Commonwealth Wrestling Championship
-
సుశీల్ పసిడి ‘పట్టు’
న్యూఢిల్లీ: మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో స్వర్ణం సాధించాడు. 74 కేజీల విభాగం ఫైనల్లో ఆకాశ్ ఖుల్లర్ (న్యూజిలాండ్)ను సుశీల్ చిత్తుగా ఓడించాడు. మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ 62 కేజీల విభాగం ఫైనల్లో 13–2తో తైలా తుహినే (న్యూజిలాండ్)ను ఓడించి స్వర్ణం దక్కించుకుంది. -
భారత రెజ్లర్ల పసిడి పట్టు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సింగపూర్లో ఆదివారం ముగిసిన ఈ ఈవెంట్లో చివరిరోజు భారత కుస్తీ వీరులు 8 స్వర్ణాలు, 8 రజతాలు సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టరుుల్ విభాగంలో హర్ఫుల్ (61 కేజీలు), బజరంగ్ (65 కేజీలు), జితేందర్ (74 కేజీలు), దీపక్ (86 కేజీలు), హితేందర్ (125 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు. వికాస్ (61 కేజీలు), రాహుల్ మాన్ (65 కేజీలు), సందీప్ (74 కేజీలు), అరుణ్ (86 కేజీలు), కృషన్ (125 కేజీలు) రజత పతకాలు గెలిచారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో రవీందర్ (59 కేజీలు), దీపక్ (71 కేజీలు), హర్దీప్ (98 కేజీలు) పసిడి పతకాలను కై వసం చేసుకున్నారు. కృషన్ (59 కేజీలు), రఫీక్ (71 కేజీలు), సచిన్ (98 కేజీలు) రజత పతకాలను సాధించారు. -
కామన్వెల్త్ రెజ్లింగ్లో భారత్ స్వర్ణాల జోరు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో అదరగొట్టారు. సింగపూర్లో జరుగుతున్న ఈ పోటీల పురుషుల ఫ్రీస్టరుుల్ విభాగంలో శనివారం సందీప్ తోమర్ (57కేజీ), అమిత్ ధన్కర్ (70కేజీ), సత్యవర్త్ కడియన్ (97కేజీ)లకు స్వర్ణాలు దక్కగా వినోద్(70కేజీ), రౌబల్జీత్ (97)లకు రజతాలు దక్కారుు. గ్రీకో రోమన్లో మనీష్ (66కేజీ), గుర్ప్రీత్ (75కేజీ), హర్ప్రీత్ సింగ్ (80కేజీ), ప్రభ్పాల్ (85కేజీ), నవీన్ (130కేజీ) తొలిస్థానంలో నిలిచారు. అలాగే మహిళల విభాగంలో రితూ ఫోగట్ (48కేజీ), రేష్మ మనే (63కేజీ), లలితా (55కేజీ), పింకీ, మను (58కేజీ) కూడా స్వర్ణాలు సాధించారు. జ్యోతి (75కేజీ), ని క్కీ, సోమాలి (75కేజీ) రజతాలు అందుకున్నారు.