏసీ తొలి సమావేశం గాంధీభవన్‌లో జరిగింది. కమిటీ చైర్మన్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ కన్వీనర్, మాజీమంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, అజారుద్దీన్, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్య, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీమంత్రులు రేణుకాచౌదరి, బలరాం నాయక్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, వంశీ చంద్‌రెడ్డిలు హాజరు కాగా, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ గైర్హాజరయ్యారు. మరో వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ అనారోగ్య కారణాలతో హాజరుకాలేదు. గత రెండు నెలల కార్యక్రమాలు భేష్ రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజాసమస్యలు, భారత్‌బంద్, పోడు భూములపై పోరు తదితర అంశాలు పీఏసీలో చర్చకు వచ్చాయి. గత రెండు నెలలుగా జరుగుతున్న పార్టీ పోరాట కార్యాచరణ బాగుందని, అయితే దీన్ని మరింత ఉధృతం చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో నిలదీయాలని, అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు నిరుద్యోగ సమస్యపై ఉద్యమించాలని నిర్ణయించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఈ అన్ని అంశాలను లేవనెత్తి పరిష్కారమయ్యే దిశలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ నెల 27న దేశవ్యాప్తంగా జరగబోయే ‘భారత్‌బంద్’ను ప్రధాన ప్రతిపక్షంగా ముందుండి నడిపించాలని నిర్ణయించారు. అక్టోబర్ 5న పోడు భూముల హక్కుల సాధన కోసం ప్రతిపక్షాలు నిర్వహించ తలపెట్టిన 400 కిలోమీటర్ల రాస్తారోకోలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని తీర్మానించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. కాగా, సమావేశం అనంతరం రేవంత్, భట్టి, మధు యాష్కీగౌడ్, చిన్నారెడ్డి, మల్లురవి విలేకరులతో మాట్లాడారు. భట్టి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని తీర్మానించినట్టు వెల్లడించారు. పంజగుట్టలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున తామే ఏర్పాటు చేస్తామని తెలిపారు. పలువురు నేతలు.. పలు సూచనలు సమావేశంలో నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ డ్వాక్రా మహిళల సమస్యల గురించి ప్రస్తావించారు. వారికి కొత్తరుణాలివ్వడంలోనూ, ఇచ్చిన రుణాలకు వడ్డీ చెల్లింపులోనూ, అభయహస్తం అమల్లోనూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని, ఆ దిశలో కార్యాచరణ రూపొందించాలని నేతలు నిర్ణయించారు. పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, బీసీ గర్జన పేరుతో బహిరంగసభలు ఏర్పాటు చేయాలని వీహెచ్ సూచించారు. కాగా, సీనియర్ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డిలను కూడా పీఏసీ సమావేశానికి ఆహ్వానించాలని వీహెచ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరిలు ప్రతిపాదించారు. కాగా, పీఏసీ కన్వీనర్‌గా మాజీమంత్రి షబ్బీర్ అలీ ఈ సమావేశంలోనే బాధ్యతలు స్వీకరించారు. సమావేశం అనంతరం హైదరాబాద్‌లో ఆయన పార్టీ నేతలకు విందు ఇచ్చారు. -
కొనసాగుతున్న ఆర్టీసీ కమిటీ సమవేశం
-
అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ
-
టీడీపీలో ఆధిపత్య పోరు
పెనమలూరు: టీడీపీ కార్యకర్తలు రచ్చకెక్కారు. దివంగత ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా బాహాబాహీకి దిగారు. గొడవలో టెంట్ నేలకూలటంతో కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు. ఇక ఎమ్మెల్యే కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కానూరులో ఇద్దరు నాయకులు కానూరులో ఎవరికి ప్రాధాన్యత అనే విషయమై గొడవ పడ్డారు. వివరాలు.. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గురువారం కానూరులో టీడీపీ గ్రామ అధ్యక్షుడు దోనేపూడి రవికిరణ్ అధ్యక్షతన కార్యక్రమాలు చేపట్టారు. సనత్‌నగర్‌లో రవి, రామాలయం వద్ద వెలగపూడి శంకరబాబు వర్ధంతి కార్యక్రమాలు చేశారు. ఈ టెంట్‌కు పక్కనే టీడీపీ మండల కార్యదర్శి షేక్ బుజ్జి, సేవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి రవితో పాటు ఆయతో ఉన్న వారు రావాలని శంకరబాబు కోరగా, తమకు చెప్పకుండా కార్యక్రమం పెట్టడమేమిటని రవి ప్రశ్నించాడు. దీంతో అక్కడే ఉన్న షేక్ బుజ్జీ స్పందించి పార్టీ ప్రతిపక్షంలో ఉండగా పదేళ్లు పోరాటం చేశామని, ఇప్పుడు పార్టీలోకి వచ్చి తమకు చెబుతారా అని వీరంగం వేశాడు. మాటామాట పెరగటంతో రాయలేని విధంగా బూతులు తిట్టుకున్నారు. ఈ గందరగోళంలో టెంట్ కూలిపోవటంతో కార్యకర్తలు భయంతో పరుగులు తీశారు. పార్టీ గ్రామ అధ్యక్షుడిగా ఉన్న తనను దూషించాడని రవి, ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి బుజ్జిపై ఫిర్యాదు చేశాడు. దీని పై స్పందించిన ఎమ్మెల్యే ప్రసాద్ గ్రామాల్లో పార్టీ గ్రామ అధ్యక్షుడు చేసే కార్యక్రమాలు అధికార కార్యక్రమాలని చెప్పి నచ్చచెప్పారు. సమన్వయ కమిటీలో... ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రసాద్ అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పెదఓగిరాలకు చెందిన పిచ్చిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేకు ఫోన్ చేస్తే తీయటం లేదని, గుర్తింపు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ్రామంలోకి వస్తే కనీస సమాచారం ఉండటం లేదని కార్యకర్తలకు ఏమి సమాధానం చెప్పాలని నిలదీశారు. దుర్గగుడి పాలకమండలి సభ్యుడు వెలగపూడి శంకరబాబు మాట్లాడుతూ కానూరులో పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి కానూరు మాజీ సర్పంచి అన్నే వేణుగోపాలకృష్ణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామం ఎవరి సొత్తుకాదని, తాము 4 వేల సభ్యత్వాలు చేయించామని, ఎవరికి చేతైతే వారు చూసుకోవటమేనని అన్నారు. కాగా కానూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమనటంతో పార్టీలో గందరగోళం ఏర్పడింది. -
నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
-
నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చ సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు శుక్రవారం కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది. భేటీపై ఇప్పటికే బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ ఏపీ, తెలంగాణకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 11 గంటలకు జలసౌధలో జరిగే భేటీకి బోర్డు సభ్యకార్యదర్శి సమీర్‌ఛటర్జీతోపాటు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు హాజరుకానున్నారు. తమ తాగునీటి అవసరాలకుగానూ మొత్తంగా 17 టీఎంసీలు అవసరమని తెలిపిన ఏపీ, పోతిరెడ్డిపాడుకు 5 టీఎంసీలు, ముచ్చమర్రి ద్వారా హంద్రీనీవాకు 5, సాగర్ కుడి కాల్వలకు 7 టీఎంసీలు కావాలని కోరింది. నల్లగొండ, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లా తాగు నీటి అవసరాలకు 40.10టీఎంసీలు కావాలని తెలంగాణ కోరింది. కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా శ్రీశైలం ఎడమ కాల్వ పరిధిలో 40 వేలు, కల్వకుర్తి ప్రాజెక్టు కింద 1,500 క్యూసెక్కుల నీటిని తెలంగాణ అక్రమంగా తోడుకుంటోందని బోర్డుకు ఏపీ ఫిర్యాదు చేసింది. దీనిపై బోర్డు గురువారం తెలంగాణను వివరణ కోరింది. ఇక పోతిరెడ్డిపాడు ద్వారా చేస్తున్న వినియోగంపై ఇప్పటికే తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ అంశాలపై శుక్రవారం నాటి భేటీలో చర్చించే అవకాశం ఉంది. కాగా త్రిసభ్య కమిటీ భేటీలో ప్రస్తావనకు తేవాల్సిన అంశాలపై తెలంగాణ నీటి పారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్‌తో చర్చించారు. మిషన్ భగీరథతోపాటు వచ్చే జూన్ నాటికి అవసరమయ్యే నీటిని తీసుకునేలా ఒప్పించాలని సూచించారు. ప్రస్తుతం శ్రీశైలంలో 120 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో సాగర్‌కు తక్షణమే జలా లు విడుదల చేసేలా చూడాలని కోరాలని తెలిపారు. -
మోదీ అధ్యక్షతన బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ
-
13న జిల్లా సమన్వయ కమిటీ సమావేశం
హన్మకొండ అర్బన్ : జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈనెల 13 నిర్వహిస్తామని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశం ఉదయం 10 గంటలకు ప్రాంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి ఒక్కో శాఖ నుంచి ఒక్క అధికారి మాత్రమే హాజరుకావాలని పేర్కొన్నారు. -
పూర్తి కాని సెర్చ్
♦ అసంపూర్తిగా కమిటీ సమావేశం ♦ 6న మరోసారి సమావేశం ♦ వీసీ అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ ఏయూ క్యాంపస్: సెర్చ్ పూర్తి కాలేదు.. అలా అనే కంటే.. ప్రభుత్వం తరఫున సీఎం ఒక పేరు ఇంకా సూచించనందునే కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. దాంతో ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పదవికి అభ్యర్థి ఎంపికకు ఏప్రిల్ ఆరో తేదీన మరోసారి సమావేశం కావాలని సెర్చ్ కమిటీ నిర్ణయించింది. ఉపకులపతి ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీ తొలిసారి శుక్రవారం ఉదయం సమావేశమైంది. హైదరాబాదులో జరిగిన ఈ సమావేశానికి సభ్యులు అనందకృష్ణన్, రాజ్‌పాల్ సింగ్, సుమిత్రా దావ్రాలు హాజరయ్యారు. తమకు అందిన దరఖాస్తులను మధ్యాహ్నం 2 గంటల వరకు పరిశీలించినట్లు తెలిసింది. అయితే దరఖాస్తులు ఎక్కువగా రావడం, పరిశీలన పూర్తికాకపోవడంతో వచ్చేనెల ఆరో తేదీన మరోసారి భేటీ కావాలని సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. ఆ సమావేశంలో తుది జాబితా సిద్ధం చేసే అవకాశం ఉంది. కమిటీ తమకు అందిన దరఖాస్తులను పరిశీలించి వడపోసి ముగ్గురు పేర్లతో జాబితాను ముఖ్యమంత్రికి, అక్కడ నుంచి గవర్నర్‌కు పంపాల్సి ఉంది. అయితే వీసీ పదవికి వందకు పైగా దరఖాస్తులు అందాయి. వీటన్నింటినీ పరిశీలించడం పెద్దపనిగా మారింది. ఈ పని పూర్తి కాకపోవడంతో తుది జాబితా తయారీకి మరో సమావేశం నిర్వహించడం తప్పనిసరి అయ్యింది. కాగా వీసీ ప్యానల్ జాబితాకు ముఖ్యమంత్రి నుంచి ప్రభుత్వం తరపున ఒక పేరును సూచించాల్సిన అవసరం ఉంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ పదవిని ఎవరికి కేటాయించాలనే విషయంలో తుది నిర్ణయానికి రాలేకపోతున్నారని సమాచారం. సమావేశం అసంపూర్తిగా ముగియడానికి ఇదీ ఓ కారణమని తెలిసింది. సీఎం కార్యాలయం నుంచి ఖచ్చితమైన సమాచారం అందితే రానున్న సమావేశంలో ముగ్గురి పేర్లతో జాబితా సిద్ధం అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా గతంలో వీసీ ఎంపిక విషయంలోనూ సెర్చ్ కమిటీ పలుమార్లు సమావేశం కావడాన్ని వర్సిటీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రెండు పర్యాయాలు కమిటి సభ్యులు భేటీ అయిన తరువాతనే పేర్లు కొలిక్కి వచ్చిందంటున్నారు. ఈసారి కూడా అదే సంప్రదాయం కొనసాగుతోందని అంటున్నారు. -
రేపు కమలనాధన్ కమిటీ సమావేశం