నిందితుల అరెస్ట్
అనంతపురం సెంట్రల్ : స్థానిక నవోదయకాలనీకి చెందిన ముత్యాలమ్మ మృతి కేసులోని నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపర్చినట్లు వన్‌టౌన్ సీఐ రాఘవన్ తెలిపారు. గత నెల 23న ఇంటి ముందు కల్లాపి చల్లే విషయంలో ఎదురెదురుగా ఉన్న మహిళల మధ్య జరిగిన ఘర్షణలో ముత్యాలమ్మ తీవ్రంగా గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనలో నిందితులైన బోయ వరాలు, బోయ వరలక్ష్మి, లక్ష్మిదేవి, ఉమామహేశ్వరి, నరసమ్మ, రామచంద్ర, పోతన్నలను అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరిచి, రిమాండ్‌కు పంపినట్లు సీఐ వివరించారు.